STOCKS

News


గీతాంజలి జెమ్స్‌కు ఎన్‌ఎస్‌ఈ జరిమానా

Tuesday 13th March 2018
news_main1520962057.png-14647

  • మరో 23 కంపెనీలపై కూడా 
  • క్యూ3 ఫలితాలు దాఖలు చేయనందుకు 

ముంబై: గీతాంజలి జెమ్స్‌ సహా మరో 23 కంపెనీలపై నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ జరిమానాలు విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను దాఖలు చేయనందుకు గాను ఎన్‌ఎస్‌ఈ ఈ జరిమానాలు విధించింది. ఆర్థిక ఫలితాల దాఖలు సంబంధించి నియమనిబంధనలు పాటించకపోతే, ఎన్‌ఎస్‌ఈ మరిన్ని చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. స్టాక్‌ మార్కెట్‌లో ఈ కంపెనీల ట్రేడింగ్‌ను సస్పెండ్‌ చేయడం తదితర చర్యలను ఎన్‌ఎస్‌ఈ తీసుకోవచ్చు. క్యూ3 ఆర్థిక ఫలితాలు దాఖలు చేయనందుకు ఎన్‌ఎస్‌ఈ జరిమానా విధించిన కంపెనీలో జాబితాలో.. ఏబీజీ షిప్‌యార్డ్‌, ఆమ్‌టెక్‌ ఆటో, డిఎస్‌ కులకర్ణి డెవలపర్స్‌,  భారతీ డిఫెన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఎడ్యుకాంప్‌ సొల్యూషన్స్‌, శ్రీ రేణుక షుగర్స్‌, మోజర్‌ బేయర్‌, స్టెర్లింగ్‌ బయోటెక్‌ తదితర కంపెనీలున్నాయి. 



You may be interested

ఆరేళ్లలో నీరవ్‌ మోదీకి 1,212 ఎల్‌ఓయూలు

Tuesday 13th March 2018

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో దాదాపు 13,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్‌మోదీ మొత్తం ఆరేళ్లలో 1,213 మోసపూరిత లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌ (ఎల్‌ఓయూ)లు పొందాడు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలియజేశారు. దీని ప్రకారం 2011 మార్చి 10న ముంబైలోని పీఎన్‌బీ బ్రాడీ హౌస్‌ బ్రాంచీలో మొదటి గ్యారెంటీ పొందాడు. 2017 మే 23న చివరి ఎల్‌ఓయూ జారీ అయ్యింది. అవినీతి పరులైన ఉద్యోగులు

హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై క్రిప్టోకరెన్సీ సేవలు బంద్‌

Tuesday 13th March 2018

ముంబై: మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కస్టమరా? అయితే ఇక మీరు మీ బ్యాంక్‌ కార్డుల ద్వారా క్రిప్టోకరెన్సీ సంబంధిత లావాదేవీలు నిర్వహించడం వీలుపడదు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తాజాగా తన క్రెడిట్‌, డెబిట్‌, ప్రిపెయిడ్‌ కార్డులపై క్రిప్టోకరెన్సీల కొనుగోలు, ట్రేడింగ్‌ సర్వీసులను బ్లాక్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. క్రిప్టోకరెన్సీలపై అంతర్జాతీయంగా భయాలు పెరుగుతోన్న నేపథ్యంలో బ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకుంది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా

Most from this category