STOCKS

News


ఆయిల్‌&గ్యాస్‌ షేర్ల హవా..!

Tuesday 13th March 2018
Markets_main1520927957.png-14619

ముంబై:- ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగ షేర్లు మంగవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఈ రంగానికి బొంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో సూచీగా ఉన్న ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌ నేడు ఒకటిన్నర శాతం వరకు లాభపడింది. ఇంట్రాడేలో 15,609 పాయింట్ల గరిష్టస్థాయిని నమోదుచేసింది. హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) షేరు ధర 5.15 శాతం పెరిగింది. ఇంట్రాడేలో రూ.385.35 తాకింది. మధ్యాహ్నం 1:00 సమయానికి రూ.17.35 (4.73 శాతం) లాభపడి రూ.383.80ల వద్ద  ట్రేడవుతోంది. ఇదే సమయానికి బీపీసీఎల్‌ 4శాతం, పెట్రోనెట్‌ 3.33 శాతం, గెయిల్‌ షేర్లు (1.36శాతం) లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. మరోవైపు రిలయన్స్‌ 00.15 శాతం, ఐఓసీ 0.52 శాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

ఆటుపోట్ల మార్కెట్లో ఆదుకునే సిఫార్సులు!

Tuesday 13th March 2018

కాంట్రా బెట్‌ రికమండేషన్లు ప్రస్తుత ఒడిదుడుకుల మార్కెట్లో ఎంచుకోవాల్సిన కొన్ని టాప్‌ కాంట్రా షేర్లను బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. కోటక్‌ సెక్యూరిటీస్‌ సిఫార్సులు 1. ఇండో కౌంట్‌: యూఎస్‌లో బడా రిటైలర్ల డీస్టాకింగ్‌ ముగిసిపోనుండడం దేశీయ టెక్స్‌టైల్‌ ఎగుమతిదారులకు కలిసివచ్చే అంశం.  తదుపరి యూఎస్‌ రిటైలర్లు రీస్టాకింగ్‌ ఆరంభిస్తారు. దీంతో ఇండోకౌంట్‌లాంటి కంపెనీలకు మంచి లబ్ది చేకూరనుంది. 2. కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌: ఇటీవల కాలంలో పేలవ ప్రదర్శన చూపుతోంది. అయితే వచ్చే నాలుగేళ్లకు వెనక్కితిరిగి చూసే

వాటా అమ్మకంతో టీసీఎస్‌ 5 శాతం డౌన్‌

Tuesday 13th March 2018

ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేరు ధర మంగళవారం నేలచూపులుచూసింది. మధ్యాహ్నం రూ.152 (5 శాతం) పడిపోయి రూ.2,899 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ.2,872 వద్ద కనిష్టస్థాయిని నమోదుచేసింది. ఈ కంపెనీలోని రూ.8,122 కోట్ల (1.25 బిలియన్‌ డాలర్లు) విలువైన వాటాను హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌ బల్క్‌డీల్‌ రూపంలో అమ్మివేసినట్లు వెల్లడయ్యింది. కంపెనీలోని 1.5 శాతం వాటాను రూ.2,872-2,925 స్థాయిలో అమ్మివేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈస్థాయికి షేరు

Most from this category