STOCKS

News


మార్కెట్ లావాదేవీలపై ఒకే పన్ను

Monday 30th April 2018
Markets_main1525102957.png-16026

  •  పీడబ్ల్యూసీ సిఫార్సు

న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలపై బహుళ పన్నులు వడ్డించడం కాకుండా ఒకే పన్ను విధానాన్ని అమలు చేయాలని ట్యాక్స్ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా అభిప్రాయపడింది. బహుళ పన్నుల వల్ల లావాదేవీల వ్యయం పెరిగిపోయి, దేశీ మార్కెట్ల విషయంలో ఇన్వెస్టర్ల ఆసక్తిపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విధిస్తున్న సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌లలో ఏదో ఒకటి మాత్రమే విధించాలని ఆదాయ పన్ను చట్టాల సవరణపై అధ్యయనానికి ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌కు సిఫార్సు చేసింది. ఆదాయ పన్ను రిటర్నులకు సంబంధించి ప్రవాసీ ఇన్వెస్టర్లు పాటించాల్సిన నిబంధనల సంఖ్యను కూడా తగ్గించాలని సూచించింది. దాదాపు యాభై ఏళ్ల నాటి ఆదాయ పన్ను చట్టాన్ని ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సవరించే దిశగా తగు సిఫార్సులు చేసేందుకు కేంద్రం గతేడాది నవంబర్‌లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. దీనికి అరబింద్ మోదీ (సీబీడీటీ సభ్యుడు) కన్వీనర్‌గా ఉండగా, గిరీష్ అహూజా (చార్టర్డ్ అకౌంటెంట్), రాజీవ్ మెమానీ (ఈవై రీజనల్ మేనేజింగ్ పార్ట్‌నర్‌) మొదలైన ఆరుగురు సభ్యులుగా ఉన్నారు.
 



You may be interested

కార్పొరేట్ మోసాలపై ఉక్కు పాదం

Monday 30th April 2018

 సమాచారమిచ్చేలా ప్రజావేగులకు ప్రోత్సాహం  కేంద్ర మంత్రి పి.పి. చౌదరి వెల్లడి న్యూఢిల్లీ: కార్పొరేట్ మోసాలను అరికట్టడంపై కేంద్రం మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా కార్పొరేట్ సంస్థల్లో సందేహాస్పద కార్యకలాపాలేమైనా కనిపించిన పక్షంలో ప్రభుత్వం దృష్టికి తెచ్చేలా ప్రజావేగులను మరింతగా ప్రోత్సహించనుంది. అలాగే, కంపెనీల చట్టం కింద ఆయా సంస్థలు దాఖలు చేసే ఫైలింగ్స్‌లో.. కంపెనీ అధికారుల ఆధార్ సంఖ్య వివరాలను కూడా పొందుపర్చడం తప్పనిసరి చేసేలా చర్యలు తీసుకుంటోంది. కార్పొరేట్ వ్యవహారాల

డీమార్ట్‌ ర్యాలీ ఎక్కడి వరకు...?

Monday 30th April 2018

ఈక్విటీ మార్కెట్లో వ్యాల్యూ ఇన్వెస్టర్‌గా పేరుబడిన రాధాకిషన్‌ దమానీ అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ (డీమార్ట్‌) పేరుతో గతేడాది ఐపీవోకు వచ్చిన తర్వాత ఈ కంపెనీ షేరు అనూహ్యంగా పెరిగిపోయింది. ఆఫర్‌ ప్రైస్‌ రూ.299 అయితే, ప్రస్తుతం ఈ స్టాక్‌ ధర రూ.1,500 దరిదాపుల్లో ఉంది. ఐదు రెట్లు ర్యాలీ చేసింది. విశ్లేషకులను, ఫండ్‌ మేనేజర్లను, ఆర్థిక నిపుణులను ఈ ర్యాలీ ఆశ్చర్యపరించింది. మరి ఈ స్టాక్‌ గమనంపై వారి అభిప్రాయాలు

Most from this category