STOCKS

News


బ్యాలెన్స్‌ షీట్స్‌ సరికావడానికి మరో 9 నెలలు: అసోచామ్‌

Monday 16th April 2018
Markets_main1523860755.png-15532

న్యూఢిల్లీ: బ్యాంకులకు భారీ మొండి బకాయిలు అదే సమయంలో కార్పొరేట్లకు అధిక రుణ భారం... ఈ రెండు రకాల సమస్యలు (ట్విన్‌ బ్యాలన్స్‌ షీట్‌) పరిష్కారం అయ్యేందుకు కనీసం మరో మూడు త్రైమాసికాల సమయం పట్టొచ్చని అసోచామ్‌ పేర్కొంది. ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) కింద రానున్న నెలల్లో కంపెనీల దివాలా పరిష్కార చర్యలు వేగం అందుకుంటాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. బ్యాంకుల విశ్వాసం పుంజుకుని మళ్లీ తాజాగా రుణాలు మంజూరు చేయడానికి కనీసం 6-9 నెలలు పడుతుందని తాము అంచనా వేస్తున్నట్టు తెలిపింది. మరోవైపు కంపెనీల అమ్మకాలు పెరిగి రుణాలకు చెల్లింపులు కూడా మెరుగుపడతాయని భావిస్తున్నట్టు పేర్కొంది. ఎన్‌పీఏల పరిష్కారానికి సంబంధించి ఆర్‌బీఐ ఫిబ్రవరిలో ప్రకటించిన విధానం చాలా కఠినంగా ఉందని, దీన్ని సులభతరం చేయాలని అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ డీఎస్‌ రావత్‌ అన్నారు. సమస్యల పరిష్కారానికి బదులు వాటిని పెద్దవి చేసేవిగా నిబంధనలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.



You may be interested

జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ రేసులో ‘లక్షదీప్‌’ ముందంజ

Monday 16th April 2018

న్యూఢిల్లీ: రుణ ఊబిలో కూరుకుపోయి దివాలా చర్యలను ఎదుర్కొంటున్న జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ కంపెనీ కొనుగోలుకు లక్షదీప్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ముందు వరుసలో ఉంది. రూ.7,350 కోట్లకు ఈ సంస్థ బిడ్‌ వేసింది. అయితే, ఈ మొత్తం సంస్థ గతేడాది బ్యాంకుల రుణాలు తీర్చేందుకు ఇచ్చిన హామీ రూ.8,500 కోట్లు (వడ్డీ సహా) కంటే తక్కువ కావడం గమనార్హం. సుధీర్‌ వాలియాకు చెందిన సురక్ష అస్సెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ, ముంబైకి చెందిన

బ్యాంకుల నెత్తిన ‘గీతాంజలి’ బండ

Monday 16th April 2018

క్యూ4లో ఎన్‌పీఏలు రూ.8,000 కోట్లు పెరిగే అవకాశం  న్యూఢిల్లీ: కుంభకోణంలో చిక్కుకున్న గీతాంజలి జెమ్స్‌ గ్రూపునకు ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారిపోవడంతో మార్చి త్రైమాసికంలో బ్యాంకుల ఎన్‌పీఏలు రూ.8,000 కోట్ల మేర పెరిగిపోనున్నాయి. గీతాంజలి జెమ్స్‌ గ్రూపునకు ఇచ్చిన వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలు రూ.8,000 కోట్లకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఎటువంటి చెల్లింపులు జరగలేదు. దీంతో ఈ మొండి బకాయిలకు నిధులు కేటాయించాల్సి ఉంటుందని బ్యాంకింగ్‌

Most from this category