News


బకాయిల భారం తగ్గిన తర్వాతే విలీనాల పర్వం!

Wednesday 13th September 2017
news_main1505241566.png-8462

  •  బ్యాంకింగ్‌పై రఘురామ్‌ రాజన్‌ సూచన

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌లో తొలుత మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్య పరిష్కారానికే ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తదుపరే విలీనాల ప్రక్రియ ప్రారంభం కావాలని రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు. బ్యాంకుల మూలధన సమస్య పరిష్కారానికి కూడా ఇది కీలకమని ఒక ఇంటర్వ్యూలో ఆయన వివరించారు. ‘‘ముందు బ్యాంకింగ్‌ పటిష్టత దిశగా అడుగులు పడాలి. నిష్ణాతులైన వృత్తి నిపుణుతో బోర్డ్‌ క్రియాశీలం కావ్వాలి. బ్యాంకుల నిర్వహణా నైపుణ్యం పెరగాలి. రాజకీయ జోక్యం తగ్గాలి. ఆయా అంశాల్లో పురోగతి సాధించినప్పుడే విలీనాల దిశగా అడుగులు వేయాలి’’ అని రాజన్‌ అన్నారు. ప్రస్తుత బ్యాంకింగ్‌ సమస్యలు పరిష్కారం కానిదే విలీనాల దిశలో ముందడుగూ అంత తేలిక్కాదనీ అన్నారు. తాను ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్న సమయంలో ప్రారంభించిన రుణ నాణ్యాతా సమీక్ష (ఏక్యూఆర్‌) మొండిబకాయిల పరిష్కారంలో కీలక అడుగని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 
 
 బ్యాంకింగ్‌కు 65 బిలియన్‌ డాలర్లు సరిపోతాయ్‌: ఫిచ్‌
ఇదిలావుండగా, తాజా మూలధన కల్పనకు సంబంధించి అంతర్జాతీయ బాసెల్‌ 3 ప్రమాణాలకు అనుగుణంగా 2019 మార్చి నాటికి భారత్‌ బ్యాంకింగ్‌కు 65 బిలియన్‌ డాలర్లు అవసరమని రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. వృద్ధి అవసరాలకు ఈ మొత్తం కీలకమని పేర్కొంది.  ఇంతక్రితం తన 90 బిలియన్‌ డాలర్ల అంచనాలకన్నా ఇది తక్కువని పేర్కొంది. ఊహించినదానికన్నా రుణవృద్ధి తగ్గడం, రుణ పునర్‌వ్యవస్థీకరణ వంటి అంశాలు తమ అంచనాలను తగ్గించడానికి కారణంగా వివరించింది. 







You may be interested

20 నుంచి ఎస్‌బీఐ లైఫ్‌ ఐపీవో

Wednesday 13th September 2017

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఐపీవో సెప్టెంబర్‌ 20న ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 22న ముగియనున్న ఈ ఐపీవోలో భాగంగా సంస్థ రూ.8,400 కోట్లను సమీకరించనుంది. ఈ విషయాన్ని ఎస్‌బీఐ లైఫ్‌ తాజాగా స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు తెలియజేసింది. కాగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తర్వాత మార్కెట్‌లో లిస్ట్‌ కాబోతోన్న రెండో జీవిత బీమా కంపెనీ ఎస్‌బీఐ లైఫ్‌. మార్కెట్‌ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం ఎస్‌బీఐ లైఫ్‌

జెట్‌ ఎయిర్‌వేస్‌ లాభం రూ.53.5 కోట్లు

Wednesday 13th September 2017

ముంబై: దేశంలో రెండో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ జూన్‌ త్రైమాసికం స్టాండలోన్‌ లాభం రెట్టింపయ్యి రూ.53.5 కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో లాభం రూ.25.9 కోట్లుగా ఉంది. 2014 నుంచి ఇంధన ధరలు తగ్గుముఖం పట్టి, మార్కెట్‌ వృద్ధి మొదలైన తర్వాత వరుసగా తొమ్మిదో త్రైమాసికంలోనూ కంపెనీ లాభాన్ని నమోదు చేసింది. మొత్తం ఆదాయం రూ.5,341 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో

Most from this category