STOCKS

News


ఒక్క ఏడాది = 14 ఏళ్లు...

Wednesday 13th September 2017
news_main1505290829.png-8498

క్యూ కట్టనున్న పీఎస్‌యు ఐపీఓలు
గత డిసెంబర్‌లో ప్రభుత్వ రంగ పీఎస్‌యుల్లో వాటాల ఉపసంహరణపై వాటాదారులతో ప్రభుత్వం చర్చలు ఆరంభించింది. పీఎస్‌యులను మరింత జవాబుదారీగా, పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు, ప్రభుత్వానికి నిధులు సమకూర్చేందుకు ఈ వాటాల ఉపసంహరణప్రక్రియ చేపడతారు. డిసెంబర్‌లో చర్చల అనంతరం వాటాల ఉపసంహరణకు ప్రధాని పచ్చజండా ఊపారు. దీంతో ఈ బడ్జెట్లో దీన్ని కీలకాంశంగా పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇంతవరకు రెండు పీఎస్‌యులు ఐపీఓకి వచ్చాయి. హడ్కో, కోచి షిప్‌యార్డ్‌ ఆఫర్లకు మంచి స్పందనే లభించింది. అయితే ఈ ప్రక్రియ ఇకపై మరింత ఊపందుకోనుంది. వచ్చే ఏడాది కాలంలో డజనుకు పైగా కంపెనీలు మార్కెట్లోకి రానున్నాయని ప్రభుత్వాధికారులు చెప్పారు. ఇది గత 14 సంవత్సరాల్లో ఐపీఓకి వచ్చిన పీఎస్‌యుల కన్నా ఎక్కువ. 2003-04 నుంచి 2011-12 మధ్య కాలంలో 13 పీఎస్‌యులు పబ్లిక్‌ ఆఫర్‌కు వచ్చాయి. అనంతరం ఐదేళ్లు ఒక్క కంపెనీ కూడా ఐపీఓ మొఖం చూడలేదు. దీంతో గత 14 సంవత్సరాల్లో మొత్తం 13 పిఎస్‌యు ఐపీఓలు వచ్చినట్లయింది. కానీ ఈ సారి ఒక్క సంవత్సరంలోనే అంతకన్నా ఎక్కువ ప్రభుత్వరంగ కంపెనీలు పబ్లిక్‌ ఆఫర్‌కు రానున్నాయి. 
53 కంపెనీలు మాత్రమే లిస్టెడ్‌...
దేశంలో మొత్తం 327 పీఎస్‌యులున్నాయి(బ్యాంకులు, బీమా కంపెనీలు కలిపి). ఇందులో కేవలం 53 కంపెనీలు మాత్రమే ఎక్చేంజ్‌ల్లో లిస్టయిఉన్నాయి. బీఎస్‌ఇ మార్కెట్‌ క్యాప్‌లో వీటి వాటా 9 శాతం మాత్రమే. వీటి మొత్తం విలువ రూ.5 లక్షల కోట్లు. ఇకపై కేవలం ఆమోదయోగ్యమైన కంపెనీల్లోనే వాటాలు ఉపసంహరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ పబ్లిక్‌ ఆఫర్‌కు వచ్చేందుకు ఆయా కంపెనీలు విముఖంగా ఉండడమే అతిపెద్ద సమస్య కానుంది. వ్యూహాత్మక సమస్యల కారణంగా రక్షణ రంగ కంపెనీలు ఆఫర్‌కు రావు, బీమాకంపెనీలు సున్నితమైనవి.. అంటూ జైట్లీనే తనబడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. రైల్వేకంపెనీలు లిస్టింగ్‌కు వచ్చేందుకు బ్యూరోక్రసీ అడ్డంకులున్నాయి. ఇక ఎల్‌ఐసీని ఇంతవరకు మార్కెట్లోకి తీసుకురాలేకపోయారు. నిజానికి ఈ కంపెనీకి ఉన్న విలువ దృష్టా‍్య అత్యంత విజయవంతమైన ఐపీఓగా నిలుస్తుందని అంచనాలున్నా ప్రభుత్వం చురుకుగా నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. కానీ ఇకపై ఈ మందకొడితనం వదిలి శీఘ్రంగా నిర్ణయాలు వెలువడతాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. You may be interested

అప్పర్‌ సర్క్యూట్‌ను తాకిన రిలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌

Wednesday 13th September 2017

ముంబై: గత నాలుగు సెషన్లో‍ 10శాతానికి పైగా లాభపడుతున్న రిలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ షేరు బుధవారం ట్రేడింగ్‌లో 5శాతం లాభపడి అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రిలిగేర్‌ లిమిటెడ్‌ సంస్థ తన హెల్త్ ఇన్సూరెన్సు విభాగాన్ని విక్రయించనుండటం షేరు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకడానికి దోహదపడింది. ఈ విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని యాక్సిస్‌ బ్యాంక్‌లో సంస్థకున్న రూ.450 కోట్ల మొండిబకాయిలను తీర్చనుంది. హెల్త్ ఇన్సూరెన్సు విక్రయానికి ప్రమోటర్లు, బోర్డు సభ్యుల నుంచి

1980లో యుఎస్‌ఎ, 90ల్లో చైనా, ఇప్పుడు మనం...

Wednesday 13th September 2017

వృద్ధి పరుగులకు సిద్ధంగా ఉన్న భారత్‌ స్టాక్ మార్కెట్ల ర్యాలీ మోదీ సర్కారు సంస్కరణలు, అంతర్జాతీయంగా లిక్విడిటీ ఇలా ఎన్నో అంశాల మేళవింపు కావచ్చు. మరి నిఫ్టీ 10,000 తర్వాత ఏంటి పరిస్థితి..? ఇప్పటికీ మన మార్కెట్లు ఈ దశలో పెట్టుబడి పెట్టేందుకు అనువైన స్థితిలోనే ఉన్నాయా? సంపద సృష్టికి ఇవి ఇప్పటికీ అనుకూల వేదికలేనా..? దీనిపై యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ఎండీ, సీఈవో అరుణ్‌తుక్రాల్‌ విశ్లేషణ ఇలా ఉంది. మన దేశ ఆర్థిక

Most from this category