News


ఫైనాన్షియల్‌, నిర్మాణ రంగ మిడ్‌క్యాప్స్‌ మేలు!

Friday 15th March 2019
Markets_main1552641185.png-24628

సెంట్రమ్‌ బ్రోకింగ్‌
మిడ్‌క్యాప్‌ రంగంలో ఫైనాన్స్‌, నిర్మాణ రంగాల్లోని కంపెనీల్లో విలువైనవి దొరుకుతాయని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ ప్రతినిధి నిశ్చల్‌ మహేశ్వరి చెప్పారు. ఫైనాన్షియల్స్‌లో ఎంఎఫ్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు మంచి పురోగతి చూపుతున్నాయన్నారు. బ్యాంకింగ్‌ రంగానికి నిఫ్టీలో అధిక వెయిటేజ్‌ ఉన్నందున నిఫ్టీ ప్రదర్శన మెరుగయ్యేకొద్దీ ఫైనాన్షియల్‌ రంగ ప్రదర్శన కూడా మరింత మెరుగుపడుతుందన్నారు. అందువల్ల ఈ రంగ స్టాకులను ప్రస్తుతానికి విక్రయించవద్దని సూచించారు. కావాలంటే బ్యాంకు షేర్లలోనే ఒకదాని నుంచి మరోదానికి మారుతూఉండొచ్చన్నారు. రాబోయే బుల్‌మార్కెట్‌ని ఫైనాన్షియల్సే ముందుండి నడిపిస్తాయని అంచనా వేశారు. నిర్మాణ రంగంలోని కొన్నిమిడ్‌క్యాప్స్‌లో కూడా మంచి వాల్యూబయింగ్‌ జరపవచ్చని చెప్పారు. రూపీ రాబోయే కాలంలో మరింత బలపడవచ్చని ఆయన తెలిపారు. ఇదే జరిగితే ఐటీ స్టాకులపై ప్రతికూల ప్రభావం ఉంటుందన్నారు. ఇప్పటివరకు ఐటీ కంపెనీలు రూపీ క్షీణతతో వ్యయాలను కవర్‌ చేసి మార్జిన్లు సాధిస్తూ వచ్చాయని, ఇకపై ఈ అవకాశం ఉండకపోవచ్చని తెలిపారు. ఈ ఏడాది ఐటీ కంపెనీల ఫలితాలు ఒత్తిడిని ఎదుర్కొంటాయన్నారు. అందువల్ల ప్రస్తుతానికి తాము ఐటీ రంగంపై న్యూట్రల్‌గా ఉన్నామని ఆయన చెప్పారు. 

 



You may be interested

38000 పైన సెన్సెక్స్‌

Friday 15th March 2019

దేశీయ మార్కెట్‌ శుక్రవారం మిడ్‌సెషన్‌ సమయానికి ఇంట్రాడే గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. దేశీయ మార్కెట్లోకి విదేశీ ఫోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడం, డాలర్‌ మారకంలో రూపాయి వరుసుగా ఐదో రోజూ బలపడటం, ప్రపంచమార్కెట్లలో నెలకొన్న సానుకూల వాతావరణం దేశీయ మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయి. ఫలితంగా ఐటీ, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ ర్యాలీ అండతో శుక్రవారం మిడ్‌సెషన్‌ సమయానికి ఇంట్రాడే గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌-రూపీ

గ్లోబల్‌ లిక్విడిటీ కీలకం!

Friday 15th March 2019

మార్కెట్‌ పరుగులకు ఇంధనం కోటక్‌ ఎంఎఫ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హరీశ్‌ కృష్ణన్‌ ఎన్నికల ఫలితాల కన్నా అంతర్జాతీయ లిక్విడిటీ పరిస్థితులే మార్కెట్లకు కీలకాంశమని కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హరీశ్‌ కృష్ణన్‌ చెప్పారు. ప్రస్తుతం అంతా ఎన్నికల ఫలితాలు, ఎర్నింగ్స్‌ సీజన్‌ప ఎక్కువ ఫోకస్‌ పెట్టారని, కానీ నిజానికి వీటి కన్నా లిక్విడిటీ సరళంగా ఉండడమే కీలకమని చెప్పారు. లిక్విడిటీ ప్రవాహానికి అవరోధాలు లేకుండా ప్రపంచ కేంద్ర బ్యాంకులు ఎలాంటి చర్యలు

Most from this category