STOCKS

News


సీఏ సంస్థలపై చర్యలు తీసుకునే అధికారం లేదు

Friday 12th January 2018
news_main1515781122.png-13097

  • చార్టర్డ్‌ అకౌంటెంట్లపై ఇప్పటికే చర్యలు తీసుకున్నాం: ఐసీఏఐ

న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్స్‌ విషయంలో పాత్ర కలిగిన ఆడిటర్లపై విడిగా గరిష్ట పరిమితి మేరకు చర్యలు తీసుకున్నామని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) తెలిపింది. అయితే, సీఏ సేవలు అందించే సంస్థలపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది. సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణం నేపథ్యంలో ఆ సంస్థకు ఆడిటింగ్‌ సేవలు అందించిన ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌తో  పాటు దాని రెండు భాగస్వామ్య సంస్థలను రెండేళ్ల పాటు దేశంలో ఏ సంస్థకూ ఆడిటింగ్‌ సేవలు అందించకుండా సెబీ నిషేధించిన విషయం గమనార్హం. ఈ నేపథ్యంలో ఐసీఏఐ స్పందిస్తూ... తమ క్రమశిక్షణా కమిటీ జారీ చేసిన తీర్పునే సెబీ తన ఆదేశాల్లో పునరుద్ఘాటించినట్టు స్పష్టం చేసింది. సత్యం కంప్యూటర్స్‌ ఖాతాల అకౌంటింగ్‌ మోసంలో పాత్ర ఉన్న ఆరుగురు చార్టర్డ్‌ అకౌంటెం‍ట్ల సభ్యత్వాన్ని రద్దు చేయడం, వారికి పెనాల్టీలను విధించిన విషయాలను ఐసీఏఐ గుర్తు చేసింది. 



You may be interested

అంబులెన్స్‌ అడ్డా ‘స్టాన్‌ప్లస్‌’

Friday 12th January 2018

 సొంతగా 300 అంబులెన్స్‌లు  3 నెలల్లో బైక్‌ అంబులెన్స్‌లూ ప్రారంభం  జూన్‌ నాటికి రూ.65 కోట్ల సమీకరణ  స్టార్టప్‌ డైరీతో ఫౌండర్లు జోయిర్సన్‌, ప్రదీప్‌సింగ్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కుయ్‌.. కుయ్‌.. కుయ్‌మంటూ వచ్చే అంబులెన్స్‌ క్షణం ఆలస్యమైతే? ప్రాణం ఖరీదవుతుంది! నిజం, ఫ్రాన్స్‌కు చెందిన ఆంటోని పోయిర్సన్‌ విషయంలో జరిగిందిదే. చేతిలో డబ్బుతో.. బృందంతో.. పక్కా ప్రణాళికతో ఇండియాకు వచ్చాడు సోలార్‌ ప్లాంట్‌ పెడదామని! కానీ, ‘తానొకటి తలిస్తే.. దైవం ఇంకోటి తలచినట్లు’ సోలార్‌ ప్లాంట్‌

ఈ ఆర్థిక సంవత్సరంలో 6.6 శాతం వృద్ధి

Friday 12th January 2018

సింగపూర్‌ డీబీఎస్‌ అంచనా సింగపూర్‌: భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.6 శాతం వృద్ధిని సాధించగలదని సింగపూర్ బ్యాంకింగ్‌ దిగ్గజం డీబీఎస్‌ అంచనా వేసింది. ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందనే ప్రోత్సాహకర సూచనలు కనిపిస్తున్నాయని, క్రమానుగత రికవరీ కొనసాగుతోందని తన తాజా నివేదికలో డీబీఎస్‌ పేర్కొంది. వచ్చే ఏడాది భారత్‌ 7 శాతం వృద్ధి సాధించగలదని చెప్పిన ఈ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలివీ...  జీఎస్‌టీకి సంబంధించిన ప్రభుత్వ సవరణలు, బ్యాంక్‌లకు మూలధన నిధులు అందించడం,

Most from this category