STOCKS

News


మార్కెట్‌లోకి రోల్స్‌రాయిస్‌ ‘ఫాంటమ్‌-8’

Friday 23rd February 2018
auto-mobiles_main1519325007.png-14136

  • ప్రారంభ ధర రూ.9.5 కోట్లు 

చెన్నై: అల్ట్రా-లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘రోల్స్‌రాయిస్‌’ తాజాగా 8వ జనరేషన్‌ ఫాంటమ్‌ కారును భారత్‌ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.9.5 కోట్లు. ప్రొడక్టు పోర్ట్‌ఫోలియో విస్తరణ భాగంలో కంపెనీ ఈ కారును ఆవిష్కరించింది. ‘మాకు మంచి భాగస్వామి (కేయూఎన్‌ ఎక్స్‌క్లూజివ్‌) లభించింది. దక్షిణ భారతదేశంలో వ్యాపారం వృద్ధి చెందుతోంది’ అని రోల్స్‌రాయిస్‌ మోటార్‌ కార్స్‌ (ఆసియా-పసిఫిక్‌) రీజినల్‌ డైరెక్టర్‌ పాల్‌ హారిస్‌ తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన కారు ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. కేయూఎన్‌ ఎక్స్‌క్లూజివ్‌ చెన్నై, హైదరాబాద్‌లో కంపెనీకి అధికారిక డీలర్‌గా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. కాగా రోల్స్‌రాయిస్‌కి దక్షిణ భారతదేశంలో ఐదు ఔట్‌లెట్స్‌ ఉన్నాయి.
6.75 లీటర్‌ ఇంజిన్‌..
ఫాంటమ్‌-8లో 6.75 లీటర్‌ ట్విన్‌ టర్బోచార్జ్‌డ్‌ వీ-12 ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.4 సెకన్లలో అందుకుంటుందని పేర్కొంది. ఇక ఫాంటమ్‌ స్టాండర్డ్‌ వీల్‌బేస్‌ వేరియంట్‌ ధర రూ.9.5 కోట్లుగా, ఫాంటమ్‌ ఎక్స్‌టెండెడ్‌ వీల్‌బేస్‌ వేరియంట్‌ ధర రూ.11.35 కోట్లుగా ఉంటుందని తెలిపింది. నాలుగేళ్ల సర్వీస్‌ ప్యాకేజ్‌, రీజినల్‌ వారంటీ వంటివి ఈ ధరలో భాగమేనని పేర్కొంది. 



You may be interested

‘టైమ్‌’.. చాలా ఖరీదు!!

Friday 23rd February 2018

ప్రీమియం వాచీలకు డిమాండ్‌ వేగంగా వృద్ధి చెందుతున్న భారత్‌ 2025 నాటికి టాప్‌-10లో చేరిక హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: చోపా, పాటక్‌ ఫిలిప్‌, జేగర్‌ లేకూట్‌, వషెరో కున్‌స్టాంటా, ఒడేమార్‌ పీగే, ఒమేగా, రోలెక్స్‌, టాగ్‌ హోయెర్‌.. ఇటువంటి అత్యంత ఖరీదైన చేతి వాచీ బ్రాండ్లకు భారతీయులు ఉవ్విల్లూరుతున్నారట. ఇలాంటివి ఇప్పుడు 30 దాకా బ్రాండ్లు ఇక్కడ కొలువుదీరాయి. వీటికోసం కోట్ల రూపాయలు వెచ్చించేందుకు కస్టమర్లు వెనుకాడడం లేదు. సాధారణ వాచీలతో పోలిస్తే ఖరీదైన మోడళ్ల

ఫెడరల్‌ బ్యాంక్‌ చేతికి ఈక్విరస్‌లో 26 శాతం వాటా

Friday 23rd February 2018

ఇన్వె‍స్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ రంగంలోకి అరంగేట్రం  ముంబై: ప్రైవేట్‌ రంగ ఫెడరల్‌ బ్యాంక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ రంగంలోకి ప్రవేశించింది. ఇన్వెస్ట్‌మెంట్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈక్విరస్‌ క్యాపిటల్‌లో 26  శాతం వాటాను కొనుగోలు చేశామని ఫెడరల్‌ బ్యాంక్‌ తెలిపింది. ఈ సంస్థలో వాటా కొనుగోలు ద్వారా ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ రంగంలోకి ప్రవేశిస్తున్నామని బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గణేశ్‌ శంకరన్‌ తెలిపారు. ఈ వాటా కొనుగోలుతో క్లయింట్లకు మరింత విస్తృతంగా సేవలందించగలమని పేర్కొన్నారు. డెట్‌, ఈక్విటీ మార్కెట్లకు

Most from this category