STOCKS

News


ఐడియా-వోడాఫోన్‌ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం

Saturday 13th January 2018
news_main1515835327.png-13112

ముంబై:- వోడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ సంస్థల విలీన ప్రతిపాదనకు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం తెలిపింది. విలీన ప్రక్రియకు ఈనెల 11న ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపినట్లు ఐడియా సెల్యులార్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. విలీనానికి తుది ఆమోదం కోసం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలి కమ్యూనికేషన్స్‌ (డాట్‌) విభాగానికి ఇరు సంస్థలు దరఖాస్తు చేసుకోనున్నాయి.  విలీన ప్రక్రియ అనంతరం ఇండియా, ఐడియాల జాయింట్‌ వెంచర్‌ 40 కోట్ల మంది కస్టమర్లను కలిగిన సంస్థగా, దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా ఏర్పాటుకానుంది. ఇప్పటి దాకా భారతీ ఎయిర్‌టెల్ అతిపెద్ద టెలీకాం సంస్థగా ఉండగా.. కొత్త కంపెనీ ఆ హోదాను దక్కించుకోనుంది. టెలికాం రంగలో రిలయన్స్‌జియో పోటీని తట్టుకునేందుకు గతేడాది మార్చిలో వోడాఫోన్-ఐడియా విలీన ప్రక్రియకు తెరలేపాయి.



You may be interested

సుమిత్‌ బగాడియా రెకమండ్‌ చేస్తున్న 5 షేర్లు ఇవే..!

Saturday 13th January 2018

ముంబై: ఈ ఏడాది చివరినాటికి నిఫ్టీ 12,000 పాయింట్లకు చేరే అవకాశం ఉందని ఛాయిస్ బ్రోకింగ్ అసోసియేట్ డైరెక్టర్ సుమిత్‌ బగాడియా అంచనావేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్‌ ఈపీఎస్‌ వృద్ధిరేటు 19 రెట్లు ఉండేందుకు అవకాశం ఉందన్న ఆయన ప్రైమరీ మార్కెట్‌ సైతం 2017 మాదిరిగానే ఉత్సాహంగా ఉంటుదని విశ్లేషిస్తున్నారు. ఎర్నింగ్స్‌లో వృద్ధి, వస్తుసేవల పన్ను ప్రభావం లాంటి ప్రధాన అంశాల ఆధారంగా ఈ విశ్లేషణ ఇస్తున్నట్లు తెలియజేశారు.

కన్‌స్ట్రక్షన్‌ కంపెనీల క్యూ3పై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనాలు..!

Saturday 13th January 2018

ముంబై: నిర్మాణరంగ కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసిక (2017–18, క్యూ3) ఫలితాలు మిశ్రమంగా ఉండేందుకే అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనావేస్తోంది. అశోకా బిల్డ్‌కాన్‌, దిలీప్‌ బిల్డ్‌కాన్‌, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌, ఐటీడీ సిమెంటేషన్‌, అహ్లువాలియా కాంట్రాక్ట్స్, జే కుమార్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ కంపెనీల ఫలితాలు బాగుండే అవకాశం ఉండగా.. పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌, ఎన్‌సీసీ ఫలితాలు నిరాశపరిచే అకాశం ఉందని విశ్లేషిస్తోంది. సద్భవ్ ఇంజినీరింగ్, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా ఫలితాలు పరవాలేదు

Most from this category