News


రికార్డుస్థాయి నుంచి వెనక్కి

Thursday 18th April 2019
Markets_main1555583470.png-25209

ఇన్వెస్టర్ల అప్రమత్తతతో పాటు లాభాల స్వీకరణతో  గురువారం మార్కెట్‌ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 135 పాయింట్లు నష్టపోయి 39140.28 వద్ద, నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 11752.80 వద్ద స్థిరపడింది. సూచీలు రికార్డుస్థాయిలకు చేరిన తరుణంలో  ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో పాటు నేడు మార్కెట​ముగింపు అనంతరం దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గత ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసిక ఫలితాలను వెల్లడించనుండటం, గుడ్‌ఫ్రైడ్‌ సందర్భంగా రేపు(శుక్రవారం), శని ఆదివారాలు సాధారణ సెలవులు కారణంగా మార్కెట్‌ వరుసగా మూడురోజులు పనిచేయకపోవడం తదితర అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ బలహీనపడింది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్ల భారీ పతనంతో బ్యాంకు నిఫ్టీ 1శాతం క్షీణించి 30,223.40 స్థిరపడింది. 
 ఒకరోజు సెలవు రోజు అనంతరం నేడు సూచీలు రికార్డు స్థాయిల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిఫ్టీ 69 పాయింట్లు లాభపడి 11,859, సెన్సెక్స్‌ 144 పాయింట్ల లాభంతో 39,420 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీకి చెందిన రీఫైనరీ, పెట్రో కెమికల్స్‌ వ్యాపారంలో 25శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సౌదీ ఆరామ్‌ కో ప్రయత్నాలు చేస్తున్నట్లు మీడియా వార్తలు వెలువడంతో రిలయన్‌​‍్స 2.50శాతం పెరగడంతో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఇరు సూచీలు తమ కొత్త జీవితకాల గరిష్టస్థాయిను నమోదు చేశాయి. నిఫ్టీ 11,856.15 వద్ద, సెన్సెక్స్‌ 39,487.45 వద్ద జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. అనంతరం ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో సూచీలు తిరిగి నష్టాల బాట పట్టాయి. ఇక ఏ దశలో ఇన్వెస్టర్లు షేర్ల కొనగోళ్లకు మొగ్గుచూపకపోవడంతో సూచీలు మార్కెట్ ముగింపు వరకు నష్టాల్లో ట్రేడయ్యాయి. తద్వారా సూచీల నాలుగు రోజుల జైత్రయాత్రకు బ్రేకులు పడినట్లైంది. 
ఇండస్‌ ఇండ్‌, వేదాంత, హిందాల్కో, యస్‌ బ్యాంక్‌, ఇండియన్‌బుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు 3శాతం నుంచి 4.50శాతం నష్టపోగా, విప్రో, బీపీసీఎల్‌, టాటామోటర్స్‌, జీఎస్‌డబ్లూ‍్య స్టీల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 3.50శాతం లాభపడ్డాయి. 



You may be interested

ఫెడరల్‌ బ్యాంక్‌ నుంచి పేలవ ఫలితాలు?!

Thursday 18th April 2019

నిపుణుల అంచనా పేరొందిన ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా తాజాగా ఫెడరల్‌ బ్యాంకులో వాటాను తగ్గించుకుంటూ వస్తున్నారు. మార్చిచివరి నాటికి రాకేశ్‌ దాదాపు 12.5 లక్షల ఫెడరల్‌ బ్యాంకు షేర్లను తన రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా విక్రయించారు. దీంతో బ్యాంకులో ఆయన వాటా 1.16 నుంచి 1.1 శాతానికి దిగివచ్చింది. క్యు3లో స్థిరమైన ఫలితాలు ప్రకటించినా బ్యాంకు షేరు ఈ మధ్యకాలంలో పెద్దగా పెరగలేదు. దీంతో క్యు4లో బ్యాంకు ఫలితాలు పేలవంగా

ఆర్‌ఐఎల్‌ ఆప్షన్‌ విక్రేతలకు ఎదురుదెబ్బ

Thursday 18th April 2019

గురువారం ఫలితాల అనంతరం ఆర్‌ఐఎల్‌ షేరులో భారీ పెరుగుదల ఉంటుందని భావించిన పలువురు ఆప్షన్‌ సెల్లర్లకు గురువారం ఆరంభంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీ రిఫైనింగ్‌ వ్యాపారంలో సౌదీ అరామ్‌కో మైనార్టీ వాటా కొనుగోలు చేయనుందన్న వార్తలతో గురువారం ఆరంభంలోనే షేరు గ్యాప్‌అప్‌తో ఓపెనయింది. దీంతో ఆప్షన్‌ సెల్లర్లు తమ పొజిషన్లు కవర్‌ చేసుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. ఫలితాలు వస్తున్నాయన్న నేపథ్యంలో మంగళవారం ఆర్‌ఐఎల్‌ 1360 స్ట్రైక్‌ ప్రైస్‌

Most from this category