STOCKS

News


సుమిత్‌ బగాడియా రెకమండ్‌ చేస్తున్న 5 షేర్లు ఇవే..!

Saturday 13th January 2018
Markets_main1515837741.png-13113

ముంబై: ఈ ఏడాది చివరినాటికి నిఫ్టీ 12,000 పాయింట్లకు చేరే అవకాశం ఉందని ఛాయిస్ బ్రోకింగ్ అసోసియేట్ డైరెక్టర్ సుమిత్‌ బగాడియా అంచనావేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్‌ ఈపీఎస్‌ వృద్ధిరేటు 19 రెట్లు ఉండేందుకు అవకాశం ఉందన్న ఆయన ప్రైమరీ మార్కెట్‌ సైతం 2017 మాదిరిగానే ఉత్సాహంగా ఉంటుదని విశ్లేషిస్తున్నారు. ఎర్నింగ్స్‌లో వృద్ధి, వస్తుసేవల పన్ను ప్రభావం లాంటి ప్రధాన అంశాల ఆధారంగా ఈ విశ్లేషణ ఇస్తున్నట్లు తెలియజేశారు. క్రూడాయిల్‌ ధర 77 డాలర్లకు చేరుకునేందుకు అవకాశం ఉండగా.. ఈ ప్రభావాన్ని బేరీజు వేసుకునే నిఫ్టీ అంచనాలను ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. బేస్‌మెటల్స్‌ గతేడాదిలో 23-34 శాతం మధ్యపెరిగాయని, అల్యూమినియం 34 శాతం, కాపర్‌ 31 శాతం పెరిగినట్లు వెల్లడించిన ఆయన ఇకపై కూడా ఈ ర్యాలీ కొనసాగనుందని అన్నారు. ఈ ఏడాదిలో కనీసం 19 నుంచి 31 శాతం రాబడిని ఇవ్వగలిగిన 5 షేర్లను రెకమండ్‌ చేస్తున్నారు. అవేంటంటే..

ఓఎన్‌జీసీ
కొనుగోలు చేయదగిన ధర రూ.192.35
టార్గెట్‌ ధర రూ.230-250
ఏడాదికాలంలో రాబడి అంచనా 25 శాతం
రూ.185 స్థాయి వరకు కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నారు.

అమర్‌ రాజా బ్యాటరీస్
కొనుగోలు చేయదగిన ధర రూ.834.45
టార్గెట్‌ ధర రూ.1,040-1,073
ఏడాదికాలంలో రాబడి అంచనా 25 శాతం
రూ.800 స్థాయి వరకు కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు.

స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్‌)
కొనుగోలు చేయదగిన ధర రూ.92.70
టార్గెట్‌ ధర రూ.112.95-117
ఏడాదికాలంలో రాబడి అంచనా 19 శాతం
రూ.87.50 స్థాయి వరకు కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నారు.

యూపీఎల్‌ లిమిటెడ్‌
కొనుగోలు చేయదగిన ధర రూ.755.75
టార్గెట్‌ ధర రూ.902.00-1,002.95
ఏడాదికాలంలో రాబడి అంచనా 29 శాతం
రూ.725 స్థాయి వరకు కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు.

జేకే సిమెంట్స్‌
కొనుగోలు చేయదగిన ధర రూ.1,113.70
టార్గెట్‌ ధర రూ.1,367.70-1,488.25
ఏడాదికాలంలో రాబడి అంచనా 31 శాతం
రూ.1,055.00 స్థాయి వరకు కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నారు.

ఇవి కేవలం ఛాయిస్ బ్రోకింగ్ అసోసియేట్ డైరెక్టర్ సుమిత్‌ బగాడియా అంచనాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.



You may be interested

సరికొత్త రికార్డులతో ప్రారంభం

Monday 15th January 2018

ముంబై:- దేశీ సూచీలు సోమవారం సరికొత్త గరిష్టాల వద్ద ప్రారంభమయ్యాయి. నేటి ఉదయం సెన్సెక్స్‌ 94 పాయింట్ల లాభంతో 34,687.21 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 10, 718 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. శుక్రవారం అమెరికా మార్కెట్‌ రికార్డు ముగింపు, నేడు ఆసియా మార్కెట్ల నుంచి సానుకూలతలు తోడవ్వడంతో సూచీలు మరోసారి రికార్డుల పర్వానికి తెరతీసాయి. ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 204.13  పాయింట్లు లాభపడి 34,809కు చేరగా..

ఐడియా-వోడాఫోన్‌ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం

Saturday 13th January 2018

ముంబై:- వోడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ సంస్థల విలీన ప్రతిపాదనకు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం తెలిపింది. విలీన ప్రక్రియకు ఈనెల 11న ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపినట్లు ఐడియా సెల్యులార్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. విలీనానికి తుది ఆమోదం కోసం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలి కమ్యూనికేషన్స్‌ (డాట్‌) విభాగానికి ఇరు సంస్థలు దరఖాస్తు చేసుకోనున్నాయి.  విలీన ప్రక్రియ అనంతరం ఇండియా, ఐడియాల జాయింట్‌ వెంచర్‌ 40

Most from this category