ఐటీ, బ్యాంకింగ్‌లో ఈ షేర్లు బెటర్!
By D Sayee Pramodh

రిలయన్స్ సెక్యూరిటీస్ సూచనలు
రాజకీయ అస్థిరతలు, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా దేశీయ మార్కెట్లో ఎఫ్ఐఐలు భారీగా పెట్టుబడులు ప్రస్తుతానికి పెట్టకపోవచ్చని ఆర్సెక్యూరిటీస్ ప్రతినిధి నవీన్ కులకర్ణి అభిప్రాయపడ్డారు. అన్ని మార్కెట్లలో ప్రస్తుతం లిక్విడిటీ సమస్య కనిపిస్తోందని, ఈక్విటీల్లో మరికొంత కాలం ఈ అనిశ్చిత పరిస్థితులు ఉండొచ్చని చెప్పారు. ఇప్పుడున్న మార్కెట్లో మిడ్‌క్యాప్ ఐటీ, బ్యాంకింగ్రంగాలు ఆకర్షణీయంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎర్నింగ్స్‌లో స్వల్ప ఆటుపోట్లు తప్ప మిడ్‌క్యాప్ ఐటీ విభాగం బాగానే ఉంటుందన్నారు. ఈ రంగంలో సొనాటా సాఫ్ట్వేర్, సైయంట్, మజెస్కో షేర్లను ఆయన సిఫార్సు చేశారు. ఈ రంగంలో లార్జ్‌క్యాప్స్ సైతం బాగానే ఉన్నాయని, కానీ వీటికన్నా మిడ్‌క్యాప్స్‌కు వృద్ది అవకాశాలు ఎక్కువని తెలిపారు. ఐటీ రంగ కంపెనీలు వచ్చే ఏడాది ఎర్నింగ్స్‌లో 12- 14 శాతం పెరుగుదల చూపవచ్చని అంచనా వేశారు. లార్జ్ క్యాప్ విభాగంలో టీసీఎస్, ఇన్ఫీలను ఆయన రికమండ్ చేశారు. బ్యాంకింగ్ రంగంలో కూడా మంచి స్టాకులున్నాయన్నారు. యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు దీర్ఘకాలానికి పరిశీలించవచ్చని సూచించారు. ఐసీఐసీఐ బ్యాంకును ప్రస్తుత స్థాయిల్లో కూడా కొనుగోలు చేయవచ్చన్నారు. ఈ స్టాకులో మరింత అప్‌మూవ్‌కు ఛాన్సులున్నాయన్నారు. ప్రైవేట్ బ్యాంక్ మిడ్‌క్యాప్స్‌లో డీసీబీ షేరును ఆయన సిఫార్సు చేశారు. ఆటో రంగంలో కమర్షియల్ విభాగంపై కాస్త నెగిటివ్‌గా ఉన్నామని చెప్పారు. పాసింజర్ విభాగంలో మారుతీ సుజుకీ షేరును పరిశీలించవచ్చన్నారు. ఆటో రంగంలో రికవరీకి మరో ఆరునెలల వరకు సమయం పట్టవచ్చని అభిప్రాయపడ్డారు.
You may be interested
10900 దిగువన నిఫ్టీ ముగింపు
Monday 11th February 2019151 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ బ్యాంకింగ్, ఫార్మా, అటో రంగ షేర్లలో అమ్మకాలతో మార్కెట్ సోమవారం నష్టాలతో ముగిసింది. వరుసగా మూడో రోజూ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా నిఫ్టీ సూచీ 10900 మార్కును కోల్పోయి 55 పాయింట్ల నష్టంతో 10,888.80 వద్ద, సెన్సెక్స్ 151 పాయింట్లను కోల్పోయి 36,395 వద్ద స్థిరపడ్డాయి. బ్యాంక్ ఇండెక్స్ 66 పాయింట్లను పతనమై 27,227.80 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్(అరశాతం లాభం),
పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు డౌన్
Monday 11th February 2019సోమవారం ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్ ఇంట్రాడేలో 2.50శాతం నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్ 2,895.35ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారభించింది. ఇంట్రాడేలో ఈ సూచీలో భాగమైన ఐడీఐబీ అత్యధికంగా 3.50శాతం నష్టపోయింది. ఇండియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు 2.50శాతం పతనమయ్యాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జమ్మూ&కాశ్మీర్ షేర్లు 2శాతం