STOCKS

News


వరుస నష్టాలకు బ్రేక్‌

Tuesday 20th March 2018
Markets_main1521540545.png-14824

–భారీ హెచ్చుతగ్గుల నడుమ స్వల్పంగా పెరిగిన సూచీలు

ఐదు ట్రేడింగ్‌ సెషన్ల నుంచి అదేపనిగా పతనమవుతున్న భారత్‌ మార్కెట్‌ మంగళవారం లాభాలతో ముగిసింది. మరో రోజులో అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో రోజంతా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన సూచీలు చివరకు లాభాలతో గట్టెక్కగలిగాయి. గత రాత్రి అమెరికా మార్కెట్, మంగళవారం ఉదయం ఆసియా మార్కెట్లు క్షీణించిన నేపథ్యంలో భారత్‌ సూచీలు గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యాయి. అటుతర్వాత ఆసియా సూచీలు లాభాల బాట పట్టడం, యూరప్‌ మార్కెట్లు పాజిటివ్‌గా ప్రారంభంకావడంతో సెన్సెక్స్, నిఫ్టీలు స్వల్పలాభాల్ని ఆర్జించగలిగాయి. ట్రేడింగ్‌ తొలిదశలో 32,810 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన సెన్సెక్స్‌ మధ్యాహ్న సెషన్‌లో 33,103 పాయింట్ల వరకూ ర్యాలీ జరిపింది. అటుతర్వాత తిరిగి నష్టాల్లోకి మళ్లినప్పటికీ, షార్ట్‌ కవరింగ్‌ ప్రభావంతో చివరకు 74 పాయింట్లు లాభపడి 32,997 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 10,049 పాయింట్ల కనిష్టస్థాయి నుంచి 10,156 పాయింట్ల గరిష్టస్థాయివరకూ కోలుకున్న నిఫ్టీ చివరకు 30 పాయింట్ల లాభంతో10,124 పాయింట్ల వద్ద ముగిసింది. 
ఫెడ్‌ మీటింగ్‌పై దృష్టి...
ఈ ఏడాది నాలుగు దఫాలు వడ్డీ రేట్లు పెంచవచ్చన్న సంకేతాలు ఇదివరకే ఇన్వెస్టర్లు అందుకున్నప్పటికీ తాజా ఫెడ్‌ సమావేశం పట్ల జాగురూకత వహిస్తున్నారని మార్కెట్‌ విశ్లేషకులు చెప్పారు. ఫెడరల్‌ రిజర్వ్‌ కమిటీ రెండు రోజుల సమావేశం మంగళవారం ప్రారంభమవుతుంది. బుధవారం భారత కాలమాన ప్రకారం రాత్రి 11.30 గంటలకు ఫెడ్‌ నిర్ణయం వెలువడుతుంది. ఈ దఫా రేట్లను పెంచవచ్చనే అంచనాలు మార్కెట్లో వున్నాయి. అయితే తదుపరి పెంపుదల ఎంత వేగంగా వుంటుందన్న సంకేతాల కోసం ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారు. 
బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి...
ఒక రుణ మోసం కేసులో కెనరా బ్యాంక్‌ మాజీ ఎండీ, ఇడీలపై సీబీఐ..ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసిందనే వార్తల నడుమ మంగళవారం బ్యాంకింగ్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. కెనరా బ్యాంక్‌ షేరు 3.5 శాతంపైగా పతనమై రూ. 253 వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 0.5–1 శాతం మధ్య క్షీణించడంతో బ్యాంక్‌ నిఫ్టీ 77 పాయింట్ల నష్టంతో 24,168  పాయింట్ల సమీపంలో ముగిసింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పీఎన్‌బీ, యాక్సిస్‌ బ్యాంక్‌లు స్వల్పలాభాలతో క్లోజయ్యాయి.
ప్రధాన షేర్లలో ఇన్‌ఫ్రాటెల్‌ 5.5 శాతం ర్యాలీ జరిపి రూ. 344 వద్ద ముగిసింది. టెక్‌ మహింద్రా 4 శాతం ఎగిసి రూ. 635 వద్ద క్లోజయ్యింది. ఇతర ఐటీ షేర్లు ఇన్ఫోసిస్, విప్రోలు 1 శాతంపైగా పెరగ్గా, టాటా స్టీల్, సన్‌ఫార్మాలు 2–3 శాతం మధ్య పెరిగాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగానికి చెందిన ఐఓసీ, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌లు 1–2 శాతం మధ్య క్షీణించాయి. 
 



You may be interested

బినాని సిమెంట్‌ను కొంటాం

Tuesday 20th March 2018

-రూ.7,266 కోట్లకు ఆఫర్‌ ఇచ్చిన ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ -గత వారంలో రూ.6,350 కోట్ల దాల్మియా ఆఫర్‌కు సీఓసీ ఓకే -సీఓసీ నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ ఎన్‌సీఎల్‌టీలో బినాని పిటిషన్‌  న్యూఢిల్లీ: బినాని సిమెంట్‌ వేలంలో కొత్త ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీ బినాని సిమెంట్‌ను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. రుణాలు చెల్లించలేక డిఫాల్ట్‌ అయిన బినాని సిమెంట్‌ను రూ.7,266 కోట్లకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా

అడకత్తెరలో వ్యాలెట్‌ సంస్థలు!

Tuesday 20th March 2018

- ఆధార్‌ గడువు పొడిగించటంతో ఇబ్బందులు - కేవైసీ పూర్తి చేయడానికి కస్టమర్ల అనాసక్తి - ఆధార్‌ వివరాలిచ్చేందుకు సుముఖంగా లేని తీరు - వేరే పత్రాలతో కేవైసీ పూర్తి చేస్తే తడిసి మోపెడు - ఆర్‌బీఐ గడువు ముగిశాక లావాదేవీల్లో క్షీణత న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాలు, టెలికం సేవలతో పాటు అన్ని రకాల సర్వీసులకూ ఆధార్‌ సంఖ్యను అనుసంధానించడానికి కేంద్రం ఇచ్చిన గడువును సుప్రీంకోర్టు నిరవధికంగా పొడిగించటం మొబైల్‌ వ్యాలెట్‌ సంస్థలకు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టింది.

Most from this category