STOCKS

News


జ్యోతి ల్యాబ్స్‌ 1:1 బోనస్‌

Wednesday 16th May 2018
news_main1526489637.png-16530

  • ఒక్కో షేర్‌కు 50 పైసల డివిడెండ్‌
  • 29 శాతం తగ్గిన నికర లాభం 

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీ జ్యోతి ల్యాబ్స్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్‌లో 29 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.107 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.76 కోట్లకు తగ్గిందని జ్యోతి ల్యాబ్స్‌ తెలిపింది. తమ కంపెనీలో విలీనమైన హెంకెల్‌ మార్కెటింగ్‌ కంపెనీల నష్టాల రద్దుకు సంబంధించి పన్ను రివర్సల్‌  కారణంగా నికర లాభం తగ్గిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.468 కోట్ల నుంచి రూ.558 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.424 కోట్ల నుంచి రూ.451 కోట్లకు పెరిగాయని వివరించింది. నిర్వహణ లాభం 46 శాతం పెరిగి రూ.88 కోట్లకు చేరిందని, నిర్వహణ లాభ మార్జిన్‌ 3.5 శాతం వృద్ధితో 17.1 శాతానికి ఎగసిందని తెలిపింది. రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు 50 పైసల డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. అంతే కాకుండా ఒక ఈక్విటీ షేర్‌కు మరో ఈక్విటీ షేర్‌ను బోనస్‌గా(1:1) ఇవ్వనున్నామని తెలిపింది. 

ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016-17లో రూ.204 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 12 శాతం తగ్గి రూ.179 కోట్లకు చేరిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.1,760 కోట్ల నుంచి రూ.1,813 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో జ్యోతి ల్యాబ్స్‌ షేర్‌ 5 శాతం లాభంతో రూ.392 వద్ద ముగిసింది. 
 



You may be interested

టెలినార్‌ ఉద్యోగుల కష్టాలు

Wednesday 16th May 2018

ఇంటికి పంపేందుకు సిద్ధమౌతోన్న ఎయిర్‌టెల్‌   హైదరాబాద్‌: టెలినార్‌ ఇండియా, ఎయిర్‌టెల్‌ విలీనం టెలినార్‌ ఉద్యోగుకుల శాపంగా మారింది. కొంత మందిని ఇంటికి సాగనంపడానికి ఎయిర్‌టెల్‌ సిద్ధమౌతోంది. ఈ విషయానికి సంబంధించి భారతీ ఎయిర్‌టెల్‌ నుంచి టెలినార్‌ ఉద్యోగులకు ఈ-మెయిల్స్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. విలీనం అనంతరం టెలినార్‌ ఇండియాలోని ఉద్యోగులందరూ ఎయిర్‌టెల్‌లో సరైన స్థాయి ఉద్యోగానికి పొందలేరని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. కాగా టెలికం విభాగం మే 14న భారతీ ఎయిర్‌టెల్‌, టెలినార్‌ ఇండియా

నెలలో రూ.1,000 కోట్లు డిపాజిట్‌ చేయండి

Wednesday 16th May 2018

జైప్రకాష్‌ అసోసియేట్స్‌కు సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: గృహ కొనుగోలుదారులకు తిరిగి చెల్లింపులు చేసేందుకు గాను జూన్‌ 15 నాటికి మరో రూ.1,000 కోట్లు డిపాజిట్‌ చేయాలని సుప్రీంకోర్టు జైప్రకాష్‌ అసోసియేట్స్‌ను ఆదేశించింది. ఈ మేరకు డిపాజిట్‌ చేస్తే అనుబంధ సంస్థ జైపీ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ లిక్విడేషన్‌ (అమ్మకం) ప్రక్రియపై స్టే కొనసాగుతుందని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఆధ్వర్యంలోని బెంచ్‌ స్పష్టం చేసింది. ఒకవేళ గడువు నాటికి చెప్పిన మేర డిపాజిట్‌ చేయడంలో

Most from this category