STOCKS

News


రూపాయి ర్యాలీ: నష్టాల్లో ఐటీ షేర్లు

Tuesday 12th February 2019
Markets_main1549957292.png-24156

డాలర్‌ మారకంలో రూపాయి బలపడటంతో మంగళవారం ఐటీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల తగ్గుదల ప్రభావంతో దేశీయ కరెన్సీ గతఆరు ట్రేడింగ్‌ సెషన్ల నుంచి లాభ పడుతోంది. నేడు ఫారెక్స్‌ మార్కెట్లో 71.17 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైన రూపాయి క్రమంగా పుంజుకుంటూ 21పైసలు బలపడింది. రూపాయి ర్యాలీతో డాలర్ల మారకంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ కంపెనీ షేర్లు ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈ రంగానికి చెందిన ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, మైండ్‌ట్రీ షేర్లు 2శాతం క్షీణించాయి. అలాగే టెక్‌ మహీంద్రా, టాటా ఎలాక్సీ, విప్రో షేర్లు 1శాతం నష్టపోయాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు స్థాయి(16,099.05)తో పోలిస్తే 1.50శాతం నష్టంతో 15825 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలోని టాప్‌-5 లూజర్లలో హెచ్‌సీఎల్‌టెక్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు రెండు, మూడు స్థానాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

జనవరిలో టాప్‌ ఎంఎఫ్‌ల అమ్మకాలు, కొనుగోళ్లు..

Tuesday 12th February 2019

గత నెల దేశీయ ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి రెండేళ్లలో కనిష్ఠ నిధుల ప్రవాహం కనిపించింది. గతనెలతో పోలిస్తే 7 శాతం తక్కువగా రూ. 6160 కోట్లు ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి వచ్చాయి. మార్కెట్లో ప్రస్తుత డైలమా మరికొంత కాలం కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో టాప్‌ 3 మ్యూచువల్‌ ఫండ్స్‌ జనవరిలో ఏం కొన్నాయి? ఏం విక్రయించాయి? చూద్దాం.. 1.  హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌:  వివిధ స్టాకుల్లో 1.2 లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు

స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌ కొనొచ్చు!

Tuesday 12th February 2019

మోర్గాన్‌స్టాన్లీ సూచన చిన్న, మధ్యతరహా స్టాక్స్‌ను కొనుగోలు చేసే సమయం వచ్చిందని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ అభిప్రాయపడుతోంది. ప్రధాన సూచీలతో పోలిస్తే చిన్న స్టాకులు చూసిన కరెక‌్షన్‌ దృష్టితో చూస్తే వీటిని ఇక కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఇకమీదట సూచీలు క్రమానుగత రికవరీ చూపుతాయని, ముఖ్యంగా ప్రధాన సూచీలకు స్మాల్‌, మిడ్‌క్యాప్‌ సూచీలకు మధ్యకల వ్యత్యాసం క్రమంగా తగ్గుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం ఈవ్యత్యాసం ఆల్‌టైమ్‌ గరిష్ఠాలకు దగ్గరగా ఉందని

Most from this category