పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు డౌన్
By Sakshi

సోమవారం ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్ ఇంట్రాడేలో 2.50శాతం నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్ 2,895.35ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారభించింది. ఇంట్రాడేలో ఈ సూచీలో భాగమైన ఐడీఐబీ అత్యధికంగా 3.50శాతం నష్టపోయింది. ఇండియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు 2.50శాతం పతనమయ్యాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జమ్మూ&కాశ్మీర్ షేర్లు 2శాతం క్షీణించాయి. సెంట్రల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ షేర్లు 1.50శాతం పడిపోగా, ఓరియంటల్ బ్యాంక్ షేరు 1శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్నేషనల్బ్యాంక్, పీఎన్బీ షేర్లు అరశాతం పడిపోయాయి. మధ్యాహ్నం గం.2:45ని.లకు ఇండెక్స్ గత ముగింపు(2,895.80)తో పోలిస్తే 1.50శాతం నష్టంతో 2,849.00ల పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
You may be interested
ఐటీ, బ్యాంకింగ్‌లో ఈ షేర్లు బెటర్!
Monday 11th February 2019రిలయన్స్ సెక్యూరిటీస్ సూచనలు రాజకీయ అస్థిరతలు, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా దేశీయ మార్కెట్లో ఎఫ్ఐఐలు భారీగా పెట్టుబడులు ప్రస్తుతానికి పెట్టకపోవచ్చని ఆర్సెక్యూరిటీస్ ప్రతినిధి నవీన్ కులకర్ణి అభిప్రాయపడ్డారు. అన్ని మార్కెట్లలో ప్రస్తుతం లిక్విడిటీ సమస్య కనిపిస్తోందని, ఈక్విటీల్లో మరికొంత కాలం ఈ అనిశ్చిత పరిస్థితులు ఉండొచ్చని చెప్పారు. ఇప్పుడున్న మార్కెట్లో మిడ్‌క్యాప్ ఐటీ, బ్యాంకింగ్రంగాలు ఆకర్షణీయంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎర్నింగ్స్‌లో స్వల్ప ఆటుపోట్లు తప్ప మిడ్‌క్యాప్ ఐటీ విభాగం బాగానే
పట్టు నిలుపుకోలేకపోతున్న బుల్స్!
Monday 11th February 2019నిఫ్టీలో ఫాల్స్ బ్రేకవుట్ జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు కొన్ని వారాలుగా కన్సాలిడేట్ అవుతున్న నిఫ్టీ గతవారం 11వేల పాయింట్లను దాటి బ్రేకవుట్ ఇచ్చినట్లు కనిపించింది. కానీ వెనువెంటనే వెనుకంజ వేసి ప్రస్తుతం 10900 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దీంతో గతవారం బ్రేకవుట్ తప్పుదోవ పట్టించే సూచనా? అని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. నిఫ్టీ 11వేల పాయింట్ల పైన నిలదొక్కుకోనంత వరకు బుల్స్‌కు పట్టు చిక్కదని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీపై వివిధ అనలిస్టుల అంచనాలు 1. సెంట్రమ్