STOCKS

News


కర్ణాటక బ్యాంక్‌... రుణ నాణ్యత మెరుగు

Friday 12th January 2018
Markets_main1515781592.png-13100

  • 28 శాతం ఎగిసిన నికర లాభం

 ముంబై: ప్రైవేట్‌ రంగ కర్ణాటక బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 28 శాతం ఎగసింది. గత క్యూ3లో రూ.69 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.87 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్‌ తెలియజేసింది. ఆర్జించిన వడ్డీ ఆదాయం నుంచి చెల్లించిన వడ్డీ ఆదాయాన్ని తీసివేయగా వచ్చే నికర వడ్డీ ఆదాయం 20 శాతం పెరిగిందని పేర్కొంది. ఈ వడ్డీ ఆదాయం రూ.377 కోట్ల నుంచి రూ.452 కోట్లకు వృద్ధి చెందింది. రుణ నాణ్యత మెరుగుపడినట్లు బ్యాంక్‌ తెలిపింది. స్థూల మొండి బకాయిలు 4.13 శాతం నుంచి 3.97 శాతానికి, నికర మొండి బకాయిలు 3.04 శాతం నుంచి 2.85 శాతానికి తగ్గాయని పేర్కొంది. ఇతర ఆదాయం 46 శాతం వృద్ధితో రూ.195 కోట్లకు, నిర్వహణ లాభం 87 శాతం వృద్ధితో రూ.322 కోట్లకు చేరుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో రూ.226 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు ఈ క్యూ3లో రూ.196 కోట్లకు తగ్గాయని, అయితే గత క్యూ3 కేటాయింపులైన రూ.101 కోట్లతో పోలిస్తే రెట్టింపయ్యాయని బ్యాంక్‌  తెలిపింది. నికర లాభం 28 శాతం పెరగడం, మొండి బకాయిలు తగ్గి రుణ నాణ్యత మెరుగుపడడంతో బీఎస్‌ఈలో కర్ణాటక బ్యాంక్‌ షేర్‌ 3 శాతం లాభంతో రూ.167 వద్ద ముగిసింది. 


 



You may be interested

హిందుస్థాన్‌ షిప్‌యార్డుకు రూ.1800 కోట్ల ఆర్డర్‌

Friday 12th January 2018

అల్లిపురం (విశాఖ దక్షిణ): విశాఖలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ రూ.1800 కోట్ల భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. మాస్కోకు చెందిన యునైటెడ్‌ షిప్‌ బిల్డింగ్‌ కార్పొరేషన్‌... ఈకేఎం క్లాస్‌ సబ్‌మెరైన్‌ నిర్మాణం కోసం ఈ ఆర్డర్‌ను ఇచ్చింది. యునైటెడ్‌ షిప్‌ బిల్డింగ్‌ డైరెక్టర్‌ అలెక్సే వి డిక్కీ, మిలిటరీ అండ్‌ టెక్నికల్‌ కార్పొరేషన్‌  ప్రతినిధుల బృందం ఈ నెల 10న విశాఖకు వచ్చి షిప్‌యార్డు అధికారులతో మూడు రోజుల పాటు  చర్చలు

అంచనాలు అందుకున్న ఇన్ఫీ!

Friday 12th January 2018

 38 శాతం పెరిగి రూ.5,129 కోట్లకు నికరలాభం  కలిసొచ్చిన రూ.1,432 కోట్ల పన్ను ప్రయోజనం...  ఆదాయం రూ.17,794 కోట్లు; 3 శాతం వృద్ధి...  ఈ ఏడాది వృద్ధి అంచనాలు యథాతథంగా కొనసాగింపు బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌... అంచనాలకు అనుగుణంగానే ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో (2017-18, క్యూ3) అనుబంధ సంస్థలన్నిటితో కలిపి కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 38.3 శాతం ఎగబాకి రూ.5,129 కోట్లకు

Most from this category