STOCKS

News


నిఫ్టీ టార్గెట్‌ 10,400..!

Friday 2nd February 2018
Markets_main1517566713.png-13642

ముంబై: దీర్ఘకాల మూలధన లాభాల పన్ను, ద్రవ్యలోటు లక్ష్యం పెంపు వంటి బడ్జెట్‌ ప్రతికూల అంశాల నేపథ్యంలో నిఫ్టీ శుక్రవారం ఒక్కరోజులోనే రెండున్నర శాతం వరకు పతనమయ్యింది. సెక్టోరియల్‌ సూచీలు ఇంట్రాడేలో ఏకంగా 4 శాతం వరకు నష్టాలను నమోదుచేశాయి. బ్యాంక్‌ నిఫ్టీ 700 పాయింట్ల మేర నష్టపోయింది. ఈ పతనం ఇక్కడితో ఆగేది కాదని, డీమానిటైజేషన్‌ అసలు సెగ ప్రభుత్వానికి ఇప్పుడే తాకిందని డైమెన్‌క్షన్స్‌ కార్పొరేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ సీఈఓ అజయ్ శ్రీవాత్సవ అన్నారు. కేం‍ద్ర ప్రభుత్వం వద్ద నిధులు తగిన స్థాయిలో లేవనే సంకేతం ఈ బడ్జెట్‌ ఇచ్చిందని ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాఖ్యానించారు. ఆర్థిక అనిశ్చితి, రాజకీయ అంశాల కారణంగా జూన్‌-జులై నాటికి మార్కెట్‌ పతనం జరగవచ్చని తాను అంచనావేయగా, ఇది అనుకున్న సమయాని కంటే ముందుగానే జరుగుతుందని అన్నారు. లిస్టెడ్‌ షేర్లపై రూ.లక్ష మించిన దీర్ఘకాల పెట్టుబడి ఆదాయంపై 10 శాతం లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ (ఎల్‌టీసీజీ) విధించడం ఒక్కటే ఇక్కడ ప్రధాన సమస్య కాదని, దీనితో పాటు ఈక్విటీ ఓరియంటెడ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ లాభాల పంపిణీపై 10 శాతం పన్ను విధించడం లాంటివి కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయని శ్రీవాత్సవ అన్నారు. గతేడాది విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నిధుల ప్రవాహం ఒక్కసారిగా తగ్గిపోయిన సందర్భాలలో డొమెస్టిక్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడుల కారణంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ మార్కెట్‌ను నిలబెట్టగా.. ఈసారి అటువంటి పరిస్థితి ఉండకపోవచ్చనే భావిస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే పొజిషన్లు ఉన్నవారు ప్రస్తుత పరిస్థితుల్లో వీటిని తెగనమ్మడం కంటే కొంతకాలం ఆగడం మంచిదని శ్రీవాత్సవ సూచించారు. అయితే, ఈ పతనం ఇంకొంత కాలం ఉంటుందని మార్కెట్‌ విశ్లేషకులు అశ్వనీ గుజ్రాల్ అన్నారు. వచ్చే 2-3 వారాల్లో భారీ పతనం ఉండే అవకాశం ఉందని, నిఫ్టీ 10,400 స్థాయికి చేరుకోవచ్చని అంచనావేశారు.

ఎల్‌టీసీజీ ప్రతికూల ప్రభావం మార్కెట్‌లో స్పష్టంగా కనిపిస్తోందని షేర్‌ఖాన్‌ బ్రోకింగ్‌ సంస్థకు చెందిన విశ్లేషకులు హేమంగ్ జానీ.. పలు ఎంపిక చేసిన షేర్లలో అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉందని అన్నారు. హైబీటా షేర్లు బాగా పతనమవుతున్నాయని తెలియజేశారు. 

నిఫ్టీ 10,550-10,590 స్థాయికి చేరుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని మరో విశ్లేషకులు మిట్టేష్ థాకర్ అన్నారు.
 You may be interested

మార్కెట్‌ను ముంచిన ఈక్విటీ పన్ను

Friday 2nd February 2018

స్టాక్‌ మార్కెట్లకు బ్లాక్‌ ఫ్రైడే సెన్సెక్స్‌ 839 పాయింట్లు, నిఫ్టీ 256 పాయింట్ల పతనం ముంబై:- ఈక్విటీలపై బడ్జెట్లో దీర్ఘకాలిక పన్ను విధించడం... స్టాక్‌ మార్కెట్‌ను నిండా ముంచింది.  రెండు నెలలుగా లాభాల పరవళ్లు తొక్కుతున్న సూచీలకు శుక్రవారం బ్రేకు పడింది. బడ్జెట్‌లో మూలధన లాభాల పన్ను, ఇండియా రేటింగ్‌ పెంపు అంశంపై ఫిచ్ రేటింగ్ వ్యాఖ్యలు, అంతర్జాతీయ మార్కెట్లనుంచి అందిన ప్రతికూల పవనాలు వెరసి సూచీలు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ 839.91(2.34శాతం) పాయింట్లు

52-వారాల కనిష్టానికి- 75 షేర్లు..!

Friday 2nd February 2018

ముంబై:-  ఆరంభ నష్టాలను కొనసాగిస్తూ శుక్రవారం మధ్యాహ్నా సమయానికి సూచీలు ట్రేడ్‌ అవుతున్నాయి. మధ్యాహ్నాం గం.3:00.లకు బీఎస్‌ఈ సెన్సె‍క్స్‌ 800పాయింట్లు  నష్టపోయి. 35,107 వద్ద, నిఫ్టీ 246 పాయింట్లు నష్టపోయి 10,770 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. మార్కెట్‌ ట్రెండ్‌కు అనుగుణంగా ఎన్‌ఎస్‌ఈలో 75షేర్లు  52 వారాల కనిష్ట ధరకు పతనమయ్యాయి. ఆదిత్యా బిర్లా క్యాపిటల్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, బాలరాంపూర్‌ చిని మిల్స్‌, డీబీ కార్పోరేషన్‌ , ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర,

Most from this category