News


10,500 పాయింట్లకు నిఫ్టీ!

Wednesday 13th September 2017
Markets_main1505296363.png-8508

అరిహంత్‌ కాపిటల్‌ అంచనా
దేశీయ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి నిధుల ప్రవాహం పెరగడంతో దేశీయ మార్కెట్లు జోరుమీదున్నాయి. ప్రస్తుతానికి సూచీల వాల్యూషన్స్‌ గరిష్ఠాల వద్ద ఉన్నాయని చెప్పవచ్చు. కానీ వాల్యూషన్స్‌ ఎక్కువగా ఉండడాన్ని ఇన్వెస్టర్లు పెద్దగా పట్టించుకోవడంలేదు. ఈ సంవత్సరం ఎర్నింగ్స్‌ వృద్ధి కన్నా ప్రైస్‌ ఎర్నింగ్‌ మల్టిపుల్స్‌ విస్తరణకే ఎక్కువ అవకాశాలున్నాయి. సిమెంట్‌, కన్జూమర్‌ గూడ్స్‌, ఆటో, ఎన్‌బిఎఫ్‌సీ రంగాల్లో ఈ మార్పు చూడవచ్చు. తాజా రికవరీకి సంస్కరణలు, మెరుగుపడుతున్న గణాంకాలు కారణం.  రికవరీ పేలవంగా ఉండడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి రిస్కులు ఈ ర్యాలీకి ఎదురుకావచ్చు. వీటికి అంతర్జాతీయ అంశాలు కూడా జతకూడే అవకాశాలున్నాయి. నెలవారి చార్టుల్లో మాత్రం బేరిష్‌ కాండిల్‌ కనిపించడం ప్రస్తుత అప్‌ట్రెండ్‌కు విరామం ఉండొచ్చని సూచిస్తోంది. ఇకపై కూడా నిఫ్టీ 10006 పాయింట్ల పైన ట్రేడవుతూ ఉంటే క్రమంగా 10138, 10270, 10424 పాయింట్లను అందుకుంటుంది. ఒకవేళ తిరిగి 9829 స్థాయిని కోల్పోతే క్రమంగా 9699, 9411 పాయింట్ల స్థాయిలకు పడిపోవచ్చు. కానీ ప్రస్తుతానికైతే తక్షణ కరెక‌్షన్‌ కనిపించడంలేదు. ఇప్పుడున్న ర్యాలీ కొనసాగి మరో రెండు నెలల్లో 10300- 10500 పాయింట్ల స్థాయిని నిఫ్టీ తాకవచ్చన్నది అంచనా. 







You may be interested

ఇకపై మారుతి కన్నా హీరోనే మిన్న!

Wednesday 13th September 2017

ముంబై: ఆటో మొబైల్‌ సెక్టార్‌లోని అగ్రగామి వెలుగొందున్న మారుతీసుజుకీ షేరును ఇదే రంగంలోని హీరో మోటోకార్ప్‌ షేరు రాబోయే కాలంలో అధిగమించనుందా..? అవుననే అంటున్నారు మార్కెట్‌ నిపుణులు. ఇప్పటివరకు మారుతీ సుజుకీ షేరు హీరో మోటోకార్ప్‌ కన్నా మెరుగైన ప్రదర్శన కనబరచింది. గత యేడాది కాలంలో హీరో మోటోకార్ప్‌ షేరు 29శాతం వృద్ది చెందగా, ఇదే సెక్టార్‌లోని మారుతీ సుజుకీ షేరు 49శాతం మాత్రమే వృద్ది చెందింది. గతేడాది కేంద్రప్రభుత్వం

సుగర్‌, బ్యాంకు స్టాకుల హుషారు..

Wednesday 13th September 2017

దేశీయ సూచీలు బుధవారం కూడా పాజిటివ్‌గా కొనసాగుతున్నాయి. ఆర్‌ఐఎల్‌, హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్‌ అండతో సూచీలు పటిష్ఠంగా ట్రేడవుతున్నాయి. మధ్యాహ్న సమయానికి సెన్సెక్స్‌ 144 పాయింట్ల లాభంతో నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ కీలకమైన 32 వేల పాయింట్లపైన, నిఫ్టీ పదివేలవంద పాయింట్ల పైన కదలాడుతున్నాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు సుమారు అరశాతం లాభపడ్డాయి. బుధవారం ట్రేడింగ్‌లో బ్యాంకు షేర్ల జోరు పెరిగింది. ప్రైవేట్‌బ్యాంకుల్లో యస్‌బ్యాంక్‌ మినహా మిగిలినవి

Most from this category