News


అప్పర్‌ సర్క్యూట్‌ను తాకిన రిలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌

Wednesday 13th September 2017
Markets_main1505291523.png-8501

ముంబై: గత నాలుగు సెషన్లో‍ 10శాతానికి పైగా లాభపడుతున్న రిలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ షేరు బుధవారం ట్రేడింగ్‌లో 5శాతం లాభపడి అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రిలిగేర్‌ లిమిటెడ్‌ సంస్థ తన హెల్త్ ఇన్సూరెన్సు విభాగాన్ని విక్రయించనుండటం షేరు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకడానికి దోహదపడింది. ఈ విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని యాక్సిస్‌ బ్యాంక్‌లో సంస్థకున్న రూ.450 కోట్ల మొండిబకాయిలను తీర్చనుంది. హెల్త్ ఇన్సూరెన్సు విక్రయానికి ప్రమోటర్లు, బోర్డు సభ్యుల నుంచి ఇప్పటికే అనుమతులు లభించాయి. ఈ విక్రయ వార్తలతో రిలిగేర్‌ లిమిటెడ్‌ షేర్‌ నేటి ఇంట్రాడేలో 5శాతం లాభపడి రూ.46.70ల వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ తాకి లాక్‌ అయ్యింది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.36.95లు, రూ.291.50లుగా ఉన్నాయి.







You may be interested

సుగర్‌, బ్యాంకు స్టాకుల హుషారు..

Wednesday 13th September 2017

దేశీయ సూచీలు బుధవారం కూడా పాజిటివ్‌గా కొనసాగుతున్నాయి. ఆర్‌ఐఎల్‌, హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్‌ అండతో సూచీలు పటిష్ఠంగా ట్రేడవుతున్నాయి. మధ్యాహ్న సమయానికి సెన్సెక్స్‌ 144 పాయింట్ల లాభంతో నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ కీలకమైన 32 వేల పాయింట్లపైన, నిఫ్టీ పదివేలవంద పాయింట్ల పైన కదలాడుతున్నాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు సుమారు అరశాతం లాభపడ్డాయి. బుధవారం ట్రేడింగ్‌లో బ్యాంకు షేర్ల జోరు పెరిగింది. ప్రైవేట్‌బ్యాంకుల్లో యస్‌బ్యాంక్‌ మినహా మిగిలినవి

ఒక్క ఏడాది = 14 ఏళ్లు...

Wednesday 13th September 2017

క్యూ కట్టనున్న పీఎస్‌యు ఐపీఓలు గత డిసెంబర్‌లో ప్రభుత్వ రంగ పీఎస్‌యుల్లో వాటాల ఉపసంహరణపై వాటాదారులతో ప్రభుత్వం చర్చలు ఆరంభించింది. పీఎస్‌యులను మరింత జవాబుదారీగా, పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు, ప్రభుత్వానికి నిధులు సమకూర్చేందుకు ఈ వాటాల ఉపసంహరణప్రక్రియ చేపడతారు. డిసెంబర్‌లో చర్చల అనంతరం వాటాల ఉపసంహరణకు ప్రధాని పచ్చజండా ఊపారు. దీంతో ఈ బడ్జెట్లో దీన్ని కీలకాంశంగా పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇంతవరకు రెండు పీఎస్‌యులు ఐపీఓకి వచ్చాయి. హడ్కో, కోచి షిప్‌యార్డ్‌

Most from this category