STOCKS

News


జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ రేసులో ‘లక్షదీప్‌’ ముందంజ

Monday 16th April 2018
news_main1523861015.png-15533

న్యూఢిల్లీ: రుణ ఊబిలో కూరుకుపోయి దివాలా చర్యలను ఎదుర్కొంటున్న జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ కంపెనీ కొనుగోలుకు లక్షదీప్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ముందు వరుసలో ఉంది. రూ.7,350 కోట్లకు ఈ సంస్థ బిడ్‌ వేసింది. అయితే, ఈ మొత్తం సంస్థ గతేడాది బ్యాంకుల రుణాలు తీర్చేందుకు ఇచ్చిన హామీ రూ.8,500 కోట్లు (వడ్డీ సహా) కంటే తక్కువ కావడం గమనార్హం. సుధీర్‌ వాలియాకు చెందిన సురక్ష అస్సెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ, ముంబైకి చెందిన దోస్తి రియల్టీల జాయింట్‌ వెంచరే లక్షదీప్‌ ప్రైవేటు లిమిటెడ్‌. ఈ సంస్థ జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ కొనుగోలుకు సంబంధించి రూ.1,200 కోట్లను నగదుగా బ్యాంకులకు ఇచ్చేందుకు, రూ.4,000 కోట్ల మేర భూములు, మిగిలిన మొత్తానికి లాంగ్‌ టర్మ్‌ నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ రూపంలో ఇచ్చేందుకు ఆఫర్‌ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, అదానీ గ్రూపు రూ.1,200 కోట్ల నగదు, రూ.3,500 కోట్ల విలువైన భూములు, మరో రూ.3,000 కోట్ల తర్వాతి తేదీలతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్లు (వీటి ప్రస్తుత విలువ రూ.500-1,000 కోట్లు) ఇచ్చేందుకు ఇప్పటికే ఆఫర్‌ చేసింది.



You may be interested

ఈఎల్‌ఎస్‌ఎస్‌లకంటే యులిప్‌లు బెటరా?

Monday 16th April 2018

మ్యూచువల్‌ ఫండ్స్‌కు చెందిన ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌) మెచ్యూరిటీపై పన్నులు విధించారు కదా ! అందుకని యులిప్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. యులిప్స్‌లో పన్ను  ప్రయోజనాలు లభిస్తాయి కాబట్టి ఇప్పుడు యులిప్స్‌ బెటరని మిత్రులంటున్నారు. తగిన సలహా ఇవ్వండి ?     – రవికాంత్, కరీంనగర్‌  ఈఎల్‌ఎస్‌ఎస్‌ స్కీమ్‌ల మెచ్యూరిటీపై పన్నులున్నాయన్న ఆలోచనతో యులిప్‌(యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌)ల్లో ఇన్వెస్ట్‌ చేయడం సరైన నిర్ణయం కాదు. ఈఎల్‌ఎస్‌ఎస్‌ యూనిట్లను విక్రయించినప్పుడు మీరు

బ్యాలెన్స్‌ షీట్స్‌ సరికావడానికి మరో 9 నెలలు: అసోచామ్‌

Monday 16th April 2018

న్యూఢిల్లీ: బ్యాంకులకు భారీ మొండి బకాయిలు అదే సమయంలో కార్పొరేట్లకు అధిక రుణ భారం... ఈ రెండు రకాల సమస్యలు (ట్విన్‌ బ్యాలన్స్‌ షీట్‌) పరిష్కారం అయ్యేందుకు కనీసం మరో మూడు త్రైమాసికాల సమయం పట్టొచ్చని అసోచామ్‌ పేర్కొంది. ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) కింద రానున్న నెలల్లో కంపెనీల దివాలా పరిష్కార చర్యలు వేగం అందుకుంటాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. బ్యాంకుల విశ్వాసం పుంజుకుని మళ్లీ తాజాగా

Most from this category