STOCKS

News


ఓపెన్‌ ఆఫర్‌ ఉన్నప్పుడు బైబ్యాక్‌ కుదరదు!

Wednesday 20th March 2019
news_main1553067167.png-24711

 మైండ్‌ట్రీ నిర్ణయంపై నిపుణుల అంచనా
ఎల్‌అండ్‌టీ నుంచి ముంచుకొస్తున్న టేకోవర్‌ ముప్పును తప్పించుకునేందుకు మైండ్‌ట్రీ ప్రమోటర్లు నానా యత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధబారం బోర్డు మీటింగ్‌ జరగనుంది. ఇందులో బైబ్యాక్‌ ఆఫర్‌పై చర్చిస్తారని గతవారం కంపెనీ వెల్లడించింది. అయితే ఇప్పుడు ఈ మీటింగ్‌లో బైబ్యాక్‌ గురించిన ప్రకటన రాకపోవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సెబి నియమావళి ప్రకారం ఒక కంపెనీ షేర్లకు ఓపెన్‌ ఆఫర్‌  నడుస్తున్నప్పుడు బైబ్యాక్‌ ఆఫర్‌ ప్రకటించకూడదని గుర్తు చేస్తున్నారు. మైండ్‌ట్రీలో ప్రమోటర్‌ సిద్ధార్ధ వాటాను కొనుగోలు చేసిన ఎల్‌అండ్‌టీ మరింత వాటా కోసం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్‌కు యాక్సిస్‌ క్యాపిటల్‌, సిటిగ్రూప్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. సెబి ఎస్‌ఏఎస్‌టీ(సబ్‌స్టాన్షియల్‌ అక్వజిషన్‌ ఆఫ్‌షేర్స్‌ అండ్‌ టేకోవర్‌)నిబంధనల్లో సెక‌్షన్‌ 269(2డీ) ప్రకారం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటన వచ్చాక, సదరు టార్గెట్‌ కంపెనీ బోర్డు ఎలాంటి బైబ్యాక్‌ ఆఫర్స్‌ ప్రకటించకూడదని, ఇతరత్రా ఎలాంటి మూలధన నిర్మాణ మార్పులకు పాల్పడకూడదని కంపెనీల వ్యవహరాల నిపుణుడు శ్రీరామ్‌ సుబ్రమణియన్‌ చెప్పారు. ఒకవేళ ఇలాంటివి చేపట్టాలంటే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా షేర్‌హోల్డర్‌ నుంచి ప్రత్యేక అనుమతి పొందాలన్నారు. అయితే బోర్డు మీటింగ్‌పై ఇప్పటికే ఎక్చేంజ్‌లకు తెలియజేసినందున బుధవారం మైండ్‌ట్రీ సమావేశం జరగనుంది. ముందే సమాచరమిచ్చినందున బైబ్యాక్‌పై ఎలాంటి ప్రకటన చేయాలన్నది బోర్డు నిర్ణయించుకోవచ్చని ప్రముఖ చార్టెడ్‌ అకౌంటెంట్‌ వివేక్‌ మాల్యా చెబుతున్నారు. కానీ నాణ్యమైన గవర్నెన్స్‌, కార్పొరేట్‌ విలువల దృష్ట్యా ఈ విషయాన్ని బోర్డు వాయిదా వేయడం మంచిదని అభిప్రాయపడ్డారు.

ఇలాంటి తరుణంలో ఇండిపెండెంట్‌ డైరెక్టర్లు కీలక పాత్ర పోషిస్తారని, మైనార్టీ షేర్‌హోల్డర్ల ప్రయోజనాలు కాపాడే బాధ్యత ప్రస్తుతం వీరిపై ఉందని చెప్పారు. ఒకపక్క ఎల్‌అండ్‌టీ, మరోపక్క మైండ్‌ట్రీ ప్రమోటర్లు పట్టుపట్టి కూర్చున్నందున స్వతంత్ర డైరెక్టర్లు ఈ విషయంపై లోతుగా పరిశోధించి వాటాదారుల ప్రయోజనాలకు విఘాతం కలగని రీతిలో నిర్ణయాన్ని చేరుకునేందుకు యత్నించాలని ఇన్ఫీ బోర్డు మాజీ సభ్యుడు వీ. బాలకృష్ణన్‌ అభిప్రాయపడ్డారు. గురువారానికి ఈ విషయమై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. 



You may be interested

జెట్‌ఎయిర్‌ వేస్‌ షేరు క్రాష్‌లాండింగ్‌

Wednesday 20th March 2019

ముంబై:- ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్‌ఎయిర్‌ షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో  పడిపోయింది. నేడు బీఎస్‌ఈలో ఎయిర్‌వేస్‌ షేర్లు రూ.215.70ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇప్పటికే పీకల్లోతు అప్పుల కూరుకుపోయిన కంపెనీ నుంచి వైదొలగించేందుకు తన భాగస్వామ్య సంస్థ ఎతిహాత్‌  ప్రయత్నాలు చేస్తుంది. జెట్‌ ప్రివిలెజ్‌ వ్యాపార విభాగంలో తనకున్న 50.1 శాతం వాటాలను కూడా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కు ఆఫర్‌ చేసినట్లు సమాచారం. షేరు ఒక్కింటికి రూ.

స్వల్పంగా తగ్గిన పసిడి

Wednesday 20th March 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర బుధవారం సల్పంగా తగ్గుముఖం పె‍ట్టంది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌సెషన్స్‌లో ఔన్స్‌ పసిడి ధర 3డాలర్ల మేర నష్టపోయి 1,303.55 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ రివకరీ, ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ పసిడి పతనానికి కారణమైంది. నేడు ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 1,306.30 డాలర్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలతో ఆసియా ఈక్విటీ

Most from this category