STOCKS

News


ఏఆర్‌సీ ఏర్పాటు దిశగా బిర్లా అడుగులు

Saturday 2nd September 2017
news_main1504338346.png-7921

అసెట్‌ రీకన్‌స్ట్రక‌్షన్‌ కంపెనీ(ఏఆర్‌సీ) ఏర్పాటు దిశగా ఆదిత్య బిర్లా గ్రూప్‌ అధినేత కుమార మంగళం బిర్లా సన్నాహాలు చేస్తున్నారు. మొండిపద్దులను వదుల్చుకునేందుకు బ్యాంకులు తమ వద్ద తనఖా పెట్టిన కంపెనీల ఆస్తులను ఏఆర్‌సీలకు విక్రయిస్తాయి. మార్కెట్‌విలువ కన్నా తక్కువరేట‍్లకు ఏఆర్‌సీలు ఇలాంటి ఆస్తులను కొని వాటిని కొంచెం డెవలప్‌ చేసి విక్రయించి లాభాలు సమకూర్చుకుంటుంటాయి. ప్రస్తుతం ఈ రంగం అత్యంత ఆకర్షణీయంగా ఉందని బిర్లా భావిస్తున్నారు. ఇప్పటికే ఏఆర్‌సీ ఏర్పాటుకై లైసెన్సుకోసం దరఖాస్తు చేసినటు​ఉల ఆయన చెప్పారు. ఏఆర్‌ విభాగంలోకి కాలుమోపేందుకు ఇదే అత్యంత మంచి తరుణమని ఆయన అన్నారు. ప్రస్తుతం బ్యాంకుల వద్ద 8లక్షల కోట్ల రూపాయల మొండిపద్దులు పేరుకుపోయాయి. వీటిని వదిలించేందుకు ఆర్‌బిఐ, ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. తమ గ్రూప్‌నకు వివిధ వ్యాపారాల్లో ఉన్న అనుభవం ఏఆర్‌సీ నిర్వహణకు ఉపయోగంగా ఉంటుందని బిర్లా భావిస్తున్నారు. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న ఇతర కంపెనీలతో పోలిస్తే  అనుభవం కారణంగా తమకు మొగ్గు ఉంటుందన్నారు. ఏఆర్‌సీలకు రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ అతిపెద్ద సవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఏఆర్‌సీ సొంతంగా ఒక మూలనిధిని ఏర్పాటు చేసుకుంటుందని చెప్పారు. వీలును బట్టి ఒక భాగస్వామిని సైతం చేర్చుకునే ఆలోచన ఉందని తెలిపారు. బడా బడా కంపెనీల మొండిపద్దుల కన్నా చిన‍్న, మధ్యతరహా కంపెనీల మొండిఆస్తులపైనే ఎక్కువ శ్రద్ధ పెడతామని ఆయన వివరించారు. You may be interested

నీలేకని పైసా తీసుకోడంట..

Saturday 2nd September 2017

ఇన్ఫోసిస్‌కు కొత్తగా చైర్మన్‌గా నియమితులైన నందన్‌ నీలేకని ఎలాంటి జీతం లేకుండానే పనిచేయనున్నారు. సిఇఒగా సేవలనందించినందుకు ఆయనకు ఏ విధమైన వేతనసౌకర్యాలు కల్పించడం లేదని ఇన్ఫోసిస్‌ తెలిపింది. రిటైర్‌మెంట్‌ బై రొటేషన్‌ ప్రాతిపదికన ఆయన తిరిగి వచ్చారని, ఆందువల్ల ఆయనకు ఎలాంటి రెమ్యునురేషన్‌ చెల్లించడంలేదని కంపెనీ తాజాగా బిఎస్‌ఇకి వెల్లడించింది. 2009లో ఆయన సిఇఒగా తప్పుకొన్నారు. ఇటీవల జరిగిన అనూహ్యపరిణామాల నేపథ్యంలో కంపెనీలోకి తిరిగివచ్చారు. కంపెనీలో ఆయనకు 0.93 శాతం

సోమవారం ఉదయం ఈ 2 షేర్లు చూడండి..!

Saturday 2nd September 2017

ముంబై: స్వల్పకాలిక లాభాలను ఆశించేవారి కోసం టెక్నికల్‌ అనలిస్టులను పలు షేర్లను సిఫార్సు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. కచ్చితంగా ''స్టాప్‌ లాస్‌ ఫాలో అయ్యేవారి కోసం'' 2 షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్‌ అనలిస్ట్‌ మానస్ జైస్వాల్. సోమవారం (సెప్టెంబరు 4, 2017) మార్కెట్‌ ఓపెన్‌ అయిన వెంటనే ఈ షేర్లను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తున్నారు. అవేంటంటే..   1. ఐడీఎఫ్‌సీ: ప్రస్తుతం ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో రూ.57.80 దగ్గర ఉంది. రూ.56

Most from this category