News


ఆర్‌కామ్‌కు ఎరిక్సన్‌ షాక్‌..!

Wednesday 16th May 2018
Markets_main1526457198.png-16503

  • ఎన్‌సీఎల్‌టీలో దివాలా పిటిషన్‌ 
  • 20శాతానికి పైగా నష్టపోయిన షేరు

ముంబై:- రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌కు వ్యతిరేకంగా టెక్నాలజీ దిగ్గజం ఎరిక్సన్‌ ఎన్‌సీఎల్‌టీలో దివాలా పిటిషన్‌ ధాఖలు చేయడంతో బుధవారం ఆర్‌కాం షేర్లు 20శాతానికి పైగా పతనమయ్యాయి. ఆర్‌కామ్‌కు చెందిన దేశవ్యాప్త నెట్‌వర్క్‌ను నిర్వహించేందుకు 2014లో ఎరిక్సన్‌ ఏడేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే బిల్లు చెల్లింపుల్లో ఆర్‌కాం విఫలమైంది. దీంతో ఆర్‌కామ్‌, దాని అనుబంధ సంస్థల నుంచి రూ.1,150 కోట్ల బకాయిలను రాబట్టేందుకు ఎరిక్సన్‌ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. ఎరిక్సన్‌  పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ స్వీకరించినందును ఆర్‌కామ్‌ ఆస్తుల విక్రయ ప్రక్రియ మరింత ఆలస్యం కావచ్చని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. ఈ అంశానికి తోడు నేడు  తాజాగా రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌లో సిస్టెమా శ్యామ్‌ టెలీసర్వీసెస్‌ 1.5 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్‌కామ్‌ షేరు ఇంట్రాడేలో 20శాతానికి పైగా నష్టపోయి రూ.9.95ల ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. మధ్యాహ్నం గం.1:10.ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.12.45)తో పోలిస్తే 16శాతం నష్టంతో రూ.10.45ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 9.60 రూ.41.77లుగా నమోదయ్యాయి.You may be interested

పీఎన్‌బీ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌

Wednesday 16th May 2018

అధ్వాన్న ఫలితాలే కారణమన్న బ్రోకరేజ్‌లు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అత్యంత అధ్వాన్న ఫలితాలు ప్రకటించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు బ్రోకరేజ్‌లు షాక్‌ ఇచ్చాయి. బ్యాంకు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. - ఎడెల్‌వీస్‌: రేటింగ్‌ను కొనొచ్చు నుంచి తగ్గించుకోండికి డౌన్‌గ్రేడ్‌ చేసింది. టార్గెట్‌ను మాత్రం యధాతధంగా రూ.70 వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఎదురుగా ఉన్న సవాళ్లు, అస్థిరతలు బ్యాంకుపై నమ్మకానికి సవాల్‌ అని తెలిపింది. ఇవన్నీ కలిపి బ్యాంకు  వాల్యూషన్‌,

డిసెంబర్‌కల్లా మిడ్‌క్యాప్స్‌ జోరు..!

Wednesday 16th May 2018

ముంబై: దీర్ఘకాలంలో మిడ్‌క్యాప్‌ రంగ షేర్లు మంచి ఆదాయ వృద్ధి రేటును నమోదుచేయనున్నాయని ఎన్విజన్ కాపిటల్ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నీలేష్ షా విశ్లేషించారు. రిస్క్‌ అడ్జెస్టెడ్‌ అప్‌సైడ్‌ కూడా ఉన్నతంగా మారనుందని వివరించారు. గడిచిన కొంతకాలంగా మిడ్‌క్యాప్స్‌ నష్టాల్లో ఉండగా.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐ) నికర అమ్మకందారులుగా ఉండడం, నియంత్రణ పరమైన కారణాల రిత్యా మ్యూచువల్‌ ఫండ్స్‌ పునఃవ్యవస్థీకరణ చోటుచేసుకోవడం లాంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో ఈ రంగ షేర్లలో అమ్మకాల

Most from this category