News


అప్పుడు నా సహచరుల మాట వినాల్సింది

Tuesday 18th July 2017
news_main1500320255.png-5527

  • ఇన్ఫీ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి

న్యూఢిల్లీ: దేశీ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ‘ఇన్ఫోసిస్‌’ చైర్మన్‌ పదవి నుంచి వైదొలగడంపై ఆ కంపెనీ సహవ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్‌.ఆర్‌.నారాయణ మూర్తి ఇప్పుడు విచారం వ్యక్తంచేశారు. అప్పుడు కంపెనీ ఇతర సహవ్యవస్థాపకులు తనను పదవిలో కొనసాగాల్సిందిగా కోరారని, వారి మాట విని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కాగా ఇన్ఫోసిస్‌ చైర్మన్‌ పదవి నుంచి మూర్తి 2014లో తప్పుకున్నారు. ‘నా రాజీనామా నిర్ణయాన్ని కంపెనీ ఇతర సహ వ్యవస్థాపకులకు వ్యతిరేకించారు. కంపెనీ నుంచి వెళ్లిపోవద్దని, మరికొన్నేళ్లు కంపెనీకి సేవలు అందించాలని కోరారు. కానీ నేను వారి మాట వినలేదు’ అని వ్యాఖ్యానించారు. ‘నాకు సాధారణంగా భావోద్వేగాలు ఎక్కువ. నా నిర్ణయాలు ఎక్కువగా ఐడియలిజంపై ఆధారపడి ఉంటాయి. అయినప్పటికీ బహుశా నేను వారి మాట వినాల్సింది’ అని సీఎన్‌బీసీ టీవీ 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా కార్పొరేట్‌ గవర్నెన్స్‌, సిక్కా వేతన ప్యాకేజ్‌, మాజీ ఉద్యోగులకు చెల్లింపులు వంటి అంశాలకు సంబంధించి ఇన్ఫోసిస్‌ మేనేజ్‌మెంట్ నిర్ణయాలపై మూర్తి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 







You may be interested

మిగిలేవి పదో.. పన్నెండో..

Tuesday 18th July 2017

 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మరిన్ని విలీనాలు  3-4 అంతర్జాతీయ స్థాయి బ్యాంకులను తీర్చిదిద్దే ప్రయత్నాలు  ఆంధ్రా బ్యాంకు స్వతంత్రంగానే కొనసాగే అవకాశాలు న్యూఢిల్లీ: మరిన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల ద్వారా మొత్తం మీద 3-4 అంతర్జాతీయ స్థాయి బ్యాంకులను తీర్చిదిద్దడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) 21 ఉండగా.. విలీనాలతో ఈ సంఖ్య 10-12కి తగ్గనుంది. ఎస్‌బీఐ స్థాయిలో మరో 3-4 బ్యాంకులను తయారు చేయాలని

ఐటీ జాబ్‌లు కష్టమే!!

Tuesday 18th July 2017

 కొత్త కొలువులకు ఆటోమేషన్‌, కొత్త టెక్నాలజీల సెగ...  క్యూ-1లో దిగ్గజాల నియామకాల్లో తిరోగమనం...  టీసీఎస్‌, ఇన్ఫీల్లో చేరినవారికన్నా మానేసినవారే ఎక్కువ  టీసీఎస్‌లో 1,414 మంది, ఇన్ఫీలో 1,811 మంది తగ్గుదల...  కోతలు లేవంటూనే.. జోరు తగ్గించామంటున్న కంపెనీలు  మానేసిన వారిలో... తీసేసిన వారూ ఉండొచ్చన్న నిపుణులు ఉద్యోగాల కల్పవృక్షంగా చెప్పుకునే ఐటీ పరిశ్రమ.. ఇప్పుడు కొత్త కొలువుల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. ప్రధానంగా ఆటోమేషన్‌కు తోడు డిజిటల్‌, క్లౌడ్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) దిశగా అడులేస్తున్న ఐటీ కంపెనీలు..

Most from this category