STOCKS

News


10025 పాయింట్లే చివరి ఆశ!

Tuesday 13th February 2018
Markets_main1518518941.png-13929

నిఫ్టీపై పట్టుకు బుల్స్‌కు ఇదే గట్టి మద్దతు
రెండువారాలుగా అంతర్జాతీయ మార్కెట్లలో కనిపిస్తున్న కరెక‌్షన్‌ దెబ్బకు ఇన్వెస్టర్లు కుదేలవుతున్నారు. నిజానికి ఇతర మార్కెట్లతో పోలిస్తే భారత్‌ కాస్తమేర నయమనిపించేలా ఉంది. నిఫ్టీ ఆల్‌టైమ్‌ హై నుంచి దాదాపు 6 శాతం పతనమైంది. బడ్జెట్‌ నుంచి కేవలం డీఐఐలు మాత్రమే నికర కొనుగోలుదారులుగా మారాయి. ఎఫ్‌ఐఐలు, రిటైలర్లు నికరంగా అమ్మకాలకే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక అప్‌ట్రెండ్‌ కొనసాగాలంటే తిరిగి మార్కెట్‌పై బుల్స్‌కు పట్టు రావాల్సిఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికైతే తాత్కాలిక ట్రెండ్‌ నెగిటివ్‌గానే ఉంది. నిఫ్టీ 200 రోజుల డీఎంఏ 10025- 10050 పాయింట్ల వద్ద ఉంది. ఈ స్థాయిని బుల్స్‌కు ఆఖరు గట్టి మద్దతు స్థాయిగా టెక్నికల్‌ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌పై పట్టు సాధించాలంటే బుల్స్‌ ఈ స్థాయిని తప్పక కాపాడుకోవాల్సి ఉంటుందని, ఈ స్థాయి కోల్పోతే మధ్యకాలానికి పతనావస్థలోకి సూచీలు దిగజారుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ స్థాయిని నిఫ్టీ నిలుపుకోలేకుంటే తిరిగి 9600-9700 పాయింట్ల శ్రేణి వరకు దిగజారుతుందని అంచనా. నిఫ్టీ ఇటీవల తాకిన కనిష్ఠస్థాయి 10276 పాయింట్ల నుంచి పుల్‌బ్యాక్‌ కనిపించినా కనీసం 10600 పాయింట్ల వరకు కూడా కొనసాగించలేకపోయింది. ప్రస్తుతానికి ఈ స్థాయి తాత్కాలిక నిరోధంగా పనిచేయవచ్చు. షార్టు పొజిషన్లను 10700 పాయింట్ల స్టాప్‌లాస్‌తో కొనసాగించవచ్చు. 



You may be interested

ఈ పరిస్థితుల్లో బఫెట్‌ సూత్రం.. తారకమంత్రం!

Tuesday 13th February 2018

5నాన్స్‌ డాట్‌ కామ్‌ సీఈఓ దినేశ్‌రోహిరా సలహాలు చాలా రోజుల బుల్‌ రన్‌ తర్వాత దేశీయ మార్కెట్లు అంతర్జాతీయ సూచీలను అనుసరిస్తూ భారీ పతనానికి గురైయ్యాయి. యుఎస్‌లో ద్రవ్యోల్బణ భయాలు, బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడం, వడ్డీరేట్లపై భయాలు కరెక‌్షన్‌కు కారణాలయ్యాయి. తాజాగా దేశీయ సూచీల్లో వచ్చిన కరెక‌్షన్‌ ఎప్పటినుంచో మార్కెట్లోకి ప్రవేశించాలని భావిస్తూ వాల్యూషన్ల కారణంగా దూరంగా ఉంటున్నవారికి మంచి అవకాశాన్నిస్తోందని దినేశ్‌ చెబుతున్నారు. ఈ సమయంలో వారెన్‌ బఫెట్‌ చెప్పిన

ఐపీఓకు ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌..!

Tuesday 13th February 2018

న్యూడిల్లీ:- బ్యాంకింగేతర రంగంలో సేవలు అందిస్తున్న ఇండోస్టార్‌ క్యాపిటల్‌ తొలిసారి తొలి పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ)కు సిద్ధమైంది.ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.2వేల కోట్లు సేకరించనుంది. ఈ మేరకు ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించింది.  ఇష్యూలో భాగంగా కంపెనీ తాజా షేర్ల జారీ ద్వారా రూ.700 కోట్లను, వాటాదారులకు చెందిన 2 కోట్ల షేర్ల విక్రయం ద్వారా మిగతా మొత్తాన్ని సమీకరించనుంది. ఈ ఐపీఓకు జేఎమ్‌ ఫైనాన్షియల్‌, కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌,

Most from this category