STOCKS

News


ఆరేళ్లలో నీరవ్‌ మోదీకి 1,212 ఎల్‌ఓయూలు

Tuesday 13th March 2018
news_main1520962185.png-14648

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో దాదాపు 13,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్‌మోదీ మొత్తం ఆరేళ్లలో 1,213 మోసపూరిత లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌ (ఎల్‌ఓయూ)లు పొందాడు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలియజేశారు. దీని ప్రకారం 2011 మార్చి 10న ముంబైలోని పీఎన్‌బీ బ్రాడీ హౌస్‌ బ్రాంచీలో మొదటి గ్యారెంటీ పొందాడు. 2017 మే 23న చివరి ఎల్‌ఓయూ జారీ అయ్యింది. అవినీతి పరులైన ఉద్యోగులు ఇందులో కీలక పాత్ర పోషించారు. 

ఎస్‌డబ్ల్యూఐఎఫ్‌టీ మెస్సేజ్‌లపై పీఎన్‌బీ దృష్టి
ఎస్‌డబ్ల్యూఐఎఫ్‌టీ (సొసైటీ ఫర్‌ వరల్డ్‌వైడ్‌ ఇంటర్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ టెలికమ్యూనికేషన్‌) మెస్సేజ్‌ల ప్లాట్‌ఫామ్‌ దుర్వినియోగం కావడంపై పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) బ్యాంక్‌ దృష్టి సారిస్తోంది.  దాదాపు 13 వేల కోట్ల కుంభకోణానికి ఎస్‌డబ్ల్యూఐఎఫ్‌టీ మెస్సేజ్‌లనే నీరవ్‌మోడీ అతని అనుచరులు వినియోగించుకున్నారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయా అంశాలన్నింటినీ ఆర్‌బీఐకి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నివేదించినట్లు ఆర్థికశాఖ సహాయమంత్రి శివ్‌ ప్రతాప్‌ శుక్లా రాజ్యసభకు ఒక లిఖిత పూర్వక సమాధానంతో తెలిపారు.   ఎల్‌ఓయూఎస్‌/ ఎఫ్‌ఎల్‌సీల మోసపూరిత జారీలు, ఇందుకు సంబంధించిన అంశాలు పీఎన్‌బీ కోర్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థలో లావాదేవీలు నమోదుచేయకుండా ఈ సమాచారాన్ని  విదేశీ బ్యాంకులకు చేరవేయడానికి ఎస్‌డబ్ల్యూఐఎఫ్‌టీ మెస్సేజ్‌లను నిందితులు వినియోగించుకున్నట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 

ఎన్‌సీఎల్‌టీ పరిశీలనలో 9,000కుపైగా కేసులు
2018 జనవరి 31 నాటికి నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) పరిశీలనలో మొత్తం 9,073 కేసులు ఉన్నట్లు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయమంత్రి పీపీ చౌదరి రాజ్యసభకు ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. వీటిలో దాదాపు 2,500 కేసులు దివాలా సంబంధమైనవి ఉన్నట్లు వివరించారు. 1,630 కేసులు కంపెనీల విలీనాలకు సంబంధించినవని తెలిపారు. 2013 కంపెనీల చట్టం కింద ఎన్‌సీఎల్‌టీ ఏర్పాటయ్యింది. 

రూ.3,900 కోట్ల బినామీ ఆస్తుల జప్తు
ఫిబ్రవరి చివరినాటకి ఆదాయపు పన్ను శాఖ 1,600 బినామీ లావాదేవీలను గుర్తించిందని  ఆర్థికశాఖ సహాయమంత్రి శివ్‌ ప్రతాప్‌ శుక్లా రాజ్యసభకు తెలిపారు. ఇందుకు సంబంధించి 1,200 కేసుల్లో రూ. 3,900 కోట్లకు పైగా విలువైన బినామీ ఆస్తులను జప్తు (ప్రొవిజనల్‌గా) చేసినట్లు కూడా ఆయన ఈ సందర్భంగా తెలిపారు. డీమోనిటైజేషన్‌ కాలంలో డిపాజిట్ల విషయంలో తగిన విధమైన పొసగని పన్ను ప్రొఫైల్స్‌ ఉన్న దాదాపు 22.69 లక్షల మందిని ఆదాయపు పన్ను శాఖ గుర్తించిందని మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. 


 



You may be interested

100 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్‌

Wednesday 14th March 2018

2 శాతం నష్టాల్లో పీఎస్‌యూ బ్యాంక్‌ లాభాల్లో కొనసాగుతున్న ఐటీ ముంబై: దేశీయ స్టాక్‌ సూచీలు బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లు నష్టపోయి 33,757 వద్ద ప్రారంభం కాగా, నిఫ్టీ 10,400 పాయింట్ల దిగువకు పడిపోయింది. 37 పాయింట్లు నష్టపోయి 10,389 వద్ద మొదలయ్యింది. 9 గంటల 30 సమయానికి 42 పాయింట్లు (-0.37%) నష్టపోయి 10,384 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ ఇదే సమయానికి 114 పాయింట్లు (-0.34%)

గీతాంజలి జెమ్స్‌కు ఎన్‌ఎస్‌ఈ జరిమానా

Tuesday 13th March 2018

మరో 23 కంపెనీలపై కూడా  క్యూ3 ఫలితాలు దాఖలు చేయనందుకు  ముంబై: గీతాంజలి జెమ్స్‌ సహా మరో 23 కంపెనీలపై నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ జరిమానాలు విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను దాఖలు చేయనందుకు గాను ఎన్‌ఎస్‌ఈ ఈ జరిమానాలు విధించింది. ఆర్థిక ఫలితాల దాఖలు సంబంధించి నియమనిబంధనలు పాటించకపోతే, ఎన్‌ఎస్‌ఈ మరిన్ని చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. స్టాక్‌ మార్కెట్‌లో ఈ కంపెనీల ట్రేడింగ్‌ను సస్పెండ్‌ చేయడం

Most from this category