STOCKS

News


1980లో యుఎస్‌ఎ, 90ల్లో చైనా, ఇప్పుడు మనం...

Wednesday 13th September 2017
Markets_main1505291237.png-8496

వృద్ధి పరుగులకు సిద్ధంగా ఉన్న భారత్‌

స్టాక్ మార్కెట్ల ర్యాలీ మోదీ సర్కారు సంస్కరణలు, అంతర్జాతీయంగా లిక్విడిటీ ఇలా ఎన్నో అంశాల మేళవింపు కావచ్చు. మరి నిఫ్టీ 10,000 తర్వాత ఏంటి పరిస్థితి..? ఇప్పటికీ మన మార్కెట్లు ఈ దశలో పెట్టుబడి పెట్టేందుకు అనువైన స్థితిలోనే ఉన్నాయా? సంపద సృష్టికి ఇవి ఇప్పటికీ అనుకూల వేదికలేనా..? దీనిపై యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ఎండీ, సీఈవో అరుణ్‌తుక్రాల్‌ విశ్లేషణ ఇలా ఉంది.


మన దేశ ఆర్థిక వ్యవస్థ గత కొన్నేళ్ల కాలంలో ఎన్నో సంస్కరణలను చవిచూసింది. ఇవి సహజంగా విధ్వంసక మార్పులను తీసుకొచ్చేవే. ఆర్థిక వ్యవస్థపై సంస్థాగతంగా మార్పు చూపించేవే. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ విస్తరణకు దోహదం చేస్తాయి. సంస్కరణలు విజయవంతం కావడం, పెరుగుతున్న రాజకీయ ప్రాబల్యంతో ఈ తరహా సంస్కరణలను మరిన్నింటిని చేపట్టే స్థితిలో ప్రభుత్వం ఉంది. దీంతో రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని ఇవి మరింత పటిష్టం చేయనున్నాయి. 2017లో రూ.2 లక్షల డాలర్ల జీడీపీ స్థాయిలో మన దేశం ఉంది. 2003లో మన దేశ జీడీపీ 541 బిలియన్‌ డాలర్లు కాగా, 2007లో ఇది లక్ష కోట్ల డాలర్లను దాటింది. 2015లో 2 లక్షల కోట్ల డాలర్లను అధిగమించింది. అంతర్జాతీయంగా సానుకూల వాతావరణం కారణంగా జీడీపీ 2003 నుంచి 2007 నాటికి నాలుగేళ్లలోనే దాదాపుగా రెట్టింపై లక్ష కోట్ల డాలర్లను దాటేయగా, ఈ స్థాయి నుంచి 2 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోవడానికి మాత్రం ఎనిమిదేళ్లు (2007 నుంచి 2015 వరకు) తీసుకుంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇది సాధ్యమైంది. ఈ వాస్తవాల ఆధారంగా మన దేశ జీడీపీ 2025 నాటికి 5 లక్షల డాలర్లను చేరుతుందని అంచనా. ఇక ఇదే సమయంలో స్టాక్‌ మార్కెట్‌ పనితీరు చూస్తే 2003 నుంచి 2007 నాటికి సెన్సెక్స్‌ 5,000 నుంచి 21,000కు చేరుకుంది. నిఫ్టీ 1,000 నుంచి 2007  చివరి నాటికి 6,000 పాయింట్లకు చేరుకుంది. ఆర్థిక వ్యవస్థలో అంతర్లీనంగా దాగున్న వృద్ధి మార్కెట్ల పనితీరు రూపంలో వ్యక్తమైంది.

వినియోగితే కీలకం

మన దేశ జీడీపీలో ఎక్కువ భాగం దేశీయ వినియోగంపై ఆధారపడిందే. ఎగుమతుల వాటా కేవలం 25 శాతంగానే ఉంది. దేశంలో 65 శాతం జనాభా పనిచేసే వయసులో (15-64)లో ఉన్నవారే. 29 శాతం జనాభా అయితే 0-15 శాతం వయసులో ఉన్న వారు. 64 ఏళ్లు దాటిన వృద్ధ జనాభా కేవలం 6 శాతమే. ఇక వచ్చే రెండు మూడు దశాబ్దాల కాలం జనాభా పరంగా సానుకూలతలు మనదేశానికి ఉంటాయి. 1980లో అమెరికా ఏ స్థితిలో ఉందో, చైనా 1990ల్లో ఎక్కడుందో మన దేశం కూడా అదేవిధమైన సానుకూల స్థితిలో ప్రస్తుతం ఉంది. జనాభా పరంగా సానుకూలత, జాతీయ ఉత్పాదకత అధికంగా ఉండడం, ఆధారపడతగ్గ రేషియో తక్కువగా ఉండడం, మహిళలు కూడా సమాజానికి పాటు పడడం వంటివన్నీ అనుకూలతలే. యువ జనాభా అధికంగా ఉండడం అధిక ఉత్పత్తికి దారితీస్తుంది. అధిక రిస్క్‌ తీసుకునే సామర్థ్యం, అధిక వ్యయాల కారణంగా వినియోగం పెరిగి అధిక డిమాండ్‌కు కారణమవుతాయి. ఈ స్థితితో ఆర్థిక వ్యవస్థ దేశీయ వినియోగానికి తోడు ప్రపంచ డిమాండ్‌ నుంచి ప్రయోజనాలను అందుకోనుంది. అంటే రెండు విధాల వృద్ధికి అవకాశం. దీంతో పరిశ్రమలకు వృద్ధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. దీంతో ఆర్థిక వ్యవస్థకు, దేశీయ మార్కెట్లకు గొప్ప భవిష్యత్తు ఉంది. You may be interested

ఒక్క ఏడాది = 14 ఏళ్లు...

Wednesday 13th September 2017

క్యూ కట్టనున్న పీఎస్‌యు ఐపీఓలు గత డిసెంబర్‌లో ప్రభుత్వ రంగ పీఎస్‌యుల్లో వాటాల ఉపసంహరణపై వాటాదారులతో ప్రభుత్వం చర్చలు ఆరంభించింది. పీఎస్‌యులను మరింత జవాబుదారీగా, పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు, ప్రభుత్వానికి నిధులు సమకూర్చేందుకు ఈ వాటాల ఉపసంహరణప్రక్రియ చేపడతారు. డిసెంబర్‌లో చర్చల అనంతరం వాటాల ఉపసంహరణకు ప్రధాని పచ్చజండా ఊపారు. దీంతో ఈ బడ్జెట్లో దీన్ని కీలకాంశంగా పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇంతవరకు రెండు పీఎస్‌యులు ఐపీఓకి వచ్చాయి. హడ్కో, కోచి షిప్‌యార్డ్‌

ఇంటికి బీమా రక్షణ తీసుకున్నారా?

Wednesday 13th September 2017

ఇంట్లోని వారికే కాదు, ఇంటికీ బీమా రక్షణ అవసరమే. ఈ మధ్య కాలంలో ఈ విషయమై వినియోగదారుల్లో అవగాహన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ పాలసీ తీసుకునే ముందు చూడాల్సిన ముఖ్యమైన అంశాల గురించి నిపుణుల సూచనలు ఇలా ఉన్నాయి.  హోమ్‌ ఇన్సూరెన్స్‌ బేసిక్‌ పాలసీ అన్నది అగ్ని ప్రమాదాల వల్ల ఇంటికి, ఇంట్లోని విలువైన వస్తువులకు రక్షణ కల్పిస్తుంది. అలాగే, విపత్తులైన పిడుగు, తుఫానులు, వరదల వల్ల వాటిల్లే నష్టానికీ

Most from this category