News


మార్కెట్‌ వాల్యుయేషన్స్‌ మరీ అధికం: కొటక్‌ ఎమ్‌ఎఫ్‌

Wednesday 16th May 2018
Markets_main1526460408.png-16505

ముంబై: రికార్డు స్థాయి నుంచి స్టాక్‌ సూచీలు 10 శాతం పడిపోయిన తరువాత మళ్లీ బౌన్స్‌బ్యాక్‌ అయ్యి కాస్త ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ.. వాల్యుయేషన్స్‌ పరంగా చూస్తే మాత్రం ఏమంత ఆకర్షణీయంగా లేవని కొటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ఈక్విటీ సీఐఓ హర్ష ఉపాధ్యాయ అన్నారు. ఇప్పుడు ఉన్న వాల్యూయేషన్స్‌ ఇంతకుముందు ఎన్నడూ లేనంత అధికంగా ఉన్నాయన్న ఆయన చరిత్రలో ఎప్పుడూ చోటుచేసుకోనంతటి మల్టిపుల్స్‌ వద్ద మార్కెట్‌ ట్రేడవుతుందని విశ్లేషించారు. ఇటువంటి పరిస్థితి ఉన్న కారణంగా కొంతమేర ఆందోళన ఇన్వెస్టర్లలో ఉందని, ఎగువస్థాయిలో మార్కెట్‌కు అవరోధం ఉందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అధిక వడ్డీ రేట్లు ఉండడం, డాలరుతో రూపాయి మారకం విలువ బలహీనపడిపోతుండడం, పెరుగుతున్న ముడిచమురు ధరల ప్రభావాన్ని మార్కెట్‌ ఇప్పుడు లెక్కచేయనప్పటికీ.. తరువాతకాలంలో ఇవి పెను ప్రభావం చూపనున్నాయని విశ్లేషించారు. ఇటువంటి పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ప్రస్తుతం మార్కెట్‌ ఉన్న పరిస్థితుల్లో లార్జ్‌క్యాప్‌ షేర్లలో పెట్టుబడులు కొనసాగించడం ద్వారా రాబడిని పొందవచ్చని సూచించారు. ఇదే సమయంలో బాండ్‌ మార్కెట్‌ పెట్టుబడులను పరిశీలించవచ్చని అన్నారు. షేర్ల ఎంపికలో వాల్యుయేషన్స్‌కే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుందని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వినిమయ రంగాల వృద్ధిరేటు జోరందుకుంటున్న నేపథ్యంలో ఈ రంగంలోని ఎంపిక చేసినవాటిని చూడవచ్చన్నారు. తానైతే సిమెంట్‌ రంగంపై పూర్తి బుల్లిష్‌గా ఉన్నట్లు తెలియజేశారు. వర్షాకాలం తరువాత ధరలపై ఒత్తిడి తగ్గిపోయే అవకాశం మెండుగా ఉండడం, అమ్మకాలలో గణనీయమైన వృద్ధి నమోదయ్యేందుకు ఆస్కారం ఉండడం ఆధారంగా ఈ రంగం మంచి వృద్ధిరేటును కనబర్చనుందని అంచనావేసినట్లు వివరించారు. ఐటీ స్టాక్స్‌లో ర్యాలీ అనంతరం వాల్యుయేషన్స్‌ కారణంగా వీటిని డిఫెన్సివ్‌ బెట్స్‌గానే చూస్తున్నట్లు వెల్లడించారు. ఈ రంగ షేర్ల వాల్యుయేషన్స్‌ ప్రధాన సూచీల వాల్యుయేషన్స్‌ కంటే దిగువన ఉన్నప్పుడు మాత్రమే ఐటీ షేర్లను కొనుగోలు చేయవచ్చని వివరించారు. ప్రస్తుతం ఇవి ప్రధాన సూచీలకు సరిసమానంగా ఉన్నట్లు తెలియజేశారు. ఇందుచేత ఐటీ షేర్ల పట్ల కొంత జాగ్రత్త వహించడం మంచిదని సూచించారు. మిడ్‌క్యాప్‌ ఐటీ విషయానికి వస్తే.. వృద్ధిరేటు ఏమాత్రం కుంటుపడినా ఈ రంగ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోతాయని అన్నారు. You may be interested

హిందుస్తాన్ యూనిలీవర్‌ కొనొచ్చు- హెచ్‌డీఎఫ్‌సీ

Wednesday 16th May 2018

కంపెనీ: హిందుస్తాన్ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) సిఫార్సు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రస్తుత ధర: రూ.1,575 (మే 16, 2018) టార్గెట్‌ ధర: రూ.1,615 రెకమండేషన్‌: కొనొచ్చు 52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.1,575/974 హెచ్‌యూఎల్‌ షేరుకు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. గతేడాది చివరి త్రైమాసికం (2017–18, క్యూ4)లో స్టాండ్‌అలోన్‌ ప్రాతిపదికన రూ.1,351 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. హోమ్‌ కేర్‌ బిజినెస్‌ అమ్మకాలు జోరుగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని హెచ్‌యూఎల్‌

పీఎన్‌బీ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌

Wednesday 16th May 2018

అధ్వాన్న ఫలితాలే కారణమన్న బ్రోకరేజ్‌లు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అత్యంత అధ్వాన్న ఫలితాలు ప్రకటించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు బ్రోకరేజ్‌లు షాక్‌ ఇచ్చాయి. బ్యాంకు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. - ఎడెల్‌వీస్‌: రేటింగ్‌ను కొనొచ్చు నుంచి తగ్గించుకోండికి డౌన్‌గ్రేడ్‌ చేసింది. టార్గెట్‌ను మాత్రం యధాతధంగా రూ.70 వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఎదురుగా ఉన్న సవాళ్లు, అస్థిరతలు బ్యాంకుపై నమ్మకానికి సవాల్‌ అని తెలిపింది. ఇవన్నీ కలిపి బ్యాంకు  వాల్యూషన్‌,

Most from this category