STOCKS

News


ఆరు నెలల్లో 80 డాలర్లకు చమురు ధర: గోల్డ్‌మాన్‌ శాక్స్‌

Tuesday 13th February 2018
Markets_main1518510025.png-13925

బ్రెంట్‌ క్రూడ్‌ ధర ఆరు నెలల్లో 82.50 డాలర్ల స్థాయికి చేరుతుందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థ గోల్డ్‌మాన్‌ శాక్స్‌ అంచనావేసింది. మూడు నెలల్లో ఈ ధర 75 డాలర్లను చేరవచ్చంటూ మంగళవారం తాజా అంచనాల్ని ప్రకటించింది. గత అంచనా 62 డాలర్ల స్థాయిని ఎగువముఖంగా సవరించింది. ఆసియాలో చమురుకు డిమాండ్‌ పెరగడం, ఒపెక్‌ దేశాలు ఉత్పత్తి కోతల్ని కొనసాగించడం, వెనిజులాలో ఉత్పత్తి పడిపోవడం, అమెరికాలో నిల్వలు తగ్గుతుండటం వంటి అంశాల కారణంగా చమురు ధర భారీగా పెరుగుతుందన్న అంచనాలకు వచ్చినట్లు గోల్డ్‌మాన్‌ శాక్స్‌ విడుదల చేసిన నివేదిక తెలిపింది. 
 



You may be interested

మార్చికల్లా మరో పతనం....

Tuesday 13th February 2018

అంతర్జాతీయ ఫండ్‌ మేనేజర్‌ అంచనా మార్చికల్లా ప్రపంచ మార్కెట్లలో మరో పతనం సంభవిస్తుందని అంతర్జాతీయ ఫండ్‌..ఏఎంపీ క్యాపిటల్‌ ఇన్వెస్టర్స్‌ మేనేజర్‌ నాదెర్‌ నయేమి అంచనావేస్తున్నారు. 120 బిలియన్‌ డాలర్ల ఆస్తుల్ని నిర్వహిస్తున్న ఈ ఫండ్‌...పెద్ద ఎత్తున నగదు నిల్వల్ని అట్టిపెట్టింది. ఫిబ్రవరి తొలివారంలో జరిగిన పతనం తర్వాత..రాబోయే రెండో పతనంలో ఈ నిల్వలతో పెట్టుబడులు చేయాలని యోచిస్తున్నట్లు నయేమి బ్లూమ్‌బర్గ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తొలి పతనం తర్వాత...మలి పతనం

విదేశీ ఇన్వెస్టర్లు అమ్మేస్తుంటే..దేశీయ ఫండ్స్‌ కొంటున్నాయ్‌ !

Tuesday 13th February 2018

ముంబై:- ప్రపంచ మార్కెట్లో కొనసాగుతున్న అల్లకల్లోలం కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడి స్టాక్‌ మార్కెట్లో విక్రయాలు జరుపుతున్నా, దేశీయ సంస్థలు (డీఐఐ)ల కొనుగోళ్ల పరంపర కొనసాగుతోంది. ఫిబ్రవరి మొదటి ఏడు ట్రేడింగ్‌ సెషన్స్‌లో డీఐఐలు రూ.5,419 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోళ్లు చేశాయి. ప్రపంచ మార్కె‍ట్లలో అమ్మకాల సునామీ, దీర్ఘకాలిక మూలధన రాబడిపై పన్ను (ఎల్‌టీసీజీ), ద్రవ్యలోటు భయాలతో గత ఏడు ట్రేడింగ్‌లో సెషన్లలో భారత్‌ సూచీలు గరిష్టస్థాయి నుంచి భారీగా పతమనయ్యాయి. ఈ

Most from this category