STOCKS

News


10,500 స్థాయికి నిఫ్టీ..!

Saturday 3rd February 2018
Markets_main1517650666.png-13666

ముంబై: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ నిఫ్టీ మరో 2.5 శాతం పతనమయ్యే అవకాశం ఉందని టెక్నికల్‌ అనలిస్టులు సూచిస్తున్నారు. స్వల్పకాలంలోనే ఈ సూచీ 10,500 స్టాయిని పరీక్షించే అవకాశం ఉందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అండ్‌ డెరివేటీవ్‌ ఎక్స్‌పర్ట్‌ రాజేష్ పాలవియా విశ్లేషించారు. మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్‌కు చెందిన చందన్ తపరియా సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఈ నెలలో ఆఖరి గురువారం అయిన ఫిబ్రవరి 22(ఎఫ్‌ అండ్‌ ఓ సిరీస్‌ క్లోజింగ్‌)న నిఫ్టీ ఆప్షన్స్‌ డేటాను ఒకసారి పరిశీలిస్తే.. 10,500 పుట్స్‌ 59.84 లక్షల షేర్లతో అత్యధికంగా ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ కలిగి ఉండగా.. 10,700 పుట్స్‌ 41.2 లక్షల షేర్లతో ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ కలిగి ఉన్నాయని, ఇది నిఫ్టీ త్వరలోనే 10,500 స్టాయిని పరీక్షిస్తుందనేందుకు సంకేతంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. 10,700 స్థాయి దిగువన డీపర్‌ కరెక్షన్‌ పొంచి ఉందని విశ్లేషిస్తున్నారు. పుట్‌-కాల్‌ రేషియో ఇది సూచిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ప్రస్తుత స్థాయిలో ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అత్యధిక మొత్తంలో నిఫ్టీ పుట్‌ ఆప్షన్ల కంటే కాల్స్‌ ఆప్షన్లనే అమ్మివేస్తుండడం.. నిఫ్టీకి అప్‌వార్డ్‌ మూవ్‌మెంట్‌ రెసిస్టెన్స్‌ ఉన్నట్లు కనబడుతుందని విశ్లేషించారు. మార్కెట్‌ పెరిగే అవకాశం లేదు అని ట్రేడర్లు భావిస్తే.. వీరు ఎక్కువగా కాల్స్‌ అమ్మి, తక్కువ పరిమాణంలో పుట్స్‌ విక్రయిస్తారని అన్నారు. 



You may be interested

బడ్జెట్‌పై హెచ్‌డీఎఫ్‌సీ విశ్లేషణ

Saturday 3rd February 2018

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో పరిశీలించగలరు.

ఈ 5 షేర్లలోనే బడ్జెట్‌ ర్యాలీ..!

Saturday 3rd February 2018

ముంబై: బడ్జెట్‌ 2018 పూర్తి ఫోకస్‌ గ్రామీణ అభివృద్ధిపైనే ఉండగా.. ఈ రంగానికి సంబంధించిన షేర్లలోనే తదుపరి ర్యాలీ ఉంటుందని ఎస్‌ఎస్‌జే ఫైనాన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సౌరభ్ జైన్ అన్నారు. పోస్ట్‌ బడ్జెట్‌ తరువాత ఈ 5 షేర్లు ఇన్వెస్ట్‌మెంట్‌కు అనువుగా ఉన్నాయని సూచిస్తున్నారు. ఎస్కార్ట్స్‌, స్వరాజ్ ఇంజిన్స్, గోద్రేజ్ ఆగ్రోవెట్: బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి భారీ స్థాయిలోనే వరాలు ఇచ్చింది. 2022 నాటికి రైతుల ఆదాయం ఏకంగా రెండింతలు

Most from this category