News


మోడీ ఫ్యాక్టర్‌ కొనసాగుతోంది: యూబీఎస్‌

Wednesday 16th May 2018
Markets_main1526466467.png-16509

ముంబై: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోనికి వస్తుందా? లేదా అనే అంశం దేశీయ స్టాక్‌ మార్కెట్‌కు అత్యంత కీలకంగానే ఉందని యూబీఎస్‌ ఇండియా రిసెర్చ్ హెడ్‌ గౌతం చౌచారియా అన్నారు. వచ్చే 12 నెలలకాలంలో మల్టీపుల్స్‌కు కూడా ఇదే అంశం చోదక శక్తిగా కనబడతుందని విశ్లేషించారు. 2019 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. కర్ణాటక ఎన్నికల అంశాన్ని మార్కెట్‌ డిస్కౌంట్‌ చేస్తుందని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం ఉంటుందని అన్నారు. ఈ అంశం ఆధారంగా వచ్చే సాధారణ ఎ‍న్నికలలో మోడీ ప్రభుత్వం అధికారంలోనికి వస్తుందా రాదా అనే విషయంపై ఏమైనా స్పష్టత వస్తే మార్కెట్‌ దిశ మారుతుందని విశ్లేషించారు. అయితే గడిచిన నాలుగేళ్లలో మోడీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ఆధారంగా బీజేపీ 2019 ఎన్నికలలో విజయం సాధిస్తుందనే అంచనాల్లో మార్కెట్‌ వర్గాలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబరు వరకు కూడా నిఫ్టీ 10500 స్థాయిలోనే ఉండేందుకు అవకాశం ఉందన్న ఆయన ప్రస్తుతం మార్కెట్‌ రిస్క్‌ రివార్డ్‌ రేషియో ఏమంత ఆకర్షణీయంగా లేదని, ఇందుచేత ఇదే స్థాయికి అటూఇటుగా మార్కెట్‌ కదలికలు ఉంటాయని విశ్లేషించారు. వచ్చే ఏడాదిలోనే మార్కెట్‌ పెట్టుబడులు మంచి రాబడిని ఇచ్చేందుకు అవకాశం ఉందని అంచనావేశారు. అంతర్జాతీయ ఆర్థిక అంశాల కారణంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో ఒడిదుడుకులు చోటుచేసుకుంటుండగా.. ఈ ప్రతికూల ప్రభావం మిడ్‌క్యాప్‌ షేర్లపై స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. పతనానికి ముందు ఎంతోకాలంగా స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ షేర్లు మంచి రాబడిని ఇచ్చాయని, ఇంతగా పెరిగిన తరువాత ఈ రంగ షేర్లలో మార్కెట్‌ ఆధారంగా చూస్తే మరింతకాలం అట్టుపెట్టుకోవడానికి ఇష్టపడరని.. ఇందుచేత ప్రాఫిట్‌ బుకింగ్‌ చోటుచేసుకోవడం సర్వసాధారణమన్నారు. ఈ రంగ షేర్లు ఎలా ఉంటాయి అన్న విషయంలో ఒక వైపు సమాధానం చెప్పడం కష్టమని అన్నారు. అంతర్జాతీయ అంశాల విషయానికి వస్తే.. పరిణామాలు కొంతమేర మిశ్రమంగానే కనబడుతున్నాయన్నారు. ఒకవైపు ఇన్‌ఫ్లోస్‌ పెరుగుతూనే ఉండగా మరోవైపు ఆందోళనకర అంశాలు ఉన్నాయన్న ఆయన ఇన్‌ఫ్లోస్‌ ఉన్నప్పుడు షేర్లలో ఇన్వెస్ట్‌చేయాలని, ప్యానిక్‌ అంశాలు ఉన్నప్పుడు నాణ్యత ఉన్న షేర్లలో పెట్టుబడి పెట్టాలని సూచించారు. You may be interested

కర్ణాటక పోరు: మార్కెట్‌ బేజారు..!

Wednesday 16th May 2018

10800 దిగువకు నిఫ్టీ ముంబై:- కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న అనిశ్చితి కారణంగా బుధవారం ట్రేడింగ్‌లో ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్‌ చివరకు నష్టాలతో ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, రిలయన్స్‌ ఇండస్ట్రీ, సిప్లా, గెయిల్‌, హెచ్‌పీసీఎల్‌ వంటి హెవీవెయిట్‌ షేర్లు 4నుంచి1శాతం నష్టపోవడంతో సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాలను మూటగట్టుకున్నాయి.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 156 పాయింట్లు నష్టపోయి 35,388 వద్ద, నిఫ్టీ 61 పాయింట్లు నష్టపోయి 10,741 వద్ద ముగిశాయి.

కనిష్టస్థాయి నుంచి కర్నాటక బ్యాంక్‌ జూమ్‌

Wednesday 16th May 2018

ఏడాది కనిష్టానికి షేరు ధర ఏడాది కనిష్టం నుంచి 12శాతం ర్యాలీ ముంబై:- ఆర్థిక ఫలితాల్ని వెల్లడించిన నేపథ్యంలో ప్రైవేటు రంగ కర్నాటక బ్యాంక్‌ షేరు కనిష్టస్థాయి నుంచి జోరుగా ర్యాలీ జరిపింది.  గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం(క్యూ4)లో నష్టాలు నమోదు కావడంతో నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలో షేరు 3.30శాతం నష్టపోయి రూ.107.30ల వద్ద ఏడాది కనిష్టస్థాయికి పతనమైంది. అయితే  మొండి బకాయిలకు కేటాయింపుల్ని పూర్తిచేసారన్న సానుకూల అంశంతో షేరు తిరిగి పుంజుకుంది.

Most from this category