STOCKS

News


ఈక్విటీలపై ఆచితూచి వ్యవహరిస్తున్న ఎల్‌ఐసీ

Saturday 17th February 2018
news_main1518867502.png-14031

ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లలో చోటు చేసుకున్న ఒడిదుడుకుల నేపథ్యంలో ఆచితూచి షేర్లను ఎంచుకుంటున్నట్లు ఎల్‌ఐసీ తెలిపింది. నిజానికి ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిదినెలల్లో ఎల్‌ఐసీ అత్యంత దూకుడుగా ఈక్విటీల్లో కొనుగోళ్లు కొనసాగించింది. తొలి తొమ్మిదినెలల్లో ఎల్‌ఐసీ ఈక్విటీల్లో దాదాపు 70 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి దాదాపు 20వేల కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది. అయితే గత మూడునెలలుగా ఎల్‌ఐసీ దూకుడు తగ్గించింది. జనవరిలో తాము ఈక్విటీల్లో కొన్నదానికన్నా అమ్మిందే ఎక్కువని ఎల్‌ఐసీ చైర్మన్‌ వీకే శర్మ చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తాము చాలా సెలక్టివ్‌గా షేర్లను ఎంచుకుంటున్నామని, గతంలోలాగా దూకుడుగా వ్యవహరించడం లేదని చెప్పారు. తాజాగా భారీ కుంభకోణం ఎదుర్కొంటున్న పీఎన్‌బీపై ఎల్‌ఐసీ విశ్వాసం ప్రకటించింది. పీఎన్‌బీలో ప్రభుత్వం తర్వాత ఎల్‌ఐసీకే అధిక వాటా ఉంది. గత డిసెంబర్లో పీఎన్‌బీలో వాటాను ఎల్‌ఐసీ మరింత పెంచుకుంది. ఈ బ్యాంకుకు 100సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉందని, బ్యాంకుకు అనేక బలాలు ఉన్నాయని ఎల్‌ఐసీ వ్యాఖ్యానించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పీఎన్‌బీ వెనుకే ఉంటామని, వాటాలు తగ్గించుకోబోమని వెల్లడించింది. నిజానికి తమకు పీఎస్‌బీల కన్నా ప్రైవేట్‌ బ్యాంకుల్లోనే ఎక్కువ ఈక్విటీ వాటాలున్నాయని శర్మ చెప్పారు. ఎల్‌ఐసీ మొత్తం ఈక్విటీ పెట్టుబడుల్లో బ్యాంకింగ్‌ రంగం వాటా 5- 6 శాతం ఉంటుందని చెప్పారు. 


lic

You may be interested

బిజినెస్‌ క్విజ్‌ 4

Saturday 17th February 2018

1. క్రింద పేర్కొన్న ఆసియా పసిఫిక్ దేశాలని తక్కువ కార్పొరేట్ ట్యాక్స్ కలిగిన దేశం నుంచి అత్యధికంగా ట్యాక్స్ కలిగిన దేశం కు అమర్చినట్లేయితే దిగువ వాటిలో ఏది సరియైనది? ఎ) సింగపూర్, థాయిలాండ్, సౌత్ కొరియా, మలేషియా, శ్రీలంక మరియు ఇండియా బి) సౌత్ కొరియా, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఇండియా మరియు శ్రీలంక  సి) సింగపూర్, సౌత్ కొరియా, ఇండియా, మలేషియా, థాయిలాండ్ మరియు శ్రీలంక  డి) సింగపూర్, మలేషియా, సౌత్ కొరియా, శ్రీలంక, థాయిలాండ్ మరియు ఇండియా   2. బ్రిక్స్ దేశాలలో కార్పొరేట్ ట్యాక్స్ రేట్లు కి సంబంధించి దిగువ వాటిలో ఏది సరియైనది? ఎ) బ్రెజిల్ 35%, ఇండియా 30%, చైనా 20%

షార్ట్స్‌కు దూరంగా ఉండడం బెటర్‌!

Saturday 17th February 2018

నిపుణుల సూచన నిఫ్టీ ప్రస్తుతం బాటమింగ్‌ అవుట్‌కు సిద్ధంగా ఉన్నందున షార్ట్‌ పొజిషన్లకు దూరంగా ఉండడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. గత వారంతో పోలిస్తే ఈ వారం నిఫ్టీ ఫ్లాట్‌గా ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో స్థిరత్వం బలపడుతున్న తరుణంలో కొన్ని స్థానిక కారణాలు దేశీయ సూచీల్లో బలహీనతను పెంచాయి. అయితే ప్రస్తుతానికి ఇక సూచీల్లో డౌన్‌ట్రెండ్‌ ముగింపునకు వచ్చినట్లేనని ఎక్కువమంది అనలిస్టులు భావిస్తున్నారు. నిజానికి అంతర్జాతీయ మార్కెట్లలో రికవరీతో పోలిస్తే

Most from this category