STOCKS

News


వరల్డ్‌ టాప్‌ 75 కంపెనీల్లో ఆర్‌ఐఎల్‌

Friday 15th March 2019
news_main1552631037.png-24625

ప్రపంచంలో మార్కెట్‌క్యాప్‌ పరంగా టాప్‌ 75 కంపెనీల్లోకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చేరింది. దాదాపు 12300 కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌తో ఆర్‌ఐఎల్‌ ఈ జాబితాలో అడుగు పెట్టింది. ప్రస్తుతం ఈ టాప్‌ 75 కంపెనీల సరాసరి మార్కెట్‌ క్యాప్‌ విలువ 16100 కోట్ల డాలర్లు. గతేడాది కాలంలో ఆర్‌ఐఎల్‌ షేరు దాదాపు 45 శాతం ర్యాలీ జరిపింది. ప్రపంచంలో గతేడాది మంచి రాబడులు ఇచ్చిన టాప్‌ 100 కంపెనీల్లో మూడో స్థానంలో ఆర్‌ఐఎల్‌ ఉందని మెర్క్‌ వెల్లడించింది. ప్రపంచ ఎనర్జీ కంపెనీలైన ఎక్సాన్‌, చెవ్రాన్‌, బీపీ, బీహెచ్‌పీ లాంటివి మూడేళ్లలో ఇచ్చిన సరాసరి రాబడి కన్నా ఆర్‌ఐఎల్‌ ఐదు రెట్లు అధిక రిటర్న్స్‌ ఇచ్చిందని తెలిపింది. ఐదేళ్లలో ఆర్‌ఐఎల్‌ దాదాపు 7500 కోట్ల డాలర్ల మూలధనవ్యయం చేసింది. దేశీయ కంపెనీలన్నింటిలో ఇదే అత్యధికం. దీంతో కంపెనీ రుణభారం ఐదేళ్లలో దాదాపు ఒకటిన్నర రెట్లు పెరిగి 3939 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. అయితే కంపెనీ పెట్టిన పెట్టుబడులన్నీ మంచి రాబడులు ఇచ్చే వెంచర్స్‌ కావడంతో షేరు కౌంటర్లో భారీ కొనుగోళ్లు నమోదయ్యాయి. దీంతో కంపెనీ ప్రమోటర్‌ ముకేశ్‌ అంబానీ సంపద 5280 కోట్ల డాలర్లను చేరింది. ప్రపంచ కుబేరుల జాబితాలో ఎనర్జీ రంగం నుంచి స్థానం దక్కించుకున్న ఏకైక వ్యాపారవేత్త ముకేశ్‌ కావడం విశేషం. 



You may be interested

రూపాయి ర్యాలీ: ఐనా ఐటీ షేర్లకు గిరాకీ..!

Friday 15th March 2019

డాలర్‌ మారకంలో రూపాయి భారీ బలపడినప్పటికీ, ఐటీ షేర్ల ర్యాలీ కొనసాగుతుంది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ శుక్రవారం ట్రేడింగ్లో దాదాపు 1.50శాతం లాభపడింది. ఇండెక్స్‌లో అత్యధికంగా 2శాతం లాభపడింది. విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, టాటా ఎలాక్సీ షేర్లు 1.50శాతం పెరిగాయి. అలాగే ఎన్‌ఐఐటీ టెక్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు సైతం 1శాతం పెరిగాయి. అలాగే ఇన్ఫీభీమ్‌ షేరు అరశాతం ర్యాలీ చేసింది.

మళ్లీ 1300 డాలర్ల దిగువకు పసిడి

Friday 15th March 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర తిరిగి 1300డాలర్ల దిగువకు చేరుకుంది. యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌ ఒ‍ప్పంద ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, డాలర్‌ ఇండెక్స్‌ స్థిరమైన ర్యాలీ పసిడి ధరపై అమ్మకాల ఒత్తిడిని పెంచాయి. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి ఎలాంటి ఒప్పందం లేకుండా బ్రిటన్‌ నిష్క్రమించాలనే ప్రతిపాదన బ్రిటన్‌ దిగువ సభ హౌస్‌ ఆఫ్‌ కామర్స్‌లో వీగిపోయింది. మరోవైపు ఆరుప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ ఐదురోజుల తర్వాత తిరిగి పుంజుకోవడం పసిడికి ప్రతికూలాంశగా

Most from this category