STOCKS

News


యాక్సిస్ కొత్త 'బ్యాంక్ గ్యారంటీలు' చెల్లవు

Tuesday 20th March 2018
Markets_main1521540782.png-14826

- టెలికం శాఖ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: టెలికం సంస్థలకు సంబంధించి     ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ కొత్తగా ఇచ్చే బ్యాంక్ గ్యారంటీలను తీసుకోబోమని టెలికం శాఖ (డాట్‌) స్పష్టం చేసింది. గతంలో ఎయిర్‌సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరఫున ఇచ్చిన బ్యాంక్ గ్యారంటీలను చెల్లించడంలో యాక్సిస్ విఫలం కావడమే ఇందుకు కారణమని పేర్కొంది. ఇది భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్న కాంట్రాక్టును ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ నుంచి బ్యాంక్ గ్యారంటీలు తీసుకోరాదని మార్చి 16న జారీ చేసిన ఆఫీస్ మెమోలో టెలికం శాఖ తెలిపింది. మరోవైపు, తాము భారతి ఎయిర్‌టెల్ తరఫున మాత్రమే బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చినట్లు యాక్సిస్ బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గ్యారంటీలకు సంబంధించి చెల్లింపులు జరిపిన పక్షంలో టెలికం వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ టీడీశాట్ ఆదేశాలను ఉల్లంఘించినట్లవుతుందని, అందుకే జరపలేదని వివరించాయి. టీడీశాట్ ఆంక్షలు ఎత్తివేసిన పక్షంలో నిబంధనలకు అనుగుణంగా సదరు గ్యారంటీలకు సంబంధించి చెల్లింపులు జరుపుతామని తెలిపాయి. 
    వాస్తవానికి ఎయిర్‌సెల్ స్పెక్ట్రంను ఉపయోగించుకోవడానికి సంబంధించి భారతి ఎయిర్‌టెల్ తరఫున బ్యాంక్ గ్యారంటీని ఇవ్వడం జరిగిందని యాక్సిస్ వర్గాలు వివరించాయి. అయితే, ఎయిర్‌సెల్, టెలికం శాఖల మధ్య వివాదం విషయంలో టీడీశాట్ ఇచ్చిన ఉత్తర్వుల కారణంగా బ్యాంక్ గ్యారంటీ చెల్లింపులను జరిపేందుకు యాక్సిస్ బ్యాంక్‌కు వీలు లేకుండా పోయిందని వివరించాయి. టెలికం కంపెనీలు కాంట్రాక్టుల నిబంధనలకు అనుగుణంగా బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వడం సర్వసాధారణం. ఒకవేళ సదరు సంస్థ గానీ డిఫాల్ట్ అయిన పక్షంలో ప్రభుత్వం పెనాల్టీ కింద ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటుంది. 



You may be interested

14 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయిన బంధన్‌ బ్యాంక్‌ ఐపీఓ

Tuesday 20th March 2018

-ఈ నెల 27న స్టాక్‌మార్కెట్లో లిస్టింగ్‌ !  కోల్‌కత: ప్రైవేట్‌ రంగ బంధన్‌ బ్యాంక్‌ ఐపీఓ(ఇనీషియల్‌  పబ్లిక్‌ ఆఫర్‌) 14.5 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. క్యూఐపీ, హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌(హెచ్‌ఎన్‌ఐ)ల నుంచి మంచి స్పందన లభించిందని బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ చంద్ర శేఖర్‌ ఘోష్‌ చెప్పారు. క్యూఐపీకు కేటాయించిన వాటా 38.67 రెట్లు, హెచ్‌ఎన్‌ఐలకు కేటాయించిన వాటా 13.89 రెట్లు చొప్పున ఓవర్‌ సబ్‌స్క్రైబయ్యాయని వివరించారు. రిటైల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా

బినాని సిమెంట్‌ను కొంటాం

Tuesday 20th March 2018

-రూ.7,266 కోట్లకు ఆఫర్‌ ఇచ్చిన ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ -గత వారంలో రూ.6,350 కోట్ల దాల్మియా ఆఫర్‌కు సీఓసీ ఓకే -సీఓసీ నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ ఎన్‌సీఎల్‌టీలో బినాని పిటిషన్‌  న్యూఢిల్లీ: బినాని సిమెంట్‌ వేలంలో కొత్త ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీ బినాని సిమెంట్‌ను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. రుణాలు చెల్లించలేక డిఫాల్ట్‌ అయిన బినాని సిమెంట్‌ను రూ.7,266 కోట్లకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా

Most from this category