30-40 రోజుల్లో మిడ్‌క్యాప్ బాటమవుట్: కోటక్ ఎంఎఫ్
By Sakshi

మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు ఈ ఏడాది ఇప్పటి వరకు పతనాన్నే చవిచూశాయి. మిడ్‌క్యాప్ సూచీయే 12-15 శాతం వరకు క్షీణించింది. ఇదే కాలంలో సెన్సెక్స్ క్షీణత 5 శాతం లోపే ఉంది. ఈ నేపథ్యంలో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ పతనం ఇంకెంత వరకు అన్న సందేహం రావచ్చు. అయితే, మరి కొంత డౌన్‌సైడ్ ఉంటుందని, మరో 30-40 రోజుల్లో ధరల పరంగా బాటమ్ అవుట్ కావచ్చని, ఆ తర్వాతే నాణ్యమైన షేర్లను సూచించగలమని కోటక్ మ్యూచువల్ ఫండ్ ఎండీ నీలేష్ షా పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ టెస్ట్ ప్లేయర్ వంటిది ‘‘ఎంతో మొత్తం నగదు, పరిపక్వత లేని విధంగా స్టాక్స్ వెంట రాబడుల కోసం రావడం జరిగింది. కనుక ఈ క్రమంలో అమ్మకాలు కొనసాగుతాయి. దీంతో ఫండమెంటల్స్ ఆధారంగా అవి మరింత దిద్దుబాటుకు గురవుతాయి’’ అని షా తెలిపారు. ధరల పరంగా తక్కువకు పడిపోతున్నాయని కదా అని ‘కత్తు’లను పట్టుకునేందుకు పోటీ పడొద్దని, కంపెనీల నాన్యతను చూడాలని సూచించారు. ఇన్ఫోసిస్ 25 ఏళ్ల కాలంలో వాటాదారులకు సంపద సృష్టించడంపై ఆయన స్పందిస్తూ... ఇప్పటికీ ఈ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉండతగినదేనన్నారు. అయితే, గతంలో ఇది ఇచ్చిన స్థాయిలో రాబడులను ఆశించొద్దని సూచించారు. ‘‘ఇది ఓ టెస్ట్ క్రికెటర్ వంటిది. 20 ఏళ్ల వయసులో మెరుగుపడేందుకు భారీ అవకాశాలు ఉంటాయి. 35 ఏళ్ల వయసు వస్తే ఆ తర్వాత మెరుగుపడే అవకాశాలు పరిమితమే. అలా అని ఈ ప్లేయర్‌కు విలువ లేదని కాదు. మీ పోర్ట్‌ఫోలియోలో ఇన్ఫోసిస్‌ను భాగం చేసుకోవచ్చు. కాకపోతే ఇదొక ఎంఎస్ ధోని వంటిదేనా? అంటే అవుననే చెప్పాలి’’ అని షా పేర్కొన్నారు. ఫార్మా రంగంపై అంచనాలు తక్కవే ఉన్నాయని, ఏవైనా సానుకూలతలు చోటు చేసుకుంటే, వాటికి సరసమైన విలువలు తోడైతే అవి తిరిగి పుంజుకుంటాయని వివరించారు. పాత కాలంనాటి ఫార్మాపేర్లను పరిశీలించొచ్చని, హాస్పిటల్స్ లేదా పాథాలజీ కంపెనీలను పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవచ్చని సూచించారు.
You may be interested
హెచ్‌డీఎఫ్‌సీలో 20 శాతం రిటర్న్‌కు ఛాన్స్
Friday 15th June 2018ఆకర్షణీయంగా వాల్యుయేషన్ సీఎల్ఎస్ఏ అంచనా ప్రముఖ బ్రోకరేజి సంస్థ సీఎల్ఎస్ఏ హెచ్డీఎఫ్సీ షేరుకు ‘బయ్ కాల్’ను కొనసాగించింది. దీంతో శుక్రవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో దీనిధర రూ.1.6 శాతం పెరిగింది. సంస్థ వృద్ధి మెరుగవడమేగాక, దీని షేరుకు ఆకర్షణీయమైన వాల్యుయేషన్ కూడా ఉంటుందని సీఎల్ఎస్ఏ పేర్కొంది. టార్గెట్ ధరను రూ.2,200లుగా పేర్కొంది. ఫైనాన్షియల్ రంగంలో ఇది అత్యుత్తమ సంస్థ అని ప్రశంసించింది. ఈ ఏడాది సీఏజీఆర్ 20 శాతం వరకు నమోదు కావొచ్చని, ఈక్విటీ రాబడులు
రుణాలున్న కంపెలన్నీ ‘నష్ట జాతకాలేమీ’ కాదు!
Friday 15th June 2018అధిక రుణభారం కంపెనీలను పుట్టిముంచుతుందన్న హెచ్చరికలను ఒక్కసారి అయినా వినే ఉంటారు. బ్యాలన్స్ షీట్లలో అధిక రుణాలు కనిపిస్తే ఆయా కంపెనీలకు దూరంగా ఉండాలన్న సూచనలు విశ్లేషకుల నుంచి వస్తుంటాయి. కానీ, రుణం అన్నది చెడ్డది కాదు. దాన్ని తీర్చలేకపోవడమే అసమర్థత. రుణం తీసుకున్న కంపెనీ దాన్ని సరిగ్గా వినియోగించి, చెల్లింపులు చేస్తూ ఉంటే, ఆ రుణం కంపెనీ వృద్ధికి దోహదం చేస్తుందనడంలో సందేహమే అక్కర్లేదు. మరి ఈ విషయంలో