News


ఆన్‌లైన్‌ నియామకాల్లో 14 శాతం వృద్ధి

Wednesday 13th September 2017
news_main1505241899.png-8465

-మాన్‌స్టర్‌.కామ్‌ నివేదిక న్యూఢిల్లీ: దేశంలో ఆన్‌లైన్‌ నియామకాలు ఆగస్ట్‌ నెలలో 14 శాతం మేర పెరిగాయి. హోమ్‌ అప్లయెన్సెస్‌, బీఎఫ్‌ఎస్‌ఐ, ఎఫ్‌ఎంసీజీ వంటి విభాగాలు వృద్ధికి దోహదపడ్డాయి. ఇక రానున్న రోజులకు సంబంధించి ఉద్యోగ అంచనాలు ఆశాజనకంగానే ఉన్నాయి. ఈ విషయాలు మాన్‌స్టర్‌.కామ్‌ నివేదికలో వెల్లడయ్యాయి. దీని ప్రకారం.. ఆగస్ట్‌ నెలలో మాన్‌స్టర్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఇండెక్స్‌ 279 వద్ద ఉంది. వార్షిక ప్రాతిపదికన సూచీలో 14 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇండెక్స్‌ గతేడాది ఆగస్ట్‌లో 244 వద్ద, ఈ ఏడాది జూలైలో 274 వద్ద ఉంది. ‘హోమ్‌ అప్లయెన్సెస్‌, బీఎఫ్‌ఎస్‌ఐ, ఎఫ్‌ఎంసీజీ విభాగాల్లోని నియామకాల్లో వృద్ధి కొనసాగుతోంది. రియల్‌ ఎస్టేట్‌, రిటైల్‌, బీపీవో-ఐటీ, ఉత్పత్తి, తయారీ రంగాల్లో నియామకాలు పుంజుకోవాల్సి ఉంది. మొత్తంగా మార్కెట్‌ పలు సామాజిక, ఆర్థిక, సాంకేతిక కారణాల వల్ల డైనమిక్‌గా ఉంది’ అని మాన్‌స్టర్‌.కామ్‌ ఎండీ (అపెక్‌, మధ్య-తూర్పు ప్రాంతం) సంజయ్‌ మోదీ తెలిపారు. జీఎస్‌టీ వ్యవస్థ దేశంలో వ్యాపారాల సులభతరంపై సానుకూల ప్రభావం చూపుతుందని అంచనా వేశారు.
పండుగ సీజన్‌ నేపథ్యంలో గృహోపకరణాల విభాగంలో నియామకాలు వార్షిక ప్రాతిపదికన 54 శాతం పెరిగాయి. ఇదే సమయంలో బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) విభాగంలో నియామకాలు 35 శాతం ఎగశాయి. సేల్స్‌ అండ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్‌ వార్షిక ప్రాతిపదికన 35 శాతం పెరిగింది. కోల్‌కతాలో గరిష్టంగా నియామకాలు 46 శాతం పెరిగాయి. దీని తర్వాతి స్థానంలో ముంబై (11 శాతం), హైదరాబాద్‌ (8 శాతం),  బెంగళూరు (4 శాతం) ఉన్నాయి. ఇక ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వార్షికంగా చూస్తే వృద్ధి 1 శాతం మేర నెమ్మదించింది.  







You may be interested

యాపిల్‌ ఐఫోన్ 10 వచ్చేసింది!!

Wednesday 13th September 2017

 5.8 అంగుళాల స్క్రీన్‌తో మార్కెట్లోకి  ఐఫోన్‌ 8, 8ప్లస్‌ కూడా...  యాపిల్ వాచ్ సిరీస్ 3, 4కే యాపిల్ టీవీ సైతం  8 సిరీస్‌ ధరలు 699 డాలర్ల నుంచీ ఆరంభం  10 ఆరంభ ధర మాత్రం వెయ్యి డాలర్లు క్యుపర్టినో, అమెరికా: కొత్త ఐఫోన్‌ సిరీస్‌కు సంబంధించిన ఊహగానాలకు తెరవేస్తూ టెక్‌ దిగ్గజం యాపిల్‌ తన తాజా ఫోన్లను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఐఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం ‘ఐఫోన్‌-10’

67 స్టార్టప్‌లకు పన్ను ప్రయోజనాలు

Wednesday 13th September 2017

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా 67 స్టార్టప్‌లకు పన్ను ప్రయోజనాలు కల్పించిందని వాణిజ్య శాఖ సహాయ మంత్రి సి.ఆర్‌. చౌదరీ పేర్కొన్నారు. దేశంలో ఎంట్రప్రెన్యూర్లకు చేయూతనందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన స్టార్టప్‌ ఇండియా స్టేట్స్‌ సమావేశంలో మాట్లాడారు. ‘సెప్టెంబర్‌ 7 నాటికి 3,576 స్టార్టప్స్‌ను గుర్తించాం. వీటిల్లో 67 ఇన్నోవేటివ్‌ స్టార్టప్స్‌కు పన్ను ప్రయోజనాలు కల్పించాం’ అని చౌదరీ వివరించారు. 

Most from this category