STOCKS

News


మళ్లీ కొత్త హైకి నిఫ్టీ వెళ్లొచ్చు- బిర్లా సన్‌ లైఫ్‌

Friday 27th April 2018
Markets_main1524825647.png-15955

ముంబై: కంపెనీల ఎర్నింగ్స్‌ వృద్ది చెందుతున్న నేపథ్యంలో నిఫ్టీ మళ్లీ నూతన గరిష్టస్థాయిలను తాకవచ్చని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ కో-సిఐఓ మహేష్ పాటిల్ అంచనావేశారు. జనవరిలో 11,171 పాయింట్ల గరిష్టస్థాయిని నమోదుచేసిన నిఫ్టీ అక్కడ నుంచి భారీ పతనాన్ని చూసినప్పటికీ.. కంపెనీల ఆదాయాలు బాగున్న కారణంగా పతనంలో దాదాపు సగం వరకు రికవరీ సాధించడమే ఇందుకు నిదర్శనమన్నారు. అంతర్జాతీయ అంశాలు ఇప్పటికీ బలహీనంగా ఉన్నప్పటికీ దేశీయంగా కంపెనీల ఫలితాలు ఆశాజనంగా ఉండడం వల్ల మైక్రో స్టోరీ ఆకర్షణీయంగా ఉందన్నారు. ఇప్పటికే వెలువడిన ఫలితాల ప్రకారం ఆటో రంగం వృద్ధిరేటును నమోదుచేయం ఇందుకు సంకేతం అన్నారు. మార్కెట్‌ బుల్లిష్‌గానే ఉందన్న ఆయన ఐటీ రంగం కూడా ర్యాలీని ప్రదర్శించిందన్నారు. దీర్ఘకాల లక్ష్యం కోసం (రెండేళ్ల సమయం) కార్పొరేట్‌ లెండింగ్‌ బ్యాంకుల్ని ఆయన సిఫార్సు చేశారు.



You may be interested

మార్కెట్‌ ముగింపు..3 నెలల గరిష్టం ..!

Friday 27th April 2018

35,000 పాయింట్లపైకి సెన్సెక్స్‌, 10,700 పాయింట్లపైకి నిఫ్టీ ఫిబ్రవరి 2 తర్వాత ఇదే గరిష్ట ముగింపు కదంతొక్కిన బ్యాంకింగ్‌ షేర్లు ముంబై:- వారంలో చివరి ట్రేడింగ్‌ రోజైన శుక్రవారం భారత్‌ మార్కెట్‌ దాదాపు మూడు నెలల గరిష్టస్థాయిలో ముగిసింది.  ప్రధాన సూచీలైన  సెన్సెక్స్‌ 256 పాయింట్లు లాభపడి 34,970 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు పెరిగి 10,692 వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 35,000 పాయింట్లపైకి, నిఫ్టీ 10,700 పాయింట్లపైకి ర్యాలీ జరిపినప్పటికీ, ఆయా

మే సీరిస్‌లో కన్నేయాల్సిన స్టాకులివే..

Friday 27th April 2018

సెంట్రమ్‌ బ్రోకింగ్‌ రెండు నెలల కరెక‌్షన్‌ అనంతరం సూచీలు మళ్లీ కుదుట పడ్డాయి. మే సీరిస్‌ను మార్కెట్లు పాజిటివ్‌గా ఆరంభించాయి. అయితే షార్టు పొజిషన్లు కూడా బాగానే పోగయ్యాయి. ఏప్రిల్‌లో 19 ట్రేడింగ్‌ సెషన్లు జరగగా, 15 సెషన్లు బుల్స్‌ పట్టులోనే సాగాయి. దీంతో ఏప్రిల్‌ సీరిస్‌ అంతానికి నిఫ్టీ 10600 స్థాయిని దాటేసింది. కొత్త సీరిస్‌లో రంగాల వారీగా ఐటీ రంగ షేర్లపై ఇన్వెస్టర్లు ఎక్కువ మోజు చూపుతున్నారు. పలు

Most from this category