News


కరెన్సీకి 'మేకిన్ ఇండియా' భద్రతా ఫీచర్లు

Tuesday 18th July 2017
news_main1500321752.png-5538

న్యూఢిల్లీ: మేకిన్ ఇండియా నినాదానికి మరింతగా ఊతమిచ్చే దిశగా రిజర్వ్ బ్యాంక్‌ సోమవారం కరెన్సీ భద్రత ఫీచర్లకు సంబంధించి బిడ్లను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. గతంలో జారీ చేసిన రెండు టెండర్లను రద్దు చేస్తూ.. మేకిన్ ఇండియా ప్రమాణాలను తప్పనిసరి చేసే నిబంధనను జోడించి కొత్తగా మరో టెండర్‌ను జారీ చేసింది. దీని ప్రకారం సరఫరాదారు రెండేళ్ల వ్యవధిలో దేశీయంగా తయారీ యూనిట్ నెలకొల్పాలి. అలాగే క్రమంగా స్థానిక కంటెంట్‌ను కూడా పెంచాల్సి ఉంటుంది. పాకిస్తాన్ దేశస్థులు లేదా ఆ దేశ మూలాలు ఉన్న వారి సర్వీసులను ఈ ప్రాజెక్టులో ఉపయోగించబోమని బిడ్డరు హామీ ఇవ్వాల్సి ఉంటుంది. సెక్యూరిటీ థ్రెడ్స్‌, ఇంకు, సెక్యూరిటీ ఫైబర్‌, అడ్వాన్స్‌డ్ వాటర్‌మార్క్ మొదలైనవి సరఫరా చేసేందుకు ఆర్‌బీఐ ఈ టెండర్‌ను ఉద్దేశించింది.







You may be interested

ఐపీవో యోచనలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్

Tuesday 18th July 2017

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ తాజాగా ఐపీవోకి రావాలని నిర్ణయించింది. నియంత్రణ సంస్థల నుంచి అనుమతి ఇంకా రాకపోవడంతో మ్యాక్స్ లైఫ్‌తో విలీన ప్రతిపాదనను ప్రస్తుతం పక్కకు పెట్టాలని భావిస్తోంది. సోమవారం సమావేశమైన హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ బోర్డు ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. పెయిడప్‌ క్యాపిటల్‌లో గరిష్టంగా 20 శాతం వాటాలను ఆఫర్‌ ఫర్ సేల్ రూపంలో ఐపీవో కింద విక్రయించాలని నిర్ణయించుకున్నట్లు స్టాక్‌ ఎక్స్చేంజీలకు కంపెనీ

ఏసీసీ లాభం రూ.326 కోట్లు

Tuesday 18th July 2017

న్యూఢిల్లీ: మెరుగైన అమ్మకాలతో సిమెంట్‌ దిగ్గజం ఏసీసీ జూన్‌ త్రైమాసికంలో రూ.326 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన రూ.246 కోట్లతో పోల్చుకుంటే తాజాగా 32 శాతం మేర వృద్ధి చెందింది. కన్సాలిడేటెడ్‌ విక్రయాలు 18 శాతం అధికమై రూ.3,818 కోట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు రూ.3,238 కోట్లు. సిమెంట్‌ విక్రయాలు 10 శాతం అధికంగా 6.74 మిలియన్‌ టన్నులు అమ్ముడుపోయినట్టు కంపెనీ

Most from this category