STOCKS

News


పరిశోధన మీది.. పెట్టుబడి మాది!

Friday 22nd December 2017
startups_main1513961815.png-12465

  •  రీసెర్చ్‌ స్కాలర్స్, ఇన్వెస్టర్లను కలిపే రీసెర్చ్‌ ఫండర్స్‌
  •  ఇప్పటికే 30కి పైగా పరిశోధనల నమోదు; కోటికి పైగా పెట్టుబడి
  •  త్వరలోనే హైదరాబాద్‌లో ఏఐ ఆర్‌అండ్‌డీ ల్యాబ్‌
  •  కలారి క్యాపిటల్‌ నుంచి రూ.5 కోట్ల నిధుల సమీకరణ
  •  ‘స్టార్టప్‌ డైరీ’తో రీసెర్చ్‌ ఫండర్స్‌ ఫౌండర్‌ అకిరా పీఎస్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హవాయ్‌ చెందిన ఓ రీసెర్చ్‌ స్కాలర్‌ ‘అగ్నిపర్వతాల నుంచి విద్యుత్‌ తయారీ’ అంశాన్ని శోధిస్తున్నాడు.
జర్మనీకి చెందిన మరో స్కాలర్‌ ‘మైక్రోసెన్సార్లతో భవనాల్లో విద్యుత్‌ వినియోగాన్ని ఎలా చేయాలి’ అనేది పరిశోధిస్తున్నాడు.
ఢిల్లీకి చెందిన ఇంకో రీసర్చర్‌ ‘డ్రోన్లు, సెన్సార్ల ఆధారంగా గాలి, కాలుష్యం స్థాయి ఎలా ఉంటుందోనని’ చూస్తున్నాడు. 
.. ఇలా ఒకటి, రెండూ కాదు!. సైన్స్, సామాజిక అంశాలపై 30కి పైగా రీసెర్చ్‌లు జరుగుతున్నాయి. వీటన్నింటికీ వేదిక మన తెలుగు కుర్రాడి స్టార్టప్‌ ‘రీసెర్చ్‌ ఫండర్స్‌’!! నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన అకీరా పీఎస్‌ ప్రారంభించిన రీసెర్చ్‌ ఫండర్స్‌ గురించి మరిన్ని వివరాలు ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే...
‘‘రీసెర్చ్‌ స్కాలర్స్‌కు ఎదురయ్యే ప్రధాన సమస్యలు.. నిధులు, మార్గదర్శనం, పరిశోధన పరికరాలు. ఇక ల్యాబ్, ఆర్‌అండ్‌డీ కోసమైతే కోట్లలోనే ఖర్చవుతుంది. కానీ, ప్రభుత్వమిచ్చే నిధులు 40 శాతమే. మిగిలిన మొత్తాన్ని స్కాలర్లు సమకూర్చుకోలేక మధ్యలోనే పరిశోధనలు నిలిపేస్తున్న సంఘటనలు బోలెడు. ‘ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ’ అంశంపై ఎంఎస్‌ చేస్తున్న సమయంలో నాకూ ఇవన్నీ ఎదురయ్యాయి. దీనికి పరిష్కారం చూపే క్రమంలోనే ‘రీసెర్చ్‌ ఫండర్స్‌.ఓఆర్‌జీ’ సంస్థను ప్రారంభించా. రూ.18 లక్షల పెట్టుబడితో గతేడాది సెప్టెంబర్‌లో మొదలైంది. రీసెర్చ్‌ స్కాలర్లు, ఇన్వెస్టర్లను కలపడమే మా పని. అంటే రీసెర్చ్‌ అకడమిక్‌కు మాది ఒక సామాజిక వేదికక్న మాట. 
స్కాలర్లకు రూ.1.4 కోట్ల నిధులు..
బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎకనమిక్స్, డాటా సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, పొలిటికల్‌ సైన్స్‌ వంటి 25కి పైగా సబ్జెక్ట్‌ల్లోని పరిశోధనలను మా వేదికపై నమోదు చేసుకోవచ్చు. ఇప్పటివరకు 30కి పైగా పరిశోధన ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి. మన దేశంతో పాటూ జర్మనీ, యూకే, సింగపూర్‌ దేశాల నుంచి కూడా పరిశోధనలున్నాయి. రీసెర్చ్‌ ఫండర్స్‌లో 7 వేల మంది ఇన్వెస్టర్లు (బ్రాకర్స్‌) నమోదయ్యారు. ఇప్పటివరకు రీసెర్చ్‌ స్కాలర్స్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.1.4 కోట్ల నిధులను సమీకరించారు. 
నమోదు ఉచితమే, కానీ..
రీసెర్చ్‌ ఫండర్స్‌లో పరిశోధనల నమోదు ఉచితమే. కాకపోతే, నిధులు పొందాక దాన్లో 5 శాతం, ల్యాబ్‌కైతే 10 శాతం రీసెర్చ్‌ ఫండర్స్‌కు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మరి, ఇన్వెస్టర్లకేం ప్రయోజనమంటే.. రీసెర్చ్‌ స్కాలర్లు తమ పరిశోధన పూర్తయ్యాక దాని ఫలితాలను వారికి ఫండింగ్‌ ఇచ్చిన వారితోనే పంచుకోవాల్సి ఉంటుంది. గత నెలలో రూ.12 లక్షల వ్యాపారాన్ని నమోదు చేశాం.
హైదరాబాద్‌లో ఏఐ ఆర్‌అండ్‌డీ ల్యాబ్‌..
ప్రస్తుతం మా సంస్థలో ఆరుగురు ఉద్యోగులున్నారు. దేశంలో ఆర్‌ అండ్‌ డీ పరిశ్రమ విలువ 48 బిలియన్‌ డాలర్లు. పలు ఆర్‌అండ్‌డీ వర్సిటీలు, ప్రైవేట్‌ సంస్థల సహకారంతో హైదరాబాద్‌లో ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) అకాడమిక్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నాం. ఇందుకోసం కేంద్ర పరిశోధన విభాగం(సీబీడీ) తోనూ చర్చలు జరిపాం. కలారీ క్యాపిటల్‌ ‘కే స్టార్ట్‌’ కార్యక్రమంలో రూ.5 కోట్ల నిధులను సమీకరించనున్నాం. తొలి విడత చర్చలూ ముగిశాయి’’ అని అకీరా వివరించారు.
అకిరా పీఎస్‌కు జర్మనీ ఫెలోషిప్‌..
అకిరా పీఎస్‌ అసలు పేరు పరిశణబోయిన శ్రవణ్‌ కుమార్‌. హైదరాబాద్‌లోని టీకేఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తయ్యాక.. ఉద్యోగం రాకపోవటంతో జేఎన్‌టీయూలో ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీపై ఎంఎస్‌లో చేరాడు. ఆర్ధిక ఇబ్బందులతో మధ్యలోనే వదిలేసి.. అదే జేఎన్‌టీయూలో పరీక్షల విభాగంలో ఉద్యోగంలో చేరాడు. ‘‘అప్పుడే అనిపించింది ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో యువతకు నిరుద్యోగ సమస్యలేంటో? ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయో సరిగా తెలియవు? తెలిసినా ఎలా దరఖాస్తు చేసుకోవాలో? ఎలా ఎదుర్కోవాలో తెలియదని. దీనికి పరిష్కారం చూపించే క్రమంలోనే ఇంటర్నెట్‌ అవసరం లేకుండా స్థానిక ఉద్యోగ అవకాశాలను తెలుసుకునే ‘నోటిఫై యూ’ అనే ఓ సామాజిక సెర్చ్‌ ఇంజిన్‌ను అభివృద్ధి చేశా. ఇదెలా పనిచేస్తుందంటే ఉద్యోగార్థులు తమ విద్యార్హత, చిరునామా, ఫోన్‌ నంబరు వంటి వ్యక్తిగత వివరాలను నోటిఫై యూ డేటాబేస్‌లో నమోదు చేస్తే.. మీ అర్హతకు తగ్గ ఉద్యోగం స్థానికంగా ఎక్కడ ఉందో వెతికి సంబంధిత కస్టమర్‌ ఫోన్‌కు మెసేజ్‌ పంపిస్తుంది. 2013లో ప్రారంభించి.. 2014 డిసెంబర్‌కు వరకూ నోటిఫై యూను నడిపించాం. సుమారు 20 లక్షల మంది నమోదయ్యారు. నోటిఫై యూ ప్రాజెక్ట్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. దీన్ని గమనించిన జర్మనీలోని ఇంక్యుబేటర్‌ 2016లో సోషల్‌ ఆస్ట్రోనాట్‌ రీసెర్చ్‌లో ఫెలోషిప్‌ ఇచ్చింది’’ అని అకిరా తెలియజేశారు..
 
