STOCKS

News


ఈ స్టాక్స్‌లో ఫండ్స్‌ వాటాలు పెంచుకుంటూనే ఉన్నాయ్‌

Saturday 10th March 2018
personal-finance_main1520691243.png-14551

గడిచిన ఏడాదిన్నర కాలంలో స్టాక్‌ మార్కెట్లు మంచి ర్యాలీ చేసి స్వల్ప విరామం తీసుకున్నాయి. ర్యాలీలో ఎన్నో స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌తోపాటు లార్జ్‌క్యాప్‌ మంచి లాభాలను ఇచ్చాయి. ఇలా ర్యాలీ చేసిన వాటిలో మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ వాటాలు పెంచుకున్న 10 స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఉన్నాయి. ఈ కాలంలో ఈ స్టాక్స్‌ 200 శాతం వరకు పెరగడం గమనార్హం.

టాటా కెమికల్స్‌లో 2017 డిసెంబర్‌ నాటికి మ్యూచువల్‌ ఫండ్స్‌కు ఉన్న వాటా 24.58 శాతానికి చేరింది. 2015 డిసెంబర్‌ క్వార్టర్లో ఫండ్స్‌ వాటా కేవలం 11.27 శాతమే. గడిచిన ఎనిమిది త్రైమాసికాల్లోనూ దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఈ స్టాక్‌లో వాటాలు పెంచుకుంటూ ఉండడం విశేషం. ఇది కంపెనీ వృద్ధి అవకాశాల పట్ల ఫండ్స్‌ నమ్మకాన్ని ప్రతిఫలిస్తోందంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా ఈ కాలంలో కంపెనీ కూడా వ్యాపారాన్ని లాభసాటిగా మార్చేందుకు, వృద్ధి బాట పట్టించేందుకు, నిర్వహణ సామర్థ్యాన్ని ఇతోధికం చేసే చర్యలు చేపట్టింది. యూరియా వ్యాపారం నుంచి తప్పుకోవడం, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులపై ఎక్కువగా ఫోకస్‌ చేయడం వంటివి వీటిలో ఉన్నాయి. గడిచిన రెండేళ్లలో ఈ స్టాక్‌ 102 శాతం లాభపడింది.

ఇండియా సిమెంట్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా 2015 డిసెంబర్‌లో 6.49 శాతం ఉండగా, 2017 చివరి నాటికి 20.77 శాతానికి పెరిగింది. ఈ కంపెనీ పనితీరు పట్ల ఎడెల్వీజ్‌ ఫైనాన్షియల్‌ సానుకూలంగా ఉంది. తమిళనాడులో ఇసుక లభ్యత పెరగడం, డిమాండ్‌ పెరగడం, ధరలు పుంజుకోవడం వంటివి సానుకూలతలుగా ఎడెల్వీజ్‌ పేర్కొంది. ఈ స్టాక్‌ గత రెండేళ్ల కాలంలో 112 శాతం పెరిగింది. కార్బొరండం యూరివర్సల్‌ సైతం గడిచిన రెండేళ్లలో 98 శాతం లాభపడింది. ఈ కంపెనీలో మ్యూచువల్‌ ఫండ్స్‌కు 2015 డిసెంబర్‌ నాటికి 11.2 శాతం వాటా ఉండగా, అది కాస్తా గత డిసెంబర్‌ నాటికి 19 శాతానికి చేరుకుంది. అబ్రాసివ్‌ డివిజన్‌ నుంచి 40 శాతం ఆదాయం వస్తుండగా, ఇండస్ట్రియల్‌ సిరామిక్స్‌ నుంచి 25శాతం, ఎలక్ట్రో మినరల్స్‌ ద్వారా 30 శాతం ఆదాయం కంపెనీ వ్యాపార వైవిధ్యాన్ని చాటుతోంది. ఇక ఓరియెంటల్‌ కార్బన్‌ కెమికల్స్‌ కూడా ఫండ్స్‌కు ఆకర్షణీయమైన వాటిలో ఒకటి. ఇందులో ఫండ్స్‌ వాటా గడిచిన రెండేళ్లలో 6.41 శాతం నుంచి 14.46 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో ఈ స్టాక్‌ 193 శాతం మేర లాభపడింది. జేకే సిమెంట్స్‌, డెక్కన్‌ సిమెంట్స్‌, వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌, జీహెచ్‌సీఎల్‌, సింఫనీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్‌లోనూ ఫండ్స్‌ నిరంతరాయంగా పెట్టుబడులు పెడుతూ ఉండడం సానుకూలంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. You may be interested

88 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌

Monday 12th March 2018

ముంబై: స్టాక్‌ సూచీలు సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమయ్యాయి. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ నిఫ్టీ మరోసారి 10,300 పాయింట్ల స్థాయిని అధిగమించింది. 88 పాయింట్ల లాభంతో 10,315 వద్ద మొదలయ్యింది. సెన్సెక్స్‌  279 పాయింట్లు లాభపడి 33,586 వద్ద మొదలయ్యింది. నిఫ్టీ ఇండీసెస్‌లో పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీ మినహాయించి మిగిలిన అన్ని సూచీలు లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. పీఎస్‌యూ బ్యాంక్‌ 1 శాతం నష్టాల్లో ఉంది. లాభాల్లో ట్రేడవుతున్న రంగాలలో

మ్యూచువల్‌ ఫండ్స్‌ కటాఫ్‌ టైమ్‌ తెలుసా?

Saturday 10th March 2018

మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు, విక్రయాలకు ప్రతీ రోజూ కటాఫ్‌ టైమింగ్‌ అని ఉంటుంది. పెట్టుబడులు పెట్టే ప్రతీ ఇన్వెస్టర్‌ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఇది. మీరు రోజులో ఎప్పుడు దరఖాస్తు చేసినా ఒకటే ఎన్‌ఏవీ అమలు కాదు. ఏ సమయంలోపు మీ దరఖాస్తు ఫండ్స్‌ సంస్థను చేరిందన్నది యూనిట్ల కేటాయింపునకు కీలకం అవుతుంది. ఇక ఈక్విటీ, ఇతర ఫండ్స్‌కు కటాఫ్‌ టైమ్‌ వేర్వేరుగా ఉంటుంది. మీ దరఖాస్తు అందిన సమయాన్ని

Most from this category