STOCKS

News


కనిష్టస్థాయి నుంచి కర్నాటక బ్యాంక్‌ జూమ్‌

Wednesday 16th May 2018
Markets_main1526464948.png-16508

  • ఏడాది కనిష్టానికి షేరు ధర
  • ఏడాది కనిష్టం నుంచి 12శాతం ర్యాలీ

ముంబై:- ఆర్థిక ఫలితాల్ని వెల్లడించిన నేపథ్యంలో ప్రైవేటు రంగ కర్నాటక బ్యాంక్‌ షేరు కనిష్టస్థాయి నుంచి జోరుగా ర్యాలీ జరిపింది.  గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం(క్యూ4)లో నష్టాలు నమోదు కావడంతో నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలో షేరు 3.30శాతం నష్టపోయి రూ.107.30ల వద్ద ఏడాది కనిష్టస్థాయికి పతనమైంది. అయితే  మొండి బకాయిలకు కేటాయింపుల్ని పూర్తిచేసారన్న సానుకూల అంశంతో షేరు తిరిగి పుంజుకుంది. నేటి ఇంట్రాడే కనిష్టస్థాయి(రూ.107.30) నుంచి ఏకంగా 12శాతం ర్యాలీ చేసి రూ.120.25ల గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.3:15ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.110.85)తో పోలిస్తే 5శాతం లాభంతో రూ.116.75ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.107.30లు రూ.181గా నమోదయ్యాయి.



You may be interested

మోడీ ఫ్యాక్టర్‌ కొనసాగుతోంది: యూబీఎస్‌

Wednesday 16th May 2018

ముంబై: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోనికి వస్తుందా? లేదా అనే అంశం దేశీయ స్టాక్‌ మార్కెట్‌కు అత్యంత కీలకంగానే ఉందని యూబీఎస్‌ ఇండియా రిసెర్చ్ హెడ్‌ గౌతం చౌచారియా అన్నారు. వచ్చే 12 నెలలకాలంలో మల్టీపుల్స్‌కు కూడా ఇదే అంశం చోదక శక్తిగా కనబడతుందని విశ్లేషించారు. 2019 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. కర్ణాటక ఎన్నికల అంశాన్ని మార్కెట్‌ డిస్కౌంట్‌ చేస్తుందని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్,

ఇండియా ఈక్విటీలపై అండర్‌వెయిట్‌!

Wednesday 16th May 2018

క్రెడిట్‌ సూసీ రేటింగ్‌ ఆసియా పసిఫిక్‌ మార్కెట్లలో భారత ఈక్విటీలపై అండర్‌వెయిట్‌గా ఉన్నట్లు అంతర్జాతీయ బ్రోకింగ్‌ దిగ్గజం క్రెడిట్‌ సూసీ వెల్లడించింది. భారత ఈక్విటీ మార్కెట్ల ప్రీమియం గరిష్ఠస్థాయిలకు చేరిందని అభిప్రాయపడింది. ఇటీవల కాలంలో ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌ లాంటి దేశాల ఈక్విటీ సూచీలు భారీగా నష్టపోయాయి. అయితే ఈ సమయంలో ఎంఎస్‌సీఐ ఇండియా సూచీ మాత్రం పెద్దగా పతనం కాలేదని క్రెడిట్‌ సూసీ తెలిపింది. ఇతర సూచీలు దాదాపు 19 శాతం

Most from this category