STOCKS

News


రూ.999లకే నోకియా ఫీచర్‌ ఫోన్‌

Tuesday 18th July 2017
news_main1500320486.png-5529

న్యూఢిల్లీ: నోకియా బ్రాండ్‌ అధికారాలు చేజిక్కించుకున్న ‘హెచ్‌ఎండీ గ్లోబల్‌’ తాజాగా ‘నోకియా-105’ మోడల్‌లో కొత్త వెర్షన్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.999. ఇందులో 1.8 అంగుళాల కలర్‌ స్క్రీన్‌, ఎల్‌ఈడీ టార్చ్‌లైట్‌, కొత్త డిజైన్‌, దీర్ఘకాల బ్యాటరీ లైఫ్‌ వంటి పలు ప్రత్యకతలున్నాయని కంపెనీ పేర్కొంది. ఫీచర్‌ ఫోన్‌ మార్కెటే ప్రధాన లక్ష్యంగా కంపెనీ ఈ మోడల్‌ను తీసుకువస్తోంది. ఇక డ్యూయెల్‌ సిమ్‌ వెర్షన్‌ ఫోన్‌ ధర రూ.1,149గా ఉంది. ఈ రెండు ఫోన్లు బుధవారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నవి. కాగా కంపెనీ మరొక ఫీచర్‌ ఫోన్‌ నోకియా-130ని సెప్టెంబర్‌లో మార్కెట్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల ఫీచర్‌ ఫోన్లు అమ్ముడయ్యాయని హెచ్‌ఎండీ గ్లోబల్‌ సీఈవో అర్టో నుమెలా తెలిపారు.  



You may be interested

నెలలో ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌: లిమాయే

Tuesday 18th July 2017

కో లొకేషన్‌ అంశంపై పరిష్కారమే తొలి ప్రాధాన్యం ఎన్‌ఎస్‌ఈ నూతన ఎండీ లిమాయే న్యూఢిల్లీ: కో లొకేషన్‌ అంశంపై ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఈవై) నెలలోపు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదిక సమర్పించనుందని ఎన్‌ఎస్‌ఈ నూతన ఎండీ విక్రమ్‌ లిమాయే తెలిపారు. దీనిపై సకాలంలో తగిన పరిష్కారాన్ని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఎన్‌ఎస్‌ఈ నూతన ఎండీగా సోమవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం లిమాయే మీడియాతో మాట్లాడారు. కో లొకేషన్‌ అంశాన్ని పరిష్కరించడమే తన తొలి ప్రాధాన్యమన్నారు.

మిగిలేవి పదో.. పన్నెండో..

Tuesday 18th July 2017

 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మరిన్ని విలీనాలు  3-4 అంతర్జాతీయ స్థాయి బ్యాంకులను తీర్చిదిద్దే ప్రయత్నాలు  ఆంధ్రా బ్యాంకు స్వతంత్రంగానే కొనసాగే అవకాశాలు న్యూఢిల్లీ: మరిన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల ద్వారా మొత్తం మీద 3-4 అంతర్జాతీయ స్థాయి బ్యాంకులను తీర్చిదిద్దడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) 21 ఉండగా.. విలీనాలతో ఈ సంఖ్య 10-12కి తగ్గనుంది. ఎస్‌బీఐ స్థాయిలో మరో 3-4 బ్యాంకులను తయారు చేయాలని

Most from this category