News


ముత్తూట్ ఫైనాన్స్‌ లాభం రూ. 451 కోట్లు

Wednesday 16th May 2018
news_main1526489145.png-16526

న్యూఢిల్లీ: రుణాల పోర్ట్‌ఫోలియోలో మార్పులు, చేర్పుల చేసిన నేపథ్యంలో గడిచిన ఆర్థిక సంవత్సరం క్యూ4లో ముత్తూట్ ఫైనాన్స్ నికర లాభం 40 శాతం ఎగిసి రూ. 451 కోట్లుగా నమోదైంది. 2016-17 మార్చి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 322 కోట్లుగా ఉంది. మరోవైపు ఆదాయం రూ. 1,573 కోట్ల నుంచి రూ. 1,710 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం రూ. 1,180 కోట్ల నుంచి రూ. 1,720 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ. 5,729 కోట్ల నుంచి రూ. 6,185 కోట్లకు చేరింది. పసిడి రుణాల వ్యాపారంపై ప్రధానంగా దృష్టి కొనసాగుతుందని, అయితే..ఇతర రుణాల విభాగాల్లోకి విస్తరిస్తుండటం కూడా వ్యాపారం మెరుగుపడటానికి తోడ్పడిందని సంస్థ చైర్మన్ ఎంజీ జార్జి ముత్తూట్‌ తెలిపారు. బీఎస్‌ఈలో ముత్తూట్ ఫైనాన్స్ షేరు 1.18 శాతం క్షీణించి రూ. 420 వద్ద క్లోజయ్యింది. You may be interested

క్రీమ్‌లైన్‌ డెయిరీ విస్తరణ

Wednesday 16th May 2018

కొత్తగా మరో మూడు ప్లాంట్లు రూ.400 కోట్ల పెట్టుబడి సంస్థ ఎండీ భాస్కర్‌ రెడ్డి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: జెర్సీ బ్రాండ్‌ పేరుతో పాలు, పాల ఉత్పాదనల తయారీలో ఉన్న క్రీమ్‌లైన్‌ డెయిరీ ప్రొడక్ట్స్ విస్తరణ చేపట్టనుంది. తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటకలో మూడేళ్లలో కొత్తగా ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.400 కోట్లు వెచ్చిస్తామని సంస్థ ఎండీ కె.భాస్కర్‌రెడ్డి తెలిపారు. నూతన ఉత్పాదన జెర్సీ థిక్‌షేక్స్‌ ఆవిష్కరణ సందర్భంగా బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కంపెనీ

ట్రేడ్‌ ఫైనాన్స్‌ కోసం ఇన్ఫీ బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్‌

Wednesday 16th May 2018

న్యూఢిల్లీ: ట్రేడ్ ఫైనాన్స్ వ్యాపార కార్యకలాపాల్లో బ్యాంకులకు తోడ్పడేలా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా ఫినకిల్ ట్రేడ్ కనెక్ట్ పేరిట బ్లాక్‌ చెయిన్ ఆధారిత నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. దీనికోసం యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్‌, ఆర్‌బీఎల్‌, కోటక్ మహీంద్రా, సౌత్ ఇండియా బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌లతో చేతులు కలిపింది. ట్రేడ్ ఫైనాన్స్ వ్యాపార ప్రక్రియలను డిజిటైజ్ చేయడం, చెల్లింపులు జరపడం మొదలైన వాటికి ఈ నెట్‌వర్క్ ఉపయోగపడుతుందని

Most from this category