STOCKS

News


ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటు బ్యాంకే!

Friday 15th March 2019
news_main1552622685.png-24620

  • ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటు బ్యాంకే!
  • ఆర్‌బీఐ వర్గీకరణ

ముంబై: ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రైవేటు రంగ బ్యాంకుగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వర్గీకరించింది. జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) మెజారీటీ వాటా కొనుగోలు నేపథ్యంలో ఈ వర్గీకరణ జరిగింది. బ్యాంకులో 51 శాతం వాటాపై నియంత్రణ ప్రక్రియను ఎల్‌ఐసీ జనవరిలో పూర్తిచేసింది. జనవరి 21 నుంచీ ప్రైవేటు రంగ బ్యాంక్‌గా ఐడీబీఐ బ్యాంక్‌  వర్గీకరణ అమల్లోకి వస్తుందని ఆర్‌బీఐ ప్రకటన తెలిపింది. ఈ వాటా కోసం ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ రూ.21,624 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ఎల్‌ఐసీ పెట్టుబడులతో ఐడీబీఐ బ్యాంక్‌ కామన్‌ ఈక్విటీ టైర్‌-వన్‌(సెట్‌-1) మూలధనం గత ఏడాది డిసెంబర్‌ 31 నాటికి 9.32 శాతానికి పెరిగింది. అంతకు ముందటి ఏడాది ఇదే సమయానికి సెట్‌-1 మూలధనం 6.62 శాతంగానే ఉంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో ఐడీబీఐ బ్యాంక్‌ నికర నష్టాలు మూడు రెట్లు పెరిగి రూ.4,185 కోట్లకు చేరాయి. గత క్యూ3లో రూ.7,125 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.6,191 కోట్లకు తగ్గింది. స్థూల మొండి బకాయిలు 24.72 శాతం నుంచి 29.67 శాతానికి పెరగ్గా, నికర మొండి బకాయిలు మాత్రం 16.02 శాతం నుంచి 14.01 శాతానికి తగ్గాయి.  నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌- నిఫ్టీలో  బ్యాంక్‌ షేర్‌ గురువారం రూ.43 వద్ద ముగిసింది. 

ఎల్‌ఐసీతో వ్యూహాత్మక ప్రణాళికలు...
మొండిబకాయిలతో సతమతమవుతున్న ఐడీబీఐ బ్యాంక్‌ ఆర్‌బీఐ దిద్దుబాటు చర్యల చట్రంలో ఉంది. దీంతో కంపెనీలకు రుణాలు, బ్రాంచిల విస్తరణ, వేతనాల పెంపు తత్సబంధ అంశాల్లో బ్యాంకుపై నియంత్రణలు ఉంటాయి. బ్యాంకింగ్‌, బీమా రంగాలను ఒకే గొడుకు కిందకు తీసుకువచ్చి తద్వారా వృద్ధి బాటలో సాగడానికి ఐడీబీఐ బ్యాంక్‌ తన కొత్త​ యాజమాన్యం ఎల్‌ఐసీతో కలిసి వ్యూహాత్మక ప్రణాళిక రూపొందిస్తోంది. రియల్టీ, వాణిజ్య, రెసిడెన్షియల్‌ స్పేస్‌, బ్యాంక్‌ బ్రాంచీలు, ఏటీఎంలు, డిజిటల్‌ మార్కెటింగ్‌ వంటి వనరులను పరస్పరం వినియోగించుకోడానికి ఒక ఉమ్మడి పెట్టుబడుల వ్యూహాన్ని బ్యాంక్‌, ఎల్‌ఐసీ రూపొందిస్తున్నాయి. 

ఐడీబీఐ బ్యాంక్‌కు రూ.12,000 కోట్ల ఎల్‌ఐసీ నిధులు !
ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ మరో రూ.12,000 కోట్లు పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో మొండి బకాయిలకు కేటాయింపుల కోసం ఈ స్థాయి పెట్టుబడులను ఎల్‌ఐసీ సమకూరుస్తుందని సమాచారం. ఈ విషయమై ఇటీవలనే ఇరు సంస్థల ఉన్నతాధికారులు ఆర్థిక సేవల విభాగం అధికారులతో సమావేశమయ్యారు. కాగా తాజా పెట్టుబడుల విషయమై ఎల్‌ఐసీ ఇప్పటి వరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఐడీబీఐ బ్యాంక్‌ పేరును మార్చాలని ఐడీబీఐ బ్యాంకు డైరెక్టర్ల బోర్డ్‌ కూడా గతంలో ప్రతిపాదించింది. ఎల్‌ఐసీ ఈ బ్యాంక్‌ను టేకోవర్‌ చేసినందున ఈ బ్యాంక్‌ పేరును ఎల్‌ఐసీ ఐడీబీఐ బ్యాంక్‌గా గానీ, లేదా ఎల్‌ఐసీ బ్యాంక్‌గా గానీ మార్చాలని బోర్డ్‌ ప్రతిపాదించింది. You may be interested

మొండి బకాయిలు తగ్గుతాయ్‌...!

Friday 15th March 2019

ఇక్రా నివేదిక వెల్లడి  ముంబై: వరుసగా నాలుగేళ్లపాటు నష్టాలతో కుదేలైన ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మంచి లాభాలు సాధిస్తాయని ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ, ఇక్రా తాజా నివేదిక వెల్లడించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి స్థూల మొండి బకాయిలు 8.1-8.4 శాతానికి దిగివస్తాయని, ఫలితంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు రూ.23,000-37,000 కోట్ల రేంజ్‌లో నికర లాభం సాధిస్తాయని పేర్కొంది. అయితే మొత్తం మీద లాభదాయకత బలహీనంగానే ఉండగలదని

కంపెనీలకు కాసులు కురిపించే పోల్‌ సీజన్‌

Friday 15th March 2019

కంపెనీలకు కాసులు కురిపించే పోల్‌ సీజన్‌ బిస్కట్లు, స్నాక్స్‌, పానీయాలకు డిమాండ్‌ 2014 ఎన్నికల సీజన్‌తో పోలిస్తే పెరుగుతుందని అంచనా అదనపు నిల్వలతో పెరిగే డిమాండ్‌కు కంపెనీలు సిద్ధం డిస్ట్రిబ్యూటర్ల స్థాయిలో అమ్మకాలపై ప్రోత్సాహకాలు న్యూఢిల్లీ: మన దేశంలో ఎన్నికలు ఓ పెద్ద మార్కెట్‌. ఎప్పుడు ఎన్నికలు జరిగినా... రాజకీయ పార్టీలకు ప్రచార సామగ్రిని సమకూర్చే వారికి బోలెడంత ఉపాధి. మరీ ముఖ్యంగా కంపెనీల ఉత్పత్తుల అమ్మకాలూ జోరుగా సాగుతాయి. బిస్కట్లు, స్నాక్స్‌, పానీయాలు పెద్ద ఎత్తున

Most from this category