STOCKS

News


2018లో రేటు పెరుగుదల లేనట్లే!

Tuesday 13th March 2018
news_main1520961152.png-14642

  •  విశ్లేషకుల అభిప్రాయం

ముంబై: ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, 2018లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు- రెపో (ప్రస్తుతం 6 శాతం)ను తగ్గించే అవకాశాలు కనిపించడం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు. 
♦ బడ్జెట్‌లో ఆహార ధాన్యాలకు కనీస మద్దతు ధర పెంపు (ఎంఎస్‌పీ)- ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2018-19 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసే అవకాశం ఉందని జపాన్‌ బ్రోకరేజ్‌ సంస్థ- నొమురా అభిప్రాయపడింది. 
♦ పారిశ్రామిక వృద్ధి రేటు మెరుగుపడిన నేపథ్యంలో వచ్చే ఆరు నెలల్లో ఆర్‌బీఐ రేటు తగ్గింపునకు అవకాశం లేదని దేశీయ క్రెడిట్‌ రేటింగ్స్‌ ఏజెన్సీ క్రిసిల్‌ పేర్కొంది.  వినియోగ డిమాండ్‌, గృహ అద్దె అలవెన్సులు, క్రూడ్‌ ధరల పెరుగుదల వంటి అంశాల వల్ల రిటైల్‌ ద్రవ్యోల్బణం 2018-19లో సగటున 4.6 శాతం నమోదయ్యే అవకాశం ఉందని క్రిసిల్‌ అంచనా అంచనా వేస్తోంది. 
♦ సింగపూర్‌ బ్యాంక్‌ డీబీఎస్‌ కూడా రేటు తగ్గింపునకు అవకాశం లేదని తన తాజా విశ్లేషణలో వివరించింది. 

రేటు పావుశాతం పెరగవచ్చు: కేర్‌ రేటింగ్స్‌
కాగా రెపోను 018లో పావుశాతం పెంచే అవకాశం ఉందని కేర్‌ రేటింగ్స్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. ద్రవ్యోల్బణం అధిక శ్రేణికి పెరిగే అవకాశం ఉండడమే దీనికి కారణమని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించిన నికర వ్యత్యాసమైన ద్రవ్యలోటు పెరుగుతోందని, చమురు ధరల తీవ్రత, వ్యవసాయ వృద్ధి తగ్గడం వంటివి ధరల పెరుగుదలకు దారితీసే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 2 శాతం ప్లస్‌, 2 శాతం మైనస్‌తో 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం ఉండాలన్నది ఆర్‌బీఐ లక్ష్యం. అయితే ఈ శ్రేణికి మించి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని కేర్‌ తన నివేదికలో వెల్లడించింది.

బీఓఏఎంఎల్‌ భిన్నం...
ఇదిలాఉండగా, ఆగస్టులో  పాలసీ రేటును పావుశాతం తగ్గిస్తుందని అంతర్జాతీయ బ్యాంకింగ్‌ సేవల దిగ్గజం- బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిలించ్‌ (బీఓఏఎంఎల్‌) అంచనావేస్తోంది. ‘ద్రవ్యోల్బణం పెరిగినా... ఆర్‌బీఐ ఫ్రేమ్‌వర్క్‌ రేంజ్‌లోనే కొనసాగే అవకాశం ఉంది. ఇదే ఆర్‌బీఐ రేటు తగ్గింపు నిర్ణయానికి దోహదపడే కారణమవుతుందని భావిస్తున్నాం’’అని తన తాజా నివేదికలో పేర్కొంది. You may be interested

గ్రామీణ బ్యాంకులపై ప్రై‘వేటు’!

Tuesday 13th March 2018

 ప్రైవేటీకరణ దిశగా కేంద్రం సన్నాహాలు...  ప్రైవేటు సంస్థలకు నేరుగా వాటా విక్రయం..!  వాటాకు అనుగుణంగా బోర్డ్‌ మెంబర్లలో సభ్యత్వం కూడా..  పబ్లిక్‌ ఇష్యూలకు సైతం సన్నాహాలు...  వాటాలను పూర్తిగా కోల్పోనున్న రాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా కేంద్రం చకచకా పావులు కదుపుతోంది. ఈ ప్రక్రియను ముందుగా గ్రామీణ బ్యాంకులతో మొదలుపెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల్లో 49 శాతం వరకూ వాటాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. అంతేకాకుండా

2025 కల్లా ప్రతి ఐదు లావాదేవీల్లో నాలుగు డిజిటలే!!

Tuesday 13th March 2018

ఏసీఐ వరల్డ్‌వైడ్‌, ఏజీఎస్‌ ట్రాన్స్‌యాక్ట్‌ నివేదికలో వెల్లడి  న్యూఢిల్లీ: భారత్‌లో డిజిటల్‌ ట్రాన్సాక‌్షన్ల విలువ 2025 కల్లా ఏడాదికి లక్ష కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. పెద్ద నోట్ల రద్దు, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం వంటి అంశాలు దీనికి కారణంగా నిలుస్తాయని ఏసీఐ వరల్డ్‌వైడ్‌, ఏజీఎస్‌ ట్రాన్స్‌యాక్ట్‌ టెక్నాలజీస్‌ సంయుక్త నివేదిక పేర్కొంది. ప్రతి ఐదు లావాదేవీల్లో నాలుగు డిజిటల్‌ రూపంలో ఉంటాయని తెలిపింది. ప్రసుత్తం ఇండియాలో డిజిటల్‌ ట్రాన్సాక‌్షన్లు

Most from this category