 You may be interested

ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌కు శశి అరోరా బై!

Friday 22nd December 2017

న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ నుంచి శశి అరోరా బయటకు వచ్చేశారు. మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో పదవులకు రాజీనామా చేశారు. యూఐడీఏఐ ఇటీవల ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఈకేవైసీ లైసెన్స్‌ను రద్దు చేసిన నేపథ్యంలో శశి రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ రాజీనామాను ఎయిర్‌టెల్‌ ద్రువీకరించింది. ‘అరోరా మాకు చాలా విలువైన వ్యక్తి. కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషించారు. టెలికం, డీటీహెచ్‌ వ్యాపారాలను విజయవంతంగా నడిపించారు. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌

సౌకర్యాలే ముఖ్యం కాదు

Friday 22nd December 2017

సాక్షి, హైదరాబాద్‌: అయితే ఇల్లు కొనే ప్రతి ఒక్కరూ తమ సౌకర్యాల్నే చూసుకోకూడదు. భవిష్యత్తు అవసరాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కారు లేదా బైకు ఉన్నవారికి ప్రజా రవాణా వ్యవస్థ అవసరం ఉండకపోవచ్చు. ఈ–మెయిళ్లు, కొరియర్ల యుగంలో పోస్టాఫీసులు అనవసరం కావచ్చు. ఇవే అంశాలు ఇతరులకు ముఖ్యమవుతాయని గుర్తుంచుకోండి. ఇంటిని అమ్మేటప్పుడు కీలకంగా మారతాయి. చేరువలోనే షాపింగ్‌ చేసుకోవడానికి అవకాశముందనుకోండి.. వారాంతపు రోజుల్లో బయటికి షికారు వెళ్లడానికి ఆసక్తిని చూపకపోవచ్చు. కానీ,

Most from this category