News


60 ఏళ్ల తర్వాత కూడా ఎన్‌పీఎస్‌లో చేరొచ్చు.

Wednesday 6th September 2017
personal-finance_main1504691013.png-8137

..
ఎన్‌పీఎస్‌(నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌)లో చేరడానికి గరిష్ట వయోపరిమితిని 60 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచాలని పెన్షన్‌ నియంత్రణ సంస్థ-పీఎఫ్‌ఆర్‌డీఏ నిర్ణయించింది. ఎన్‌పీఎస్‌లో 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయస్సున్న వ్యక్తులెవరైనా చేరవచ్చని పీఎఫ్‌ఆర్‌డీఏ(పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట​ అథారిటీ) చైర్మన్‌ హేమంత్‌ కాంట్రాక్టర్‌ తెలిపారు.  60 ఏళ్లు దాటిన వ్యక్తులు కూడా ఎన్‌పీఎస్‌లో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారని, అందుకే గరిష్ట వయోపరిమితిని 60 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచామని వివరించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను త్వరలో జారీ చేస్తామని పేర్కొన్నారు. భారత్‌లో ఆయుఃప్రమాణాలు పెరిగాయని, 60 ఏళ్లకే రిటైరైనా, పని చేసే సామర్థ్యం తమకుందని, ఎన్‌పీఎస్‌లో చేరే అవకాశం కల్పించాలని పలువురు అభ్యర్థించారని పేర్కొన్నారు. వృద్ధాప్యంలో ఆదాయ భద్రతకు ఎన్‌పీఎస్‌ ఒక మంచి అవకాశంగా అవతరిస్తోందని నిపుణులంటున్నారు. దీంట్లో ఎంచుకోవడానికి విభిన్నమైన ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్స్‌ ఉన్నాయని వివరించారు. 







You may be interested

రుచి సోయాకు డీమెర్జర్‌ బూస్ట్‌!

Wednesday 6th September 2017

 ​కంపెనీ రీస్ర్టక్చరింగ్‌  చేయనుందన్న వార్తలతో రుచిసోయా ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ ఊపందుకుంది. దీంతో కంపెనీ షేరు బుధవారం ఇంట్రాడేలో 11.5 శాతం వరకు  పెరిగింది. ప్రస్తుతం షేరు ధర రూ.21.90 వద్ద ట్రేడవుతోంది.కంపెనీని రెండు విడివిడి కంపెనీలుగా చేయడం‍పై కంపెనీ దృష్టి పెట్టింది. ఈ రోజు(బుధవారం) కంపెనీ బోర్డు మీటింగ్‌  ఈ విషయంపై చర్చించి ఆమోదం తెలిపింది. వంట నూనెల విభాగం, పామ్‌ ప్లాంటేషన్‌ , ఆయిల్‌ సీడ్‌ క్రషింగ్‌ , రినేవబుల్‌

ఈ షేర్లు ఇరవై ఏళ్లుగా పెరుగుతూనే ఉన్నాయ్‌..

Wednesday 6th September 2017

రెండు దశాబ్దాల్లో 50వేల శాతం రాబడులు మార్కెట్లో మూటలు సంపాదించాలంటే సింపుల్‌ సూత్రం ఒకటుందంటాడు వారెన్‌ బఫెట్‌... విలువైన కంపెనీలను గుర్తించి వాటి షేర్లను కొనుగోలు చేసి ఓపికగా వెయిట్‌ చేయడమే.. ఈ సూత్రం. దీన్నే వాల్యూ ఇన్వెస్టింగ్‌ అంటారు. బఫెట్‌ చెప్పే సూత్రం పలువురుని కుబేరులను చేసింది.  కొన్ని ఆణిముత్యాల్లాంటి షేర్లే ఇందుకు ఉదాహరణ. దేశీయంగా విత్తనాలు, కెమికల్స్‌ విక్రయ సంస్థ యుపిఎల్‌ అందరికీ తెలిసిన కంపెనీనే. గత రెండు దశాబ్దాల్లో

Most from this category