STOCKS

News


3నెలల గరిష్టానికి ఐడీబీఐ బ్యాంక్‌..!

Thursday 22nd February 2018
Markets_main1519293241.png-14127

ముంబై:- ప్రభుత్వరంగ ఐడీబీఐ బ్యాంక్‌ షేరు గురువారం 6 శాతం లాభపడింది. ఓ ప్రైవేట్‌ ఈక్విటి సంస్థ ఐడీబీఐ బ్యాంకులో 10శాతం వాటా కొంటున్నదన్న వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ షేరు ర్యాలీ జరిపింది.. ఇటీవలే కేంద్ర ఆర్థికమంత్రి ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటీకరిస్తున్నట్లు వెలువడిన వార్తలు తోడవ్వడంతో ఐడీబీఐ బ్యాంకు కౌంటర్లో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. అలాగే మూలధన కల్పనలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అన్నింటికంటే అధికంగా ఐడీబీఐ బ్యాంక్‌కు రూ. 10,600 కోట్ల మూలధన నిధుల్ని కేంద్రం కేటాయించిన సంగతి తెలిసిందే. నేడు బీఎస్‌ఈలో ఐడీబీఐ బ్యాంక్‌ షేరు రూ.70.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఏకంగా 6 శాతం వరకూ ర్యాలీ చేసి రూ.74.90ల వద్ద 3 నెలల స్థాయిని తాకింది. మధ్యాహ్నాం గం.3:10లకు షేరు గతముగింపు ధర(రూ.70.35)తో పోలిస్తే 5శాతం లాభంతో రూ.74.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.50.25లు, రూ.85.20లుగా నమోదయ్యాయి. పీఎన్‌బీ కుంభకోణ నేపథ్యంలో ఇతర ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు రెండు వారాల నుంచి పతనబాట పట్టగా, ఐడీబీఐ బ్యాంకు మూడు నెలల గరిష్టానికి చేరడం విశేషం.

 



You may be interested

ఐటీ షేర్లు అమ్మేందుకు ఇదే సరైన సమయం: దీపన్ మెహతా

Thursday 22nd February 2018

ముంబై: గత ఆరు నెలలుగా ఐటీ రంగ షేర్లు కొనసాగిస్తున్న ర్యాలీని చూసి మంచి రాబడి అవకాశాన్ని వదులుకున్నామని ఏమాత్రం దిగులు చెందనవసరం లేదని అంటున్న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ సభ్యుడు దీపన్ మెహతా.. ఈ రంగంలో ఇప్పటికే హోల్డింగ్స్‌ ఉన్నవారు ఎగ్జిట్‌ అయిపోవడానికి ఇదే అనుకూలమైన సమయం అని సూచించారు. అంతకుముందు రెండు-మూడేళ్లు అండర్‌పెర్ఫార్మ్‌ చేసిన ఈ రంగ షేర్లు ఇప్పుడు ర్యాలీ చేయడం చూసి ఏమాత్రం తొందరపడవద్దని అన్నారు.

ఇలాంటి చర్యలతో ఇండియా మార్కెట్‌పై ఆసక్తి పోతుంది!

Thursday 22nd February 2018

దేశీయ స్టాక్‌ ఎక్చేంజ్‌ల నిర్ణయంతో నెగిటివ్‌ ప్రభావం ఏసియా సెక్యూరిటీస్‌ ఇండస్ట్రీ అండ్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌ అసోసియేషన్‌ అసహనం విదేశీ ఎక్చేంజ్‌లతో డేటా పంచుకోరాదని భారత్‌కు చెందిన మూడు ప్రధాన ఎక్చేంజ్‌లు నిర్ణయించుకోవడం సరికాదని, మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తుందని ఏసియా సెక్యూరిటీస్‌ ఇండస్ట్రీ అండ్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌ అసోసియేషన్‌ వ్యాఖ్యానించింది. అయితే ప్రస్తుతానికి భారత్‌ పట్ల విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి తగ్గలేదని, ఇప్పటికీ ఎఫ్‌పీఐలకు భారత్‌ ఆకర్షణీయంగా ఉందని తెలిపింది. అయితే ఎఫ్‌పీలకు

Most from this category