STOCKS

News


10,400-10,450 స్థాయికి నిఫ్టీ..!

Saturday 19th May 2018
Markets_main1526712638.png-16613

పీఎన్‌బీ షేరు టార్గెట్‌ రూ.68-65
లుపిన్‌, సన్‌ఫార్మా షేర్లలో మరో 10 శాతం పతనం..!

ముంబై: ఎగువస్థాయిలో నిఫ్టీకి 10,700 వద్ద అమ్మకాల ఒత్తిడి ఎదురుకానుండగా.. దిగువస్థాయిలో 10,400-10,450 వద్ద మద్దతు ఉందని ఇండియా బుల్స్ వెంచర్స్ హెడ్‌ రీసెర్చ్‌ మనవ్ చోప్రా విశ్లేషించారు. ఇంతకుముందు సపోర్ట్‌ స్థాయిగా ఉన్న 10,700 ఇప్పడు ప‌టిష్టమైన నిరోధస్థాయిగా ఉందన్నారు. నిఫ్టీ 10,100 నుంచి 10,800 స్థాయికి చేరిన క్రమంలో కీలక స్థాయిలను అధిగమించి.. ఓవర్‌బాట్‌ జోన్‌కు చేరుకుందని, అక్కడ నుంచి కరెక్షన్‌ చూస్తుందని వివరించారు. మార్కెట్‌ నిలబడలేకపోతే వచ్చే రెండువారాలలో 10,400-10,450 స్థాయికి పడిపోయే అవకాశం ఎక్కువగా ఉందని విశ్లేషించారు. ఇండివిడ్యువల్‌ షేర్ల పరంగా చూస్తే బజాజ్‌ ఫైనాన్స్‌ బలమైన అప్‌ట్రెండ్‌లో ఉందన్నారు. వీక్లీ, మంత్లీ చార్టులలో షేరు అత్యధిక వాల్యూమ్స్‌తో మంచి బ్రేకవుట్‌ సాధించిందన్నారు. ఇంట్రాడే ఆధారంగా ఈ షేరుకు రూ.2100 వద్ద సపోర్ట్‌ ఉండగా.. స్వల్పకాలిక టార్గెట్‌ రూ.2180 వద్ద ఉన్నట్లు వెల్లడించారు. రూ.2250 వరకు వెళ్లేందుకు అవకాశం ఉందన్నారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ షేరు అండర్‌పెర్ఫార్మ్‌గా ఉందని, ప్రస్తుతం రూ.75 వద్ద ఉన్న ఈ షేరు ధర స్వల్పకాలానికి రూ.68-65 స్థాయికి చేరుకోవచ్చని సూచించిన ఆయన రూ.85-86 రేంజ్‌కు వెళ్లే అవకాశం అయితే లేదని వివరించారు. ఈ షేరుకు దూరంగా ఉండడమే బెటరని సూచించారు. ఫార్మా రంగంలో ఇప్పుడే బోటమ్‌ చెప్పడం కష్టమన్న ఆయన లుపిన్‌, సన్‌ఫార్మా షేర్లు మాత్రం వచ్చే కొద్ది వారాలు లేదంటే నెలలలోనే మరో 10 శాతం వరకు పడిపోవచ్చని విశ్లేషించారు. 



You may be interested

వరుసగా నాలుగో వారంలోనూ తగ్గిన ఫారెక్స్‌ నిల్వలు

Saturday 19th May 2018

ముంబై:- దేశంలో విదేశీ మారక ద్రవ్యపు నిల్వలు వరుసగా నాలుగో వారంలోనూ తగ్గాయి. ఈ వారంలో రూపాయి భారీ పతనం, అంతర్జాతీయంగా ముడిచమురు నాలుగేళ్ల గరిష్టస్థాయి చేరుకోవడం ఫారెక్స్‌ నిల్వలు తగ్గుదలకు కారణమయ్యాయి. మే 11తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వలు 1.2 బిలియన్ల డాలర్ల మేర తగ్గి 417.7 బిలియన్‌ డాలర్లు నమోదైనట్లు భారతీయ రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. శుక్రవారం మార్కెట్‌ ముగిసే సమయానికి

మే 21న ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఐపీఓ లిస్టింగ్‌..!

Saturday 19th May 2018

మే 11న ముగిసిన ఇష్యూ 7 రెట్లు సబ్‌స్క్రైబయిన ఐపీఓ ముంబై:- ఇటీవలే పబ్లిక్‌ ఇష్యూ పూర్తి చేసుకున్న ఆర్థిక సేవల సంస్థ ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌ స్టాక్‌ ఎక్స్చేంజీలలో సోమవారం (మే21న) లిస్ట్‌కానుంది. ఈ మే 9న ప్రారంభమైన 11న ముగిసిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1,844 కోట్లను సమీకరించింది. ఇష్యూ ప్రైస్‌ బాండ్‌ ఒక్కో షేరుకు రూ.570-572గా కంపెనీ నిర్ణయించింది. మే 8న సుమారు 24 యాంకర్‌ ఇన్వెస్టర్ల సంస్థలకు

Most from this